For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానం కలగకపోవడానికి అసలైన కారణాలివేనా...!?

|

ఆధునిక కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు కెరియర్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. దాంతో పెరుగుతున్న లేట్ మ్యారేజ్‌లు, ఉద్యోగాల్లోని ఒత్తిడి, సక్రమంగా లేని పని వేళలు, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఏర్పడే హార్మోన్ల అసమతౌల్యం... ఇవన్నీ సంతానలోపానికి కొన్ని కారణాలు.

సంతానం అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం. కానీ ప్రస్తుతం చాలామంది స్త్రీలు కొన్ని రకాల కారణాల వల్ల సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సంవత్సరం పాటు ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు అవలంభించకుండా శృంగారంలో పాల్గొన్నా సంతానం కలుగకపోతే దీన్ని సంతానలేమి సమస్యగా పరిగణించవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే, అనేక మంది మహిళల్లో ఈ సమస్యకు ముఖ్య కారణాలేంటి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి ఉండేటప్పుడు స్త్రీ శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం సంతానలేమికి దారితీస్తుంది. గర్భనిరోధక మాత్రలు కూడా అండం విడుదలకు అవరోధంగా మారుతాయని చెపుతున్నారు.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

పీరియడ్స్: ప్రతి నెలా సక్రమంగా (రెగ్యులర్‌) నెలసరి రాకపోవడం, పీసీఓడీ, గర్భకోశ వ్యాధులు, ఫైబ్రాయిడ్స్, అధిక బరువు, థైరాయిడ్ గ్రంథి లోపాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి, ట్యూబల్ బ్లాకేజ్, సుఖవ్యాధులు మొదలైన వాటితో బాధపడుతున్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

భోజనం: సంతానలేమితో బాధపడే మహిళలు సమతుల్య ఆహారం తీసు కో వాలి. తద్వారా శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. గర్భం దా ల్చేందుకు, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు శరీరం అనువుగా ఉంటుంది. గోధుమ, సన్‌ఫ్లవర్‌ నూనె, ఓట్‌ మీల్‌ లాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం కన్నా కూరగాయల నుంచి అధిక శాతం ప్రొటీన్‌ శరీరానికి అం దేలా చూసు కోవాలి. కిడ్నీ బీన్స్‌, వైట్‌ బీన్స్‌, సోయాబీన్స్‌ లాంటి వి అధికంగా తీసుకోవాలి. కొవ్వు అధికంగా డెయిరీ ఉత్పత్తులు తీసుకోవాలి. డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌, మల్టీవిటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడాలి.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

వ్యాయామం: వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బీఎంఐ 18.5 నుంచి 25 కి.గ్రా / ఎం2 వరకు ఉండి, ఎలాం టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే స్ర్తీ, పురుషులి ద్దరూ వ్యాయామం చేయడం మంచిది. ఆహారంలో తీసుకునే కేరీలను తగ్గించడం (సమతుల్య ఆహారం తీసుకో వాలి), కేరీల వ్యయాన్ని అధికం చేయడం రెండూ చేస్తే శరీర బరువు తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా, తగినస్థాయిలో రోజుకు 30 నిమి షాల పాటు వ్యాయామం చేయడం మీ ఫిట్‌నెస్‌ను పెం చేందుకు తోడ్పడుతుంది. బరువుపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. వ్యాయామం చేయడం ఎండోర్ఫిన్స్‌ (హ్యాపీ హార్మోన్స్‌) స్థాయిని పెంచుతుంది. ఒత్తిళ్ళను తగ్గిస్తుంది. ఇతర రిలాక్సేషన్‌ టెక్నిక్‌ల ను కూడా ఆచరించవచ్చు.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

ధూమపానం: మగవారు పొగ తాగడం వల్ల స్మెర్ప్‌ కౌంట్‌ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు అధ్య యనాల్లో తేలింది. అంతేగాకుండా గర్భస్రావం, నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి చోటు చేసు కు నేందుకు అవకాశాలు అధికం అవుతాయి. భా ర్యాభర్తల్లో ఎవరికి పొగ తాగే అలవాటు ఉన్నా సహజ / కృత్రిమ గర్భధారణ అవకాశాలను మూడింట ఒక వంతు తగ్గించే అవకాశముంది.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

ఆల్కహాల్‌: మహిళలు మద్యం తీసుకోవడం గర్భస్థలోపాలతో శిశువులు పుట్టే అవకాశాన్ని అధికం చేస్తుంది. తల్లిరక్తంలో ఆల్కహాల్‌ సంబంధిత స్థాయి అధికంగా ఉంటే పుట్టిన శిశువుల్లో ఫీటల్‌ ఆల్కహాల్‌ సిండ్రోమ్‌ (ఎదుగుదలలో లోపాలు / ఇతరత్రా సమస్యలు) కు దారితీస్తుంది. ఆల్కహాల్‌ తీసుకోవడం మగ వారిలో స్పెర్మ్‌కౌంట్‌ను తగ్గిస్తుంది.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

మాదకద్రవ్యాలు: మార్జువానా, అనబోలిక్‌ స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకం మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ను తగ్గిస్తుంది. గర్భవతులు గనుక కొకైన్‌ను ఉప యోగిస్తే అది పుట్టబోయే శిశువుకు కిడ్నీ సమస్యలు కలిగిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, గర్భవతిగా ఉన్న కాలంలో మాద ద్రవ్యాలు లాంటివాటికి దూరంగా ఉండాలి.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

కెఫైన్‌: గర్భధారణ యోచనలో ఉన్న మహిళలు రోజుకు ఒకటి లేదా రెం డు కప్పులకు మించి కాఫీ తీసుకోకపోవడం మంచిది. చాలా సం దర్భాల్లో కెఫైన్‌ గర్భధారణ శక్తిని తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రోజుకు 3 కప్పులకుమించి కాఫీ తాగిన సందర్భాల్లో సంతాన సాఫల్య సమస్యలు ఎదురైనట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

థైరాయిడ్ సమస్య: వారసత్వంగా అంటే స్త్రీ కుటుంబంలో ఎవరైనా సంతానలేమి సమస్యలతో గానీ, థైరాయిడ్ గ్రంథి లోపాలతో గానీ బాధపడుతున్నా ఈ సమస్య అనేది ఏర్పడుతుందని వైద్యులు చెపుతున్నారు.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

వివిధ రకాల చికిత్సలు: కొన్నిరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే మం దు లు గర్భధారణ శక్తిపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. సం తానం కోసం ప్రయత్నించే మహిళలు ఇలాంటి మందులను గనుక వాడుతుంటే ప్రత్యామ్నాయ మందుల కోసం డాక్టరును సంప్రదించాలి.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

స్థూలకాయం సంతాన సాఫల్యతను ప్రభావితం చేస్తుందా?: సంతానలేమికి, రుతుచక్రం సజావుగా లేకపోవడానికి, స్థూలకా యానికి దగ్గరి సంబంధం ఉంది. స్థూలకాయం ఉన్న వారిలో పలువురు ఆహారం, వ్యాయామం సంబంధిత అంశాల్లో మా ర్పుల కారణంగా సంతాన సాఫల్యతను పెంచుకున్న దాఖలా లెన్నో ఉన్నాయి. ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం అధి కంగా ఉండడాన్ని అధిక బరువుగా పరిగణిస్తారు. బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 25-30గా ఉండడాన్ని అధిక బరువుగా, అంతకుమించితే స్థూలకాయంగా పరిగణిస్తారు.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

బరువు తక్కువగా ఉండడం కూడా సమస్యేనా?: బరువు తక్కువగా ఉండడం కూడా అండాశయ సంబంధిత సమ స్యలకు, తద్వారా సంతానలేమికి కారణమవుతుంది. ఉండాల్సిన బరువులో 10-15 శాతం తక్కువగా ఉండడం కూడా సమస్యలకు కారణం కావచ్చు. తక్కువ బరువు ఉండే మహిళలు బరువు పెంచు కున్న తరువాత సంతాన సాఫల్యత అవకాశాలు పెరిగిన దాఖలాలున్నాయి.

సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

దాంపత్య అనుబంధం: పీరియడ్స్‌ పూర్తయిన తరువాత వారానికి కనీసం మూడు, నాలుగుసార్లు కలుసుకోవాలి. అండం ఫలవంతం అయ్యే సమయాన్ని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి.

English summary

Thirteen Reasons Why You're Not Getting Pregnant | సంతాన లేమికి అసలైన కారణాలు ఇవే...!

There's nothing worse than the disappointment of a negative pregnancy test when you are trying to conceive. Many couples try to get pregnant for months before ever seeing that exciting "positive" line on the pregnancy test, but there are some major pitfalls you should avoid to help speed up your conception success. Here are the 13 most likely reasons that you aren't getting pregnant.
Story first published: Friday, March 1, 2013, 18:07 [IST]
Desktop Bottom Promotion