For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల పెంపకప్రపంచంలోకి వెళ్ళే ముందు ఆచరించవలసిన 10 చిట్కాలు

By Super
|

మీ ప్రపంచంలోకి చిన్నారికి ఆహ్వానం పలుకుతున్నారా! వావ్....అద్భుతం! మీరు పలికే స్వాగతానికి అన్ని విధాలా తయారయి ఉన్నారా? ఇక్కడ మీరు తల్లితండ్రుల హోదా తీసుకునేముందు ఆలోచించాలిసిన కొన్ని చిట్కాలను పొందుపరుస్తున్నాము. చూడండి.

మీ బరువు పరిశీలించండి

మీ బరువు పరిశీలించండి

మీ బరువును తూచుకోండి. తక్కువ బరువు లేదా అధిక బరువు, ఈ రెండు స్థితులు కూడా గర్భం ధరించే ముందు లేదా తరువాత కాని అపాయకరమే.

మీరు బరువు తక్కువగా ఉంటే, అది అండోత్సర్గము ప్రభావితం చేస్తుంది. మీరు అధిక బరువు కలిగిఉంటే, అది మధుమేహం మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, గర్భం ధరించే ముందు ఒకసారి మీ బరువును చూసుకోండి.

మీఋ వేసుకునే మందులను చూసుకోండి

మీఋ వేసుకునే మందులను చూసుకోండి

మీరు అలెర్జీ, తలనొప్పి లేదా ఇతర సంబంధ సమస్యల కోసం మందులు తీసుకుంటున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి! ఇందులో కొన్ని మందులు మీ బేబికి అపాయకరంగా ఉండవొచ్చు. మీరు తీసుకునే మందులు లేదా సిరప్లు గురించి మీ డాక్టరుకు తెలియచేయండి. అలాగే ఏ మందులు వాడవొచ్చో లేదా ఏవి వాడకూడదో సలహా తీసుకోండి.

పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని మీ రిఫ్రిజిరేటరులో నిల్వ ఉంచుకోండి

పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని మీ రిఫ్రిజిరేటరులో నిల్వ ఉంచుకోండి

పండ్లు, పండ్ల రసాలు మరియు ఇతర మల్టీవిటమిన్స్, ప్రోటీన్లు మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలతో మీ ఫ్రిజ్ ను నింపండి. మీ ఆహారంలో కూరగాయలు మరియు సోయా ఉత్పత్తులు, గింజలు, మరియు బీన్స్ ఉన్న పూర్తీ పోషకాహారాలు ఉండేట్లుగా చూసుకోండి.

దంత వైద్యుడిని సంప్రదించండి

దంత వైద్యుడిని సంప్రదించండి

ఆరోగ్యకరమైన గర్భం కోసం దంత ఆరోగ్యం కూడా అవసరమే. గమ్ రుగ్మతలు, బాక్టీరియా ఇన్ఫెక్షన్, అపరిపక్వజననం మరియు ప్రీక్లామ్ప్సియా వంటివాటికి దారితీయవచ్చు. గర్భానిర్ధారణ అయిన తరువాత ఎక్స్-రే కు వెళ్ళలేరు. కాబట్టి, కొంత సమయం వెచ్చించండి, మీ దంతవైద్యుడిని సంప్రదించండి మరియు వెంటనే దంత సమస్యను పరిష్కరించుకోండి.

పునరుద్ధరణ

పునరుద్ధరణ

మీరు మీ డ్రీం హౌస్ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంటే, అది మీ గర్భధారణకు ముందే చేయించండి. దీనికి వాడే పెయింట్స్, కఠినమైన క్లీనర్స్ మరియు పురుగుమందులు హానికరమైన రసాయనాలు కలిగిఉంటాయి. అవి తల్లి మరియు బిడ్డకు, ఇద్దరికీ మంచివి కావు.

డాక్టర్ తో సంప్రదించండి

డాక్టర్ తో సంప్రదించండి

మీరు గర్భం ధరించాలి అన్న నిర్ణయానికి మూడు నెలల ముందే మీ వైద్యుడిని సంప్రదించండి. మీ రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ మరియు హెమోగ్లోబిన్ వంటివి సరిఅయిన స్థితిలో ఉన్నాయా, లేవా నిర్ధారించుకోండి. మీ కుటుంబ నేపథ్యం ఆధారంగా, డాక్టర్ జన్యు పరీక్ష కోసం మిమ్మలిని సిఫారసు చేయవచ్చు.

రిలాక్స్

రిలాక్స్

అధిక ఒత్తిళ్ళకు లోనవటం వలన మీరు గర్భం ధరించలేకపోవొచ్చు. అందువలన గర్భం ధరించాలి అన్న నిర్ణయం తీసుకున్నప్పటినుండి మీరు ఏ రకమైన ఒత్తిడికి లోనవకుండా మంచి పుస్తాకాలు చదవండి, స్నేహితులతో సంతోషంగా గడపండి, మంచి కామెడి చిత్రం చూడండి, మంచి సంగీతాన్ని వినండి, ఏ ఆలోచనలు లేకుండా మంచి గాఢనిద్ర పోండి లేదా మీకు ప్రశాంతత, మనోల్లాసం కలిగించే ఏ పనైనా చేయండి. కాని ఒత్తిడి వదిలించుకోవటం కోసం మద్యం లేదా మాత్రలు వినియోగించవద్దు.

ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా తీసుకోండి

ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా తీసుకోండి

ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉన్న పాలకూర, ఆకు కూరలు మరియు విటమిన్ బి ఎక్కువగా తీసుకోవటం వలన "స్పైన బిఫిడ " (జన్మతః వొచ్చే లోపము) ప్రమాదాన్ని తగ్గించుకోవొచ్చు.

వైన్, కెఫైన్ సిగరెట్స్ ను పూర్తిగా మానేయండి

వైన్, కెఫైన్ సిగరెట్స్ ను పూర్తిగా మానేయండి

గర్భం ధరించాలి అనే నిర్ణయానికి ముందు నుండి కూడా వైన్, కెఫైన్ సిగరెట్స్ ను పూర్తిగా మానేయండి. పొగ పీల్చటం మరియు వైన్ మీ శిశువు మానసిక లోపాలకు లేదా గుండెజబ్బులకు కారణం కావచ్చు. ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం కూడా గర్భస్రావానికి దారితీస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.

ఆర్ధికపరమైన లెక్కలు చూసుకోండి

ఆర్ధికపరమైన లెక్కలు చూసుకోండి

మీకు తెలుసు, ద్రవ్యోల్బణం త్వరితగతిన పెరుగుతోందని. ఒక శిశువును పరిగణలోకి తీసుకునేముందు, మీరు మీ ఆర్థికస్థితిగతులను బేరీజు వేసుకుని మీ కలలపంట, చిన్నారిని స్వాగతించండి. ప్రేగ్నేన్సి కి మరియు డెలివరికి అయ్యే ఖర్చు లెక్కించుకోండి . మీరు ఆరోగ్య భీమా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆ సంస్థకి కాల్ చేయండి మరియు ప్రినేటల్ కవరేజ్ గురించి విచారించండి, వారు అందిస్టారు.

English summary

10 Tips before Propelling into the World of Parenting

Are you planning for welcoming a little guest in your world? Wow….it’s great! But, have you done with all the preparations? Here are some tips that you should consider before plunging to parenthood.
Desktop Bottom Promotion