For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందాలంటే ఈ ఆహారాలను ఖచ్ఛితంగా తినడం మానాలి

|

సహజంగా గర్భం పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండాలి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారో అంత త్వరగా గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం స్త్రీ మరియు పురుషులు ఇద్దరిలోనూ సంతోనోత్పత్తికి మరియు ఆహారానికి అవినాభావ సంబంధం ఉందని నిర్ధారిస్తుంటారు . గర్భం పొందాలంటే ఒక ఫర్ఫెక్ట్ డైట్ ను మీరు ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. అందుకే కొన్ని వ్యతిరేక ఆహారాలను గర్భం పొందడానికి ముందు నివారించాల్సి ఉంటుంది.

ఎప్పుడైతే ఈ ఆహారాలను తినడం నివారిస్తారో, అప్పుడు గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఆహారాలను గర్భం పొందడానికి ముందు నుండే తినకుండా నివారించడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఎటువంటి ప్రమాధం ఉండదు.

ప్రస్తుత రోజుల్లో ఫెర్టిలిటిని మరింత సమస్యాత్మకంగా మార్చే అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు స్మోకింగ్, డ్రింకింగ్ ఇవే కాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల గర్భం పొందడం మరింత కష్టంగా మారుతున్నది.

కాబట్టి ముఖ్యంగా గుర్గుంచుకోవల్సినవి: బేబీకోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఈ క్రింది తెలిపిన ఆహారాలను ఖచ్చితంగా మీ డైట్ నుండి తొలగించాలి మరియు మీ జీవనశైలి కోసం ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి.

మెర్క్యురి ఫిష్ అంటే మీకు చాలా ఇష్టమా? మీకు సీఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టంగా ఉండి, వాటిని మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భం పొందే అవకాశాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా హై మెర్క్యురి ఫిష్, తున, స్వార్డ్ ఫిష్ వంటి మూడు రకాల చేపలను గర్భం పొందడానికి ముందు నుండి నివారించాలి.

సోడా : సోడాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను త్వరగా పెంచుతుంది . గర్భం పొందడానికి ముందు నుండే దీన్ని నివారించాల్సి ఉంపటుంది.

ఆల్కహాల్: ఫెర్టిలిటీతో సంబంధం కలిగిఉన్న ఆల్కహాల్ ను గర్భం పొందడానికి ముందు నుండే నివారించాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది వంధ్యత్వానికి గురిచేస్తుంది మరియు అబార్షనకు కూడా దారితీస్తుంది.

కాఫీ: కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంతే కాదు, ఈ కెఫిన్ ఐరన్ తో కలిసిపోయి సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుంది.

సోయా: కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువగా సోయా తీసుకొనే వారిలో ప్రత్యుత్పతి సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. మీరు సంతానలేమితో బాధపడుతున్నట్లైతే, మీరు ఖచ్చితంగా సోయా ప్రొడక్ట్స్ ను నివారించాల్సి ఉంటుంది.

వండని ఆహారాలు: గర్భం పొందాలని ప్లాన్ చేసుకొనే వారు ఖచ్చితంగా నివారించాల్సిన ఆహారాల్లో వండని లేదా పచ్చి ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి . సరిగా ఉడకని మాంసాహారాలు మరియు చేపలు మరియు చీజ్ వంటివి తీసుకోవడం వల్ల సాల్మొనెల్లాను ప్రమాధంలో పడేస్తుంది. ీ బ్యాక్టీరియా పిండం మీద చాలా చెడుగా ప్రభావం చూపుతుంది.

Foods To Avoid Before Getting Pregnant

English summary

Foods To Avoid Before Getting Pregnant

The sooner you start eating well, the more likely you will be able to get pregnant. According to experts, for men and women, food and fertility are connected. One needs to stick to a perfect balanced diet to boost your chances of becoming parents. That is why there are some foods to avoid before pregnancy!
Story first published: Friday, November 7, 2014, 16:36 [IST]
Desktop Bottom Promotion