For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రాంగ్ స్పెర్మ్ కౌంట్(వీర్యకణాల)ను పొందడం ఎలా

By Super
|

ఒక బిడ్డను కనడానికి ప్రణాళిక చేస్తున్నారా? మంచిది, మీ వీర్యకణాల ఆరోగ్యం గురించి ఏవైనా అనుమానాలు ఉంటే, వాటిని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలు తెలుసుకోవడం అవసరం, అంతేకాకుండా, విక్కీ డోనార్ సేవలను అద్దెకు తీసుకోవలనుకునేవారు!

తెలివిగా తినండి

తెలివిగా తినండి

శక్తివంతమైన వీర్యకణాలను పొందలనుకునేవారికి ఆక్రోట్లు వైద్యుల ద్వారా సిఫార్సుచేయబడింది. ఆక్రోట్లు టేస్తోస్టేరాన్ పద్ధతిని అభివృద్ది పరిచే జింక్ ను కలిగి ఉంటాయి, ఇది వీర్యకణాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. జింక్ ఉండే అరటిపండ్లు, బాదం కూడా సిఫార్సుచేయబడిన ఇతర ఆహార పదార్ధాలు.

శక్తివంతమైన వీర్యకణాలను పొందడం ఎలా

శక్తివంతమైన వీర్యకణాలను పొందడం ఎలా

చెడిపోయిన DNA రక్షణకు, పనిచేయని వీర్యకణాలు కలవారికి ఆరంజ్ లు, స్ట్రాబెర్రీ లు బాగా సహాయపడతాయి. విటమిన్ E సమృద్ధిగా ఉండే పాలకూర, వెన్న మొదలైన ఆహార పదార్ధాలు కూడా సంతానోత్పత్తిని రేటును మెరుగుపరచి, వీర్యకణాల నాణ్యతను అభివృద్ది చేయడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన విటమిన్ D ని తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా వీర్యకణాల చలనాన్ని బాగా మెరుగుపరుస్తాయి. ఎటువంటి పరిస్థితులలో జంక్ ఫుడ్ తీసుకోకూడదు.

జిమ్ కి వెళ్ళడం

జిమ్ కి వెళ్ళడం

మీ కండరాలను, యాబ్స్ ను పెంచుకోవడానికి కేవలం జిమ్ చేయడం వల్ల సరిపోదు. వీర్యకణాల నాణ్యతకు ఉపయోగపడే టేస్తోస్టేరాన్ స్థాయిలను పెంచడానికి కఠినమైన వ్యాయామ సెషన్లు సహాయపడతాయి. అందువల్ల, మీ రోజువారీ పనులలో కఠినమైన పనులను కూడా ఒక భాగంగా చేయడం తప్పనిసరి.

పొగత్రాగడ౦ వదిలేయండి - చురుకుదనం, నిస్త్రాణం

పొగత్రాగడ౦ వదిలేయండి - చురుకుదనం, నిస్త్రాణం

ఇప్పుడు మీరు ఈ విషయాన్నీ పదేపదే చెప్పిఉ౦టారు, కానీ మీరు దీన్ని గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది. పొగత్రాగడం DNA వీర్యకణాలపై ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుంది, వీర్యకణాల అసమానతలను కలిగిస్తుంది. అరుదుగా పొగత్రాగడం వల్ల ప్రమాదం లేదని మీరు అనుకుంటే, మీరు మీ దురభిప్రాయాన్ని తొలగించుకోవడం చాలా అవసరం. మీరు బార్ లకు వెళ్ళినపుడు అన్నివైపుల నుండి వచ్చే ధూమపానాన్ని మీరు పీల్చడం వల్ల బిడ్డను కనే అవకాశాలను పోగొట్టుకుంటారు.

సురక్షిత శృంగారాన్ని ఆచరించండి

సురక్షిత శృంగారాన్ని ఆచరించండి

క్లమిడియా, గోనోర్రియా అనేవి మీ వీర్యకణాలను ప్రత్యక్షంగా అంటుకునే కొన్ని అంటువ్యాధులు. ఇవి లైంగికంగా ప్రసరించే అంటువ్యాధులు, వీటిని సురక్షిత శృంగారాన్ని ఆచరించడం వల్ల మాత్రమే నివారించవచ్చు. కాబట్టి మీ కోరికలను నియంత్రించుకోండి, మీతో పడుకోవడానికి సిద్ధపడే ప్రతి అందమైన పడుచుతో శృంగారం చేయవద్దు. ఎప్పుడూ కండోమ్ ఉపయోగించండి.

స్క్రోటం వద్ద వేడి తగలకుండా చూడండి

స్క్రోటం వద్ద వేడి తగలకుండా చూడండి

మీరు సినిమా చూసేటపుడు లేదా తీరికగా ఇంటర్నెట్ సర్ఫింగ్ చేసేటపుడు లాప్టాప్ మీ వొడిలో పెట్టుకుని మంచం మీద పడుకోవడానికి ఎంత ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల వేడి నేరుగా మీ వృషణాలలోకి ప్రవేశిస్తుంది, మీరు శక్తివంతమైన వీర్యకణాలను కావాలనుకుంటే దానిని మర్చిపోండి. చివరికి వేడిగా ఉన్న కారు సీటు మీద కూర్చోవడం కూడా మంచిది కాదు.

శక్తివంతమైన వీర్యకణాలను పొందడం ఎలా

శక్తివంతమైన వీర్యకణాలను పొందడం ఎలా

ఈ విషయాలతో పాటు, మీరు ఎక్కువ ఒత్తిడిని, అధిక శ్రమతో కూడిన వ్యాయామాలను చేయకుండా శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. ఫలదీకరణం అనేది ఖర్చులేని ఆస్థి, దానిని సంరక్షించుకోవడం మంచిది!

English summary

How To Get Strong Sperm

Planning to have a baby? Well, in case you have doubts over the health of your sperm, knowing some ways to boost it is a must. After all, who wants to hire the services of a Vicky Donor!
Story first published: Sunday, June 29, 2014, 9:43 [IST]
Desktop Bottom Promotion