For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ అయిందా..?డోంట్ వర్రీ: ఈ సూచనలు మీకోసమే

|

చిన్ని చిన్న పాదాలు, బుల్లిబుల్లి చేతులు, ముట్టుకుంటే మాసిపోయే బుగ్గలు...ఇలా గర్భం ధరించినప్పటి నుంచి ప్రతి మహిళా తన ప్రతి రూపం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఏవైనా అనారోగ్యకారణాల వల్ల గానీ మిస్ క్యారేజ్(అబార్షన్) జరిగితే, ఆ మహిళ తన జీవితంలో సర్వస్వం కోల్పోయినంత బాధపడుతుంది. అయితే తన కలలన్నీ కలలుగానే మిగిలిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మిస్ క్యారేజ్ అయిన తర్వాత కూడా తిరగి గర్భం ధరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మిస్ క్యారేజ్ కు దారితీసే కారణాల గురించి ఈ సమస్య ఉత్పన్నమవకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...

పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోని మహిళంటూ ఉండదు. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల చాలా మందిలో గర్భం రాకపోవడం, ఆలస్యంగా రావడం గమనిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో గర్భం ధరించినా మధ్యలోనే మిస్ క్యారేజ్ అవుతుంది. ఇలాంటి వారందరికీ ఎదురయ్యే ప్రశ్న‘నాకే ఎందుకిలా జరుగుతోంది?'అని. అయితే ఆరోగ్యపరమైన అంశాలతో పాటు ఇతరత్రా అనేక కారణాలు మిస్ క్యారేజ్ కు దారితీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Reasons For Miscarriage In First Pregnancy

క్రోమోజోమ్స్ లో తేడా: క్రోమోజోములు శరీరంలోని కణాలలో ఉండే కనిపించని నిర్మాణాలు. ఇవి మగవారిలో 23జతల, ఆడవారిలో 23జతలు ఉండాలి. గర్భం ధరించినప్పుడు తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23క్రోమోజోములు బిడ్డకు లభిస్తాయి. ఈ సంఖ్యాలో ఏదైనా తేడాలు వస్తే మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మాయ(ప్లాసెంటా)లో లోపాలు: గర్భం ధరించినప్పుడు తల్లి నుంచి బిడ్డకు మాయ ద్వారా కావాల్సిన శక్తి అందుతుంది. బిడ్డకు రక్తం కూడా దీని ద్వారా సరఫరా అవుతుంది. మాయలో ఏవైనా లోపాలుంటే బిడ్డకు రక్తం సరఫరా కాక బిడ్డ మరణించే అవకాశాలుంటాయి. లేటు వయస్సులో గర్భం ధరించడంతో పాటు బీపీ, మధుమేహం, స్థూలకాం వంటి సమస్యలతో బాధపడే మహిళల్లో మిస్ క్యారేజ్ అవకాశాలు అధికం. అందుకే ఈ వ్యాధులున్న వారు డాక్టర్ సలహాలు, సూచనలు జాగ్రత్తగా పాటించాలి.

ఇవే కాకుండా గర్భసంచికి ఇన్ఫెక్షన్లు సోకడం, గర్భాశయ ముఖద్వారం, వదులగా ఉండటం, ప్రొలాక్టిన్ అనే హార్మోను ఎక్కువగా విడుదల కావడం, శరీరంలో బిడ్డ శరీరానికి హాని కలిగించే యాంటీ బాడీలు ఉత్పత్తవడం వంటి కారణాల వల్ల కూడా గర్భం పోయే అవకాశాలున్నాయి.

గుర్తించడమెలా: గర్భధారణ సమయంలో చాలా మందికి అప్పుడప్పడూ రక్తస్రావమవుతూ ఉంటుంది. దీన్నే మిస్ క్యారేజ్ గా భావించి కంగారు పడుతుంటారు. అయితే మిస్ క్యారేజ్ జరిగినప్పుడు ముందు కొంచెంగా ప్రారంభమైన రక్తస్రావం తర్వత ఎక్కువ అవుతుంది. విపరీతమైన కడుపునొప్పి నడుము నొప్పి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది.

మిస్ క్యారేజ్ తర్వాత: మిస్ క్యారేజ్ తర్వాత అల్రాసోనోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షద్వారా గర్భాశయం పూర్తిగా ఖాళీ అయిందా లేదా?పరీక్షిస్తారు. ఒక వేళ పూర్తిగా ఖాళీ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే మాత్రం మందుల ద్వారా లేదా, చిన్న శస్త్రచికిస్త ద్వారా దాన్ని తొలగిస్తారు. దీని వల్ల మరోసారి గర్భధారణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. అయితే మళ్ళీ గర్బం ధరించడానికి కనీసం రెండు, మూడు నెలులు ఆగడం మంచిది. ఈ కాలంలో గర్భాశయం తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి చేరుకుంటుంది.

తీసుకోవల్సని జాగ్రత్తలు:
30-35వయస్సు దాటినిన తర్వాత గర్భం ధరించడం, బీపి, షుగర్ వంటి సమస్యలతో బాధపడటం ఇలాంటి సందర్భాల్లో మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకున్నా కదా..అయితే ముందునుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి బయటపడే అవకాశం ఉంది..
జాగ్రత్తలు: 1. సిగరెట్లు తాగేవారికి దూరంగా ఉండండి. అలాగే మీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లుంటే వెంటనే మానేయండి.
2. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలను నియంత్రణలో ఉంచుకోవాలి.
3. ఒత్తిడి తగ్గించుకోవాలి . ఒత్తిడి కూడా దీనికో ముఖ్య కారణం కావచ్చు.
4. గర్భం ధరించిన వెంటనే డాక్టర్ సలహాతో ఫోలిక్ ఆమ్లం, ఇతర పోషకాలతో కూడిన సప్లిమెంట్లను తీసుకోవాలి.
5. అలాగే డైట్ విషయంలో తప్పక డైటీషియన్ సలహాలు పాటించాలి. బిడ్డ ఎదుగుదలకు అవసరం అయ్యే పోషకాలందించే ఆహారాన్ని తీసుకోవాలి.
6. కాఫీ, టీలు తగ్గించి వాటికి బదులుగా పాలను తీసుకోవాలి.

English summary

Reasons For Miscarriage In First Pregnancy

You might have heard of many women who had a miscarriage during their first pregnancy. That is because it is very common for women to have a miscarriage in their first pregnancy. The causes of miscarriage remains the same in every pregnancy. However, you are most susceptible to a miscarriage when you conceive for the first time.
Story first published: Thursday, July 10, 2014, 16:15 [IST]
Desktop Bottom Promotion