For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందడానికి సహాయపడే 21 ఆహారాలు

By Super
|

త్వరగా గర్భం పొందడానికి సహాయపడే 21 ఆహారాలు

పెళ్లైన ప్రతి ఒక్క మహిళా కోరుకొనేది పిల్లలు కావాలని, కోరుకుంటారు. గతంలో ఆడపిల్లలకు 18నుండి 20ఏళ్ల లోపు పెళ్ళిళ్లు జరిగేవి. ఆవయస్సులో వారికి ఎటువంటి ఒత్తిడి ఉండకపోవడం, నిండు ఆరోగ్యంగా ఉండటం వల్ల వెంటవెంటనే పిల్లలు కలిగే వారు. కానీ, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎక్కువ చదువులు, కెరీర్ , ఉద్యోగం, అంటూ పెళ్లి వాయిదా వేయడం వల్ల వయస్సు ఎక్కువ అవ్వడం, సరైన టైమ్ కు పెళ్లికాకపోవడం ఒక సమస్య అయితే, ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద, మహిళల్లో ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

అయితే, మహిళ ఎప్పుడైతే గర్భం పొందడం కష్టంగా భావిస్తుందో, అప్పుడు అది సవాలుగా తీసుకోవాలి. చాలా వరకూ నిపుణుల అంచనా ప్రకారం మహిళలు సరైన ఆహారంను తీసుకోవడం వల్ల చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా ఈ సమస్య నుండి భయటపడవచ్చని తెలుపుతున్నారు. ఈ ఆహారాలు హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేయడం మాత్రమే కాదు, మహిళ త్వరగా గర్బం పొందడానికి కూడా సహాయపడుతుంది . అందుకు సహాయపడే కొన్ని టాప్ 21 ఫెర్టిలిటి ఫుడ్స్ ను డైటీషియన్ మరియు పోషకాహార నిపుణులైన డాక్టర్ నేహా సాన్ వాల్కా తెలుపుతున్నారు, గర్భం పొందాలని కోరుకొనే ప్రతి ఒక్క మహిళ వారి రెగ్యులర్ డైట్ లో వీటిని తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆహారాలేంటో ఒకసారి చూద్దామా...

గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ :

డాక్టర్ నేహా అభిప్రాయం ప్రకారం ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల, ఒక బలమైన ఎండోమెట్రియల్ లైనింగ్ ఏర్పడుతుందని (యూట్రస్ యొక్క లోపని పొర) , ఐరన్ అండం ఈ పొరకు బలంగా అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుందని తెలుపుతున్నారు.

క్యాబేజ్:

క్యాబేజ్:

మనలో చాలా మందికి క్యాబేజ్ తినడం అంటే ఇష్టముండదు, సంతానలేమి సమస్యతో బాధపడేవారికి క్యాబేజ్ తప్పనిసరిగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ది ఇండోల్ మెథానే అనే ఎంజైమ్ కలిగి ఉండటం వల్ల , ఈ కెమికల్ ఈస్ట్రోజెన్ మెటబాలిజం స్ట్రాంగ్ గా ఉంచడం వల్ల గర్భాశయంలో ఎటువంటి ఫైబ్రాయిడ్స్ మరియు ఎండో మెట్రియాసిస్ ఏర్పకుండా సహాయపడుతుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

గర్బం పొందాలని కోరుకొనే మహిళలకు ఇది ఒక సూపర్ ఫుడ్ గా సూచిస్తారు . ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్, మరియు అత్యధిక పోషకాంశాలుండుటం వల్ల ఇది ఒక పుష్కలమైన ఆహారంగా భావిస్తారు. అంతే కాదు ఇందులో ఇంకా, విటమిన్ సి ఎక్కువగా ఉండే, ఓవెరీస్ లో అండం ఉత్పత్తి అవ్వడానికి ఓవెలేషన్ కొరకు సహాయపడుతాయి.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

గర్భం పొందాలనే ప్రతి మహిళా కోరుకుంటుంది, గర్భం కోసం ప్రయత్నించే వారు, వారి రెగ్యులర్ డైట్ లో బేక్ చేసిన బంగాళదుంపలను చేర్చుకోవాలి. బంగాళదుంపలో విటమిన్ బి మరియు విటమిన్ ఇ, పుష్కలంగా ఉండటం వల్ల ఇది కణాల యొక్క ఉత్పత్తిని పెంచి, ఆరోగ్యకరమైన ఓవమ్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

పండ్లు ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంలో అత్యంత ప్రధానమైన ఆహారం . గర్భం పొందడానికి తయారుచేసే డైట్ ప్లాన్ లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారాల్లో పండ్లు అత్యంత ముఖ్యమైనవి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఓవరీస్ లోకి అండం విడుదల అవ్వడానికి సహాయపడుతుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మల్లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉండటంతో పాటు, మహిళలు మరియు పురుషుల్లో అవసరమనంత సెక్స్ హార్మోనులను పెంచుతుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

ఎవరికైతే రుతుక్రమంలో ఎటువంటి సమస్యలుండవో అటువంటి వారిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది మరియు గర్భం పొందడం సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, గర్భం పొందాలని కోరుకొనే వారు విటమిన్ బి6 అధికంగా ఉండే అరటిపండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం చాలా అవసరం. గర్భం పొందాలని కోరుకొనే మహిళలు, అరటి పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రుతుక్రమం కరెక్ట్ గా వస్తుంది, మరియు ఫెర్టిలిటిని మెరుగుపరుస్తుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్లో ఎక్కువ మ్యాంగనీస్, మినిరల్స్ మహిళల శరీరంలో రీప్రొడక్టివ్ హార్మోనులను ఉత్పత్తి చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. దాంతో పాటు, శరీరంలో తక్కువ మ్యాంగనీస్ ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుందని, దాన్ని కనుక భర్తీ చేయగలిగితే, గర్భం పొందే అవకాశాలు ఎక్కువ.

గుడ్లు:

గుడ్లు:

మహిళల్లో సంతోనోత్పత్తిని పెంచడంలో గొప్పగా సహాయపడే ఆహారాల్లో గుడ్లు కూడా ప్రధానమైనవి. ఎందుకంటే, వీటిలో కోలిన్, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ మరియు విటమిన్ డి పుష్కలంగా ప్రతి ఒక్క మహిళ గర్భం పొందడానికి గొప్పగా సహాయపడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

మీకు చేపలు తినడం ఇష్టపడినట్లైతే, సాల్మన్ ఫిష్ మీ బెస్ట్ ఫుడ్. ఈ ఫెర్టిలిటీ సూపర్ ఫుడ్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ అత్యవసరమైన న్యూట్రీషియన్ మహిళల్లో ప్రత్యుత్పత్తి పెంచడానికి సహాయపడటానికి ప్రధాన పాత్రపోషిస్తుంది.

ఓయిస్ట్రస్:

ఓయిస్ట్రస్:

గర్భం పొందాలని కోరుకొనే ప్రతి మహిళ వారి రెగ్యులర్ డైట్ లో ఓయిస్ట్రెస్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ సీ ఫుడ్ లో ఎక్కువ జింక్ కలిగి ఉంటుంది. ఇది జింక్ ఫార్మేషన్ కు సహాయపడి, అండం విడుదలకు సహాయపడుతుంది. దాంతో గర్భం పొందడం సులభం అవుతుంది.

షెల్ ఫిష్:

షెల్ ఫిష్:

షెల్ ఫిష్ మరో అద్భుతమైన సూపర్ ఫుడ్, వీటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది, ఇది ఈస్ట్రోజెన్ లెవల్స్ ను నార్మల్ గా నిర్వహించడానికి సహాయపడుతుంది. దాంతో అండం ఉత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది.

పసుపు:

పసుపు:

గర్భం పొందాలనుకొనే వారు వారి యొక్క రెగ్యులర్ డైట్ లో పసుపును తప్పనిసరిగా చేర్చుకోవాలి. పసుపు ఆహారాలకు మంచి రంగు, ఫ్లేవర్ మాత్రమే అందించడం కాదు, ఇది గర్భం పొండానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ లో ఫెర్టిలిటి బూస్టింగ్ పవర్ ఉన్నది.

చిల్లీ:

చిల్లీ:

స్పైసీ ఫుడ్స్, పచ్చిమిచ్చి, ఎండు మిర్చిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఇది ఒక ఫుర్టిలిటి సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, రీప్రొడక్టివిటీ సిస్టమ్ కూడా అసరం అయ్యే రక్తప్రవాహాన్ని అందిస్తుంది. అంతే కాకుండా పచ్చిమిర్చి, డీ స్ట్రెస్సింగ్ హార్మోన్ (ఎండోర్ఫిన్)ను ఉత్పత్తి చేస్తుంది.అందువల్ల శరీరం రిలాక్స్ అయ్యే, ఫెర్టిలిటిని పెంచుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఇన్ ఫెర్టిలిటి బూస్టింగ్ న్యూట్రిషియన్ ఫుడ్స్ విషయానికి వస్తే, లిస్ట్ లో టాప్ లో ఉండేది వెల్లుల్లి, ఎందుకంటే ఈ వంటగది ఆహారపదార్థంలో సెలీనియం, మినిరల్స్ పుష్కలంగా ఉండి, గర్భస్రావం జరగకుండా రక్షణకల్పించటంతో పాటు, గర్భం పొందడానికి కూడా సహాయపడుతాయి.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తలు మహిళలకు చాలా పవర్ ఫుడ్స్, ముఖ్యంగా త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారికి ఇవి వివిధ రకాల న్యూట్రీషియన్స్ అందించే ఒక సూపర్ రీప్రొడక్టివిటి ఫుడ్ . ఎందుకంటే, ఇందులో ఎక్కువ మొత్తంలో జింక్ కలిగి ఉండి , ఎంబ్రయోనిక్ స్టేజ్ లో సెల్ డీవియేషన్ ప్రొసెస్ ను ప్రధాన పాత్రను పోషిస్తుంది.

ఫ్లాక్ సీడ్స్:

ఫ్లాక్ సీడ్స్:

ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. మహిళల్లో ఫెర్టిలిటీ విషయంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. ప్రత్యుత్పత్తి అడ్డుపడే ఫ్రైబ్రాయిడ్స్ యొక్క సైజ్ ను తగ్గిస్తుంది. మరియు అందువల్ల ఫెర్టిలిటిని బూస్ట్ లా పనిచేస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడుతుంది . ఇందులో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ఆయిల్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, దాంతో ఫ్రీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ను నివారిస్తుంది.

కాడ్ లివర్ ఆయిల్:

కాడ్ లివర్ ఆయిల్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెత్తీ ఫ్యాట్స్, ఇవి హార్మోనల్ పెరుగుదలకు మరియు ఒవరీస్ యొక్క ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాడ్ లివర్ ఆయిల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ హార్మోనులు సాధారణంగా ఏర్పడటానికి సహాయపడుతాయి, దాంతో మహిళల్లో ప్రత్యుత్పతి వ్యవస్థ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బాదం:

బాదం:

అన్ని రకాల నట్స్(ఎండు ఫలాలు)ఆరోగ్యానికి మేలుచేసేవే అయినప్పటికీ, గర్భం పొందడానికి ప్రత్యేకంగా బాదం చాలా మంచిది, బాదం ది బెస్ట్ సూపర్ ఫుడ్. ఎందుకంటే, వీటిలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఫెర్టిలిటీ సూపర్ ఫుడ్ గా సూచిస్తున్నారు.

అందువల్ల , మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే కనుక, ఈ ఫెర్టిలిటి సూపర్ ఫుడ్స్ ను మీ డైట్ ప్లాన్ లో చేర్చుకొని, గర్భం పొందే ఎక్కువ అవకాశాలను పొందాలి. ఇవి మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఉండటంతో పాటు, ఈ ఆహారాలు మీ బడ్జెట్ సరిపోయే విధంగా కూడా సహాయపడుతాయి.

English summary

These 21 foods can help you get pregnant faster

One of the most precious and desirable moment for every women is to have a baby. But when a woman finds it difficult to become pregnant, it might take a toll on her. Although there might be many factors contributing to infertility in women, experts believe that having the right food can be a simple yet effective way.
Story first published: Monday, December 29, 2014, 16:33 [IST]
Desktop Bottom Promotion