For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానం కలగకపోవడానికి ఒబేసిటి(ఊబకాయమే)ప్రధాన కారణమా?

By Super
|

30 ఏళ్ళ శిల్పా సచ్ దేవ్ , హౌస్ వైఫ్, ఆమె రెండ సంవత్సరాలుగా గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్నది. అయితే ఎటువంటి ఫలితం లేదు. సచ్ దేవా జంట ఐవిఎఫ్ స్పెషలిస్ట్ లను సంప్రదించడానికి నిర్ణయించుకొన్నారు. ఐవిఎఫ్ ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం పొందడం ఫెయిల్ అయ్యింది. ఐవిఎఫ్ క్లీనిక్ లో టెస్ట్ చేసిన తర్వాత, శిల్పా ఓవెరీస్ లో అండాలు చలనం లేకున్నా ఉండటం వల్ల గర్భం పొందలేకపోతున్నారన్న విలషయం తెలుసుకున్నారు . ఇక ఎప్పటికీ గర్భం పొందలేదని నిర్ణయానికి కూడా వచ్చేశారు . అయితే అందుకు కారణం ఏమిటి? ఊబకాయం.

ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్య ఒక్క శిల్పా సచ్ దేవ్ కు మాత్రమే కాదు, ఐసిఎంఆర్ బులిటిన్ ప్రకారం, 60 నుండి 80 మిలియన్ జంటలు ఈ ఇన్ ఫెర్టిలిటి సమస్యతో కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారని అంచాన వేస్తున్నారు. 15 నుండి 20 మినియన్ మంది మన ఇండియాలోనే ఉండటం గమనార్హం. మరియు దేశంల 10 శాతం మంది వంద్యత్వానికి కారణం ఒబేసిటి(ఊబకాయమే). మీరు ఊబకాయంతో ఉండి, గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే కనుక ముందుగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని IVF నిపుణుల సలహా. ఊబకాయం వంద్యత్వానికి కారణం అవ్వడమే కాదు, గర్భస్రావానికి కూడా దారితీస్తుంది. ఊబకాయం గర్భధారణ మీద ఎలా ప్రభావం చూపుతుందో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం..

ఊబకాయం ఇన్ ఫెర్టిలిటి సమస్యను పెంచుతుంది:

ఊబకాయం ఇన్ ఫెర్టిలిటి సమస్యను పెంచుతుంది:

అండోత్సర్గంలో లోపాలు మరియు సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం ఊబకాయం. ఊబకాయం వల్ల మహిళల్లో హార్మోను అసమతుల్యత వల్ల ఓవెరీస్ నార్మల్ ఫంక్షనింగ్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో మహిళల్లో రుతుక్రమంలో తేడాలుంటాయి. సమయానికి ముందే పీరియడ్స్ లేదా లేట్ పీరియడ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. దాంతో నార్మల్ ఓవెలేషన్ ను మీద ప్రభావం చూపుతుంది. మరియు మహిళల్లో ఆబ్డోమినల్లో ఎక్కువ కొవ్వు కణాలు చేరడం వల్ల మేల్ హార్మోనుల ఉత్పత్తికి కారణం అవుతుంది. ఇది ఫోలిక్యూలర్ మ్యాటిరైజేషన్ ను నివారిస్తుంది ఫలితంగా ఓవొలేషన్ తగ్గిపోతుంది.

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ ను తగ్గించేస్తుంది :

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ ను తగ్గించేస్తుంది :

ఊబకాయం మహిళల్లో IVF ట్రీట్మెంట్ , మిగిలిన వారికంటే(సన్నగా ఉన్న వారికంటే), ఊబకాయుల్లో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకు ఊబకాయులు తప్పనిసరిగా ఐవిఎఫ్ ట్రీట్మెంట్ విజయవంతం కావాలంటే ముందుగా అధిక బరువును తగ్గించుకోవడం ఒక్కటే మార్గం.

గర్భస్రావం జరిగే అవకాశాన్ని పెంచుతుంది:

గర్భస్రావం జరిగే అవకాశాన్ని పెంచుతుంది:

ఊబకాయంగా ఉన్నా కూడా మీ నేచర్ ను బట్టి, గర్భం పొందినట్లైతే అధిక బరువు వల్ల గర్భ స్రావం జరిగే అవకాశం ఎక్కువ , ఈ ఊబకాయం వల్ల బేబీ పోషణ కష్టం అవుతుంది . కాబట్టి ఊబకాయం గర్భం పొందడానికి, గర్భం నిలడానికి, బేబీ పోషణకు కష్టంగా మారుతుంది. ఊబకాయగ్రస్తులు ఒక్కసారి గర్భం పొంది, గర్భ స్రావం జరిగితే, రెండవ సారి గర్భం పొందడానికి చాలా కష్టం అవుతుంది.

ఊబకాయం PCOS సమస్యను పెంచుతుంది:

ఊబకాయం PCOS సమస్యను పెంచుతుంది:

ఒబేసిటి (ఊబకాయం)ఓవెలేషన్ కు అవసరం అయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి మీద ప్రభావం చూపి, అపక్రమ అండోత్సర్గానికి దారితీస్తుంది. ఊబకాయానికి, అధిక ఇన్సులిన్ ఉత్పత్తికి మరియు ఇన్ ఫెర్టిలిటికి మద్య సంబంధం కలిగి ఉంది. దాంతో పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ (PCOS) సమస్యకు దారితీస్తుంది. PCOS ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణం అవుతుందని కొన్నిప్రత్యేకమైన వైద్య పరిస్థతుల ద్వారా నిర్ధారించబడినది. అంతే కాదు, ఓవెలేషన్ తగ్గించడం లేదా ఓవెలేషన్ నిలుపుదలచేయడం, ఊబకాయంమరియు పురుష హార్మోనులను ప్రేరేపించడం జరుగుతుంది.

ఇంకా ఇది జీవనశైలి సంబంధిత సమస్యలు:

ఇంకా ఇది జీవనశైలి సంబంధిత సమస్యలు:

ఊబకాయ గ్రస్తుల్లోసాధారణంగా గమనించినకొన్నిసమస్యలు, హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ మొదలగునవి. నడుముదు వద్ద ఎక్కువగా కొవ్వు చేరడం వంటి ఈ అన్నిసమసయలన్నీ కూడా మహిళలు గర్భం పొందడానికి ఒక సవాలుగా మారుతుంది.

గర్భం పొందడానికి ముందుగాబరువు తగ్గించుకోవడానికి ప్లాన్ చేయండి:

గర్భం పొందడానికి ముందుగాబరువు తగ్గించుకోవడానికి ప్లాన్ చేయండి:

మీరు అధిక బరువుతో ఉన్నారన్న విషయంమీకు అనిపిస్తే, బరువును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. బరువు తగ్గడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా 15 శాతం గర్భం పొందే అవకాశం ఉంటుంది. పిసిఓడి సమస్యతో బాధపడే మహిళలకు ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే బరువు తగ్గించుకోవడం ద్వారా పిసిఓడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది . మరియు గర్భం పొందడానికి సహాయపడుతుందని నిపుణులు డాక్టర్ గుప్తా అభిప్రాయం. బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్స్ మరియు వర్కౌట్స్ వంటి వివిధ రకాలు వ్యాయామాలు బిగినర్స్ కోసం ఎన్నో రకాలున్నాయి. రెగ్యులర్ గా వీటిని అనుసరించి త్వరగా మంచిఫలితాలను పొందవచ్చు.

మీఅలవాట్లకు చెక్ పెట్టండి:

మీఅలవాట్లకు చెక్ పెట్టండి:

స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బరువుకు అనుసంధానం కలిగి ఉంటుంది . ఈరెండు అలవాట్లు కూడా హెల్తీ గాప్రెగ్నెన్సీ పొందడానికి లేదా గర్భం నిలవడానికి కష్టం కలిగిస్తుంది . ఈ రెండు అలవాట్లు లేదా ఏ ఒక్క అలవాటున్నా, వెంటనే మానుకోవడం ద్వారా సురక్షితమైన గర్భం పొందవచ్చు.

సమతుల్య ఆహారం:

సమతుల్య ఆహారం:

ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ , లంచ్ మరియు డిన్నర్ తప్పనిసరిగా తీసుకోవాలి. మీల్స్ కు మద్యలో హెల్తీ స్నాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి . షుగర్ మరియు ఫ్యాట్అధికంగా ఉండే ఆహారాలను కానీ, స్నాక్స్ నుకానీతీసుకోవడం తగ్గించాలి . ఎక్కువగా పండ్లు, సలాడ్స్, కూరగాయలను తీసుకోవాలి.

IVF స్పెషలిస్ట్ లను సంప్రదించాలి :

IVF స్పెషలిస్ట్ లను సంప్రదించాలి :

మీరు ప్రతి ఒక్కటిప్రయత్నించిన తర్వాత బరువు తగ్గిన తర్వాత, డైట్ లో మార్పులుచేసుకొన్న తర్వాత కూడా ఎటువంటి మార్పులు కనిపించకపోతే వెంటనే ఐవిఎప్ నిపుణులను సంప్రదించాలి . ఆరోగ్యస్థితిగతులను తెలుసుకొని, గర్భం పొందడానికి ప్రయత్నించండి.

భాగస్వామి యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవాలి:

భాగస్వామి యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవాలి:

గర్భం పొందకపోవడానికి ఊబకాయం ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఒకసారి మీపార్ట్నర్ యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా చెక్ చేయించండి. ఒక వేళ మీ భాగస్వామి కూడా మీలాగే అధిక బరువుతో బాధపడుతున్నట్లైతే, అతన్ని కూడా బరువు తగ్గమనిచెప్పాలి, డాక్టర్స్ ను సంప్రదించి వారిచ్చే సలహాలను అనుసరిస్తూన, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

Desktop Bottom Promotion