For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపోహ: రుతుక్రమ సమయంలో కూడా గర్భాన్ని ధరించవచ్చా..?

|

అవును, పీరియడ్స్ (రుతుక్రమ) సమయంలో కూడా గర్భాన్ని పొందవచ్చు కానీ గర్భం కలిగే అవకాశం చాలా తక్కువ అని చెప్పవచ్చు. గర్భాన్ని ధరించాలి అనుకునే ప్రతి స్త్రీ కూడా రుతుక్రమ(పీరియడ్స్) సమయంలో గర్భధారణకు గల కారణాలు మరియు రుతుక్రమం ఎలా జరుగుతుందో, వంటి వాటి పైన తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి.

పిండం అనేది, దంపతులు ఇద్దరు సంభోగంలో పాల్గొన్న తరువాత, పురుషాంగం నుండి విడుదల అయిన శుక్రకణాలు స్త్రీ శరీరంలోని ఫాలోఫియన్ నాళంలో నిల్వ ఉన్న అండంతో కలిసి పిండాన్ని ఏర్పరుస్తాయి. స్త్రీ శరీరంలోని ఫాలోఫియన్ నాళంలో నిల్వ ఉన్న అండం 1 రోజు నిల్వ ఉండి, శుక్రకణంతో కలవకపోతే యోని గోడలకు చేరి రుతుక్రమం సమయంలో మలిన రక్తంతో పాటూ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది.

అమెరికాలోని ''నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్'' (NIH) వారు 213 మంది స్త్రీలపై పరిశోధనల జరిపి 25-35 వయసులో గల స్త్రీలలో రుతుక్రమం సరైన సమయం మరియు ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, రుతుక్రమ సమయంలో ఫలదీకరణం చందే అవకాశం ఎక్కువే అని తెలిపారు. రుతుక్రమ సమయంలో 17 శాతం మంది స్త్రీలలో, నాలుగవ మరియు 7వ రోజు కూడా అండం ఫలదీకరణ చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిశోధనల ఫలితంగా, రుతుక్రమ సమయంలో గర్భం పొందలేమన్న గ్యారెంటీ లేదు అనే చెప్పవచ్చు.

Can a Woman Become Pregnant During Her Period

అండం విడుదలయ్యే సమయం

చాలా మంది స్త్రీలు వారి రుతుక్రమం మరియు అండం విడుదల అయ్యే సమయంపై అవగాహన కలిగి ఉంటారు. ఫలదీకరణ సమయంలో ఎరుపు లేదా గోధుమ రంగు స్రావాలు యోని నుండి విడుదల అవుతాయి. కానీ కొన్ని సమయాల్లో ఈ స్రావాలు భయటకు వెళ్ళకుండా ఉండిపోతాయి. ఈ సమయంలో వీర్య కణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించినట్లయితే, గర్భం పొందటానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

Can a Woman Become Pregnant During Her Period

రుతుక్రమం ముందు

ప్రతి స్త్రీలోనూ, 28 రోజుల రుతుక్రమంలో 14 రోజు అండం విడుదల అవుతుంది. అంతేకాకుండా, ఈ చక్రం నిర్దిష్టమైనది అనగా అదే సమయంలో రావాలని లేదా ముందుగా లేదా ఆలస్యంగా రావచ్చు. కొంత మందిలో 10వ రోజు అండం విడుదల అవవచ్చు, ఒకవేళ ఈ సమయంలో మాత్రం సంభోగంలో పాల్గొనటం వలన గర్భం ధరించే అవకాశం ఉంది.

Can a Woman Become Pregnant During Her Period

దీర్ఘకాలం

ఎవరైతే దీర్ఘకాలం పాటూ లేదా ఎక్కువ సార్లు క్రమరహిత రుతుక్రమం కలిగి ఉన్నవారు, ఎక్కువగా రుతుక్రమ సమయంలో గర్భాన్ని ధరించే అవకాశం ఉంది. తనుకు వచ్చే రుతుక్రమంపై అవగాహన కలిగి ఉన్న ఎక్కువ శాతం గర్భాన్ని ధరించే అవకాశం ఉంది. కారణం క్రమరహిత రుతుక్రమం వలన అండం విడుదలయ్యే సమయంలో తప్పుడు లెక్కల వలన మరియు ఈ సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందే అవకాశం ఉంది.

Can a Woman Become Pregnant During Her Period

కొన్ని సమయాల్లో, రుతుక్రమ సమయానికి ముందు నుండే, కొంత మందిలో గర్భాశయ శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. అనగా రుతుక్రమ సమయానికి ముందే ఈ స్రావాలు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ సమయంలో గర్భం ధరించటం వలన గర్భాన్ని పొందే అవకాశం లేకపోలేదు.

Story first published: Friday, January 2, 2015, 16:28 [IST]
Desktop Bottom Promotion