అబార్షన్ అవడానికి కారణమయ్యే భయంకర వ్యాధులు..!

ప్రెగ్నన్సీ సమయంలో హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇన్ఫక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. అబార్షన్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి.. ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ అబార్షన్ రిస్క్ పెంచుతాయి.

Posted By:
Subscribe to Boldsky

గర్భిణీలు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కొన్ని అబార్షన్ కి కారణమవుతాయి. స్మోకింగ్, టాక్సిన్స్, పొల్యూషన్, డ్రగ్స్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు.. అబార్షన్ కి కారణమవుతాయి. ఈ కారణాల గురించి చాలామందికి తెలుసు.

abortion risk

కానీ ప్రెగ్నన్సీ సమయంలో హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇన్ఫక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. అబార్షన్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి.. ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, శరీరంలో మార్పులు అబార్షన్ రిస్క్ ని పెంచుతాయో తెలుసుకోవాలి.

పీసీఓఎస్

పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే మహిళల్లో టెస్టోస్టెరాన్ హైలెవెల్ లో ఉంటుంది. ఇది ఇర్రెగ్యులర్ ఒవల్యూషన్, రుతుక్రమానికి కారణమవుతుంది. దీనివల్ల అబార్షన్ రిస్క్ చాలా పెరుగుతుంది. ఈ సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కూడా కారణమవుతుంది.

హైపోథైరాయిడిజం

అసాధారణ థైరాయిడ్ గ్రంథి పనితీరు ప్రెగ్నంట్ అయ్యే అవకాశాలపై దుష్ర్పభావం చూపుతుంది. అంతేకాదు.. అబార్షన్ రిస్క్ ని కూడా పెంచుతుంది. అలాగే లో థైరాయిడ్ లెవెల్స్ ఒవల్యూషన్ పై ప్రభావం చూపి.. తర్వాత ఇన్ఫెర్టిలిటీ, అబార్షన్ రిస్క్ తీసుకొస్తాయి.

ఇన్ఫెక్షన్స్

ముఖ్యంగా ప్రెగ్నన్సీ సమయంలో ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. జెనిటికల్ ట్రాక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అబార్షన్ రిస్క్ ని పెంచుతుంది. యూట్రస్ లో ఎండోమెట్రియల్ లైనింగ్ పై ప్రభావం చూపి.. అబార్షన్ కి కారణమవుతుంది.

స్ట్రక్చరల్ అబ్ నార్మాలిటీస్

యూట్రస్ లేదా సర్విక్స్ ఆకారంలో, స్ట్రక్చర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా.. అబార్షన్ రిస్క్ ఉంటుందని చాలామందికి తెలియదు. యూట్రస్ లో స్ట్రక్చరల్ అబ్ నార్మాలిటీస్, అబ్ నార్మల్ షేప్ లో యూట్రస్ ఉంటే.. అబార్సన్ కి కారణమవుతుంది.

క్రోమోజోమల్ అబ్ నార్మాలిటీస్

50శాతం కంటే ఎక్కువ అబార్షన్లు యూట్రస్ లో క్రోమోజోమల్ అబ్ నార్మాలిటీస్ కారణమవుతాయి. డ్యామేజ్ అయిన క్రోమోజోములు అబార్షన్ కి కారణమవుతాయి. ఇలాంటి వాళ్లకు 30 తర్వాత గర్భం పొందడం కూడా రిస్క్ తో కూడినది.

క్రోనిక్ కండిషన్

అన్ కంట్రోల్డ్ డయాబెటిస్ లేదా హై బ్లడ్ ప్రెజర్ కూడా అబార్షన్ రిస్క్ ని తీవ్రంగా పెంచుతాయి. చాలా తరచుగా గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తూ ఉండటం వల్ల ఈ రిస్క్ ని కాస్త తగ్గించుకోవచ్చు.

ఆటో ఇమ్యూన్ డిసీజ్

ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా అబార్షన్లకు కారణమవుతాయి. తల్లి సొంత యాంటీ బాడీస్ గర్భస్త శిశువుకి వ్యతిరేకంగా... ఉత్పత్తి చేయడం వల్ల అబార్షన్ అవుతుంది.

English summary

7 diseases and conditions that can up your risk of miscarriage

7 diseases and conditions that can up your risk of miscarriage. Risk factors cause miscarriage.
Please Wait while comments are loading...
Subscribe Newsletter