హై ఐక్యూ బేబీ పుట్టాలంటే.. ప్రెగ్నన్సీ టైంలో చేయాల్సినవి..!!

మీరు ఏం తిన్నారు, ఏం చదివారు, ప్రెగ్నన్సీ టైంలో ఎలా ఫీలయ్యారు అనేది.. కీలకపాత్ర పోషిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ.. ఆరోగ్యకరమైన, తెలివైన బిడ్డను కనాలనే భావిస్తాం.

Posted By:
Subscribe to Boldsky

పొట్టలో బిడ్డ పెరిగే కొద్దీ, పొట్ట పెద్దగా మారుతున్న కొద్దీ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారా ? ప్రెగ్నెన్సీ అంటే కేవలం గర్భంలో ఒక బిడ్డను మోయడం మాత్రమే కాదు. ఆ పిండం ఎదుగుదల, మంచి చెడుల చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మీకు పుట్టబోయే బిడ్డ చాలా తెలివైన వాళ్లు కావాలంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

high iq baby

జీవితంలో ఎక్కువగా సంతోషపడే సమయం.. మీకు పుట్టిన బిడ్డను ఫస్ట్ టైం చూసినప్పుడే. మీరు ఏం తిన్నారు, ఏం చదివారు, ప్రెగ్నన్సీ టైంలో ఎలా ఫీలయ్యారు అనేది.. కీలకపాత్ర పోషిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ.. ఆరోగ్యకరమైన, తెలివైన బిడ్డను కనాలనే భావిస్తాం.

అందుకే.. ప్రెగ్నన్సీ టైంలో ఏం చేస్తే.. అది కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. అన్ హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. అలాగే.. ప్రెగ్నన్సీ టైంలో కొన్ని అలవాట్లు.. పుట్టబోయే బిడ్డను చాలా స్మార్ట్ గా, తెలివిగా మారుస్తాయి. మరి.. ఆ అలవాట్లేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

టచ్

బేబీ బంప్ ని ఎన్నిసార్లు ముట్టుకుంటే.. అంత ఎక్కువగా మీతో బేబీ కమ్యునికేట్ అవుతుంది. మీ టచ్ బేబీ నరాల వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. కింది నుంచి పైకి.. మీ అరచేయి, చేతి వేళ్లు.. సున్నితంగా పొట్టపై మసాజ్ చేయాలి. రోజుకి అనేకసార్లు ఇలా చేస్తే.. బిడ్డ చాలా తెలివిగా పుడతారు.

పాజిటివ్

పాజిటివ్ గా ఆలోచించే వాళ్లతో గడపండి. మంచి విషయాలు చదవండి. మంచి మ్యూజిక్ వినండి. ప్రెగ్నన్సీ టైంలో ఎలాంటి సమాచారం మీరు తెలుసుకుంటారో.. అది.. మీ పొట్టలోని బిడ్డ కూడా షేర్ చేసుకుంటుంది. కాబట్టి.. మంచి విషయాలపై ఎక్కువ శ్రద్ద పెట్టండి.

మ్యూజిక్

మంచి మ్యూజిక్ ని ఎక్కువగా వింటూ ఉండండి. మ్యూజిక్ వినడం వల్ల.. రిలాక్సేషన్, ఉపశమనం కలుగుతుంది. మంచి మ్యూజిక్ ఒత్తిడిని తగ్గించి.. మీ బేబీ హ్యాపీగా ఉండేలా చేస్తుంది.

విటమిన్ డి

కడుపులోని బిడ్డకు సరైన మోతాదులో విటమిన్ డి అవసరం. బేబీ ఎముకల డెవలప్ మెంట్ కి విటమిన్ డి సహాయపడుతుంది. ఇందుకోసం.. అవసరమైనంత ఎండ తగలాలి. ప్రతిరోజూ డేలైట్ లో కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయండి.

బుక్స్ చదవడం

రాత్రి నిద్రపోవడానికి ముందు పుస్తకాలు చదవడం వల్ల.. మంచి హార్మోన్లు రిలీజ్ అయి.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడతాయి. బేబీ బ్రెయిన్ కి సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

డైట్

మంచి డైట్ మీకు మాత్రమే కాదు.. బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు ఏం తింటే.. అది.. మీ బిడ్డ కూడా తింటుంది. కాబట్టి.. బిడ్డ డెవలప్ మెంట్ కి, శక్తికి సహాయపడే ఆహారం తీసుకోండి.

English summary

Do These 6 Things During Pregnancy to Give Birth to Baby with High IQ

Do These 6 Things During Pregnancy to Give Birth to Baby with High IQ. So, do not think twice and for the sake of your baby adopt these smart habits and give birth to a clever baby.
Please Wait while comments are loading...
Subscribe Newsletter