అబార్షన్ తర్వాత ప్రెగ్నంట్ అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

అబార్షన్ తర్వాత ఆ మహిళ డిప్రెషన్, ఆందోళనను ఎదుర్కొనే అవకాశం ఉంది. అబార్షన్ వల్ల ఏర్పడిన భయం.. మళ్లీ గర్భం పొందడానికి చాలా ఇబ్బందికరంగా మార్చవచ్చు. అబార్షన్ తర్వాత మళ్లీ గర్భం పొందడం కష్టమేమీ కాదు.

Posted By:
Subscribe to Boldsky

గర్భం దాల్చిన తర్వాత ఆ తల్లి ఆనందానికి అవధులుండవు. అనుక్షణం కడుపులోని శిశువు గురించి ఎన్నో ఆలోచనలు, ఊహలకు ప్రాణం పోస్తారు. ఎప్పుడెప్పుడు తొమ్మిదినెలలు నిండుతాయా.. తాను ప్రాణం పోసిన బిడ్డను కనులారా చూసుకోవాలన్న ఆ ఆనందపు క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. ఉన్నట్టుండి జరిగే అబార్షన్.. ఆ మహిళతో పాటు, ఫ్యామిలీకి తీరిన బాధను మిగులుస్తుంది.

pregnant after miscarriage

తనకు పుట్టబోయే బిడ్డకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే తల్లికి తన బిడ్డను కోల్పోయినప్పుడు పొందే బాధ అంతా ఇంతా కాదు. అది ఎప్పుడైనా కావచ్చు. గర్భం పొందిన తర్వాత లేదా డెలివరీకి ముందు లేదా.. ఎలాంటి సందర్భంలో జరిగినా.. చాలా బాధగా ఉంటుంది.

అబార్షన్ తర్వాత ఆ మహిళ డిప్రెషన్, ఆందోళనను ఎదుర్కొనే అవకాశం ఉంది. అబార్షన్ వల్ల ఏర్పడిన భయం.. మళ్లీ గర్భం పొందడానికి చాలా ఇబ్బందికరంగా మార్చవచ్చు. అయితే.. అబార్షన్ తర్వాత మళ్లీ గర్భం పొందడం అంత కష్టమైనపని కాదని నిపుణులు చెబుతున్నారు.

depression

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని సూచిస్తున్నారు. అబార్షన్ అనేది ఉన్నట్టుంది జరిగేది. దీనివల్ల ప్రెగ్నన్సీని కోల్పోతారు. అబార్షన్ కి అన్ హెల్తీ డైట్, గాయాలు, గర్భాశయంలో అబ్ నార్మాలిటీస్, ఒత్తిడి, ఆల్కహాల్, స్మోకింగ్, హెరిడిటీ వంటివి కారణమవుతాయి.

partner

అబార్షన్ అయిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఆ మహిళ కాస్త బలహీనంగా ఉంటుంది. వెంటనే మళ్లీ బిడ్డను పొందాలని భావించకపోవచ్చు. చాలామంది మహిళలు అబార్షన్ తర్వాత కన్సీవ్ అవలేమని భావిస్తారు. కానీ.. అది అపోహ మాత్రమే. అబార్షన్ తర్వాత ఎలా గర్భం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణులు ఏం సూచిస్తున్నారు ?
అబార్షన్ తర్వాత.. ఆ మహిళ తనకోసం కొంత సమయాన్ని కేటాయించడం అవసరం. మరో బిడ్డకోసం ప్రయత్నించే ముందు.. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే భాగస్వామి నుంచి ఎమోషనల్ సపోర్ట్ అవసరం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా.. ఆమెకు సపోర్ట్ గా ఉండాలి.

English summary

How To Get Pregnant After A Miscarriage?

How To Get Pregnant After A Miscarriage? As we all know, when a woman experiences a miscarriage, it can be an emotionally trying time for her.
Please Wait while comments are loading...
Subscribe Newsletter