మీరు ప్రెగ్నంట్ అయ్యారని కన్ఫర్మ్ చేసే వివిధ టెస్ట్ లు..!

కొన్నిసార్లు అన్ని లక్షణాలు కనిపించినా.. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అవకపోవచ్చు. అయితే.. ప్రెగ్నన్సీ టెస్ట్ ఎలా చేయించుకోవాలి ? ఏయే ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Posted By:
Subscribe to Boldsky

ఓవల్యూషన్ రోజులు తెలుసుకోవడం ప్రెగ్నన్సీ ప్లాన్ లో చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా, ఉత్సాహంగా ఉంటే.. ఒవల్యూషన్ తర్వాత కొన్ని రోజులకు.. ప్రెగ్నన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు.

Ways To Know Whether You’re Pregnant

అయితే ప్రెగ్నంట్ అయ్యారు అన్న ఫీలింగ్ చాలా సందర్భాలు, చాలా లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. బాడీలో చేంజెస్, బ్రెస్ట్ లో పెయిన్, పీరియడ్ మిస్ అవడం, తరచుగా యూరిన్ కి వెళ్లడం, వాజినల్ డిశ్చార్జ్ వంటి లక్షణాలన్నీ ప్రెగ్నన్సీని సూచిస్తాయి. అయితే.. కొన్నిసార్లు అన్ని లక్షణాలు కనిపించినా.. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అవకపోవచ్చు. అయితే.. ప్రెగ్నన్సీ టెస్ట్ ఎలా చేయించుకోవాలి ? ఏయే ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జాగ్రత్తలు

గర్భం పొందండం, గర్భం పొందాలనుకోవడం మహిళలకు జీవితంలో చాలా అద్భుతమైన అనుభూతులను, అనుభవాలను ఇస్తుంది. ప్రెగ్నంట్ అవడానికి ముందు సరైన డైట్, డాక్టర్ చెక్ అప్స్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే.. చాలా జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం.

బ్లడ్ టెస్ట్

మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవడానికి ఇదో బెస్ట్ పద్ధతి. బ్లడ్ టెస్ట్ ద్వారా హెచ్ సీ జీ లెవెల్స్ గుర్తించి.. ప్రెగ్నన్సీని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. ఒవల్యూషన్ అయిన 11 రోజుల తర్వాత.. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే.. తెలుసుకోవచ్చు.

యూరిన్ టెస్ట్

ప్రెగ్నంట్ అయ్యారా లేదా అన్నది తెలుసుకోవడానికి మరో మార్గం ఇది. యూరిన్ లో హెచ్ సీ జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చూపిస్తే.. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయినట్టే. ఒకవేళ మీరు యూరిన్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే.. ఒవల్యూషన్ డే తర్వాత 13వ రోజు చేయించుకోవాలి.

టెస్ట్ కిట్

ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మరో మార్గం.. టెస్ట్ కిట్. ఇది ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. మెడికల్ షాపులో అందుబాటులో ఉండే హోం ప్రెగ్నన్సీ కిట్ లో.. యూరిన్ డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది గుర్తించవచ్చు. అయితే.. ఇది అన్నిసార్లు.. సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు.

పీరియడ్స్ మిస్ అవడం

పీరియడ్స్ మిస్ అయిన తర్వాత.. ప్రెగ్నన్సీని గుర్తించవచ్చు. అయితే.. పీరియడ్స్ మిస్ అవడానికి మరే ఇతర కారణాలైనా కావచ్చు. కాబట్టి.. పీరియడ్స్ మిస్ అయితే.. గైనకాలజిస్ట్ ని సంప్రదించి.. ప్రెగ్నన్సీని కన్ ఫర్మ్ చేసుకోవడం మంచిది.

English summary

Ways To Know Whether You’re Pregnant

Ways To Know Whether You’re Pregnant. Tracking the ovulation days is the first step to plan pregnancy.
Please Wait while comments are loading...
Subscribe Newsletter