హెల్తీ బేబీ కావాలంటే.. కన్సీవ్ అవడానికి ముందు చేయాల్సినవి..!

గర్భధారణకు ముందు అది చాలా సులువైన పనిగా అనిపిస్తుంది. కానీ.. ప్రెగ్నెన్సీకి ముందు మగవాళ్లు, ఆడవాళ్లు చాలా ఎఫర్ట్ పెట్టినప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి.

Posted By:
Subscribe to Boldsky

మీరు బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారా ? వన్ ఇయర్ లో బుజ్జి పాపాయికి తల్లి కావాలని భావిస్తున్నారా ? అయితే.. మీ అలవాట్లలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. కొన్ని రకాల హెల్త్ ఛేంజెస్ తో హెల్తీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు.

What To Do Before Getting Pregnant

గర్భధారణకు ముందు అది చాలా సులువైన పనిగా అనిపిస్తుంది. కానీ.. ప్రెగ్నెన్సీకి ముందు మగవాళ్లు, ఆడవాళ్లు చాలా ఎఫర్ట్ పెట్టినప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కపుల్స్ లైఫ్ లో ప్రెగ్నెన్సీ అనేది ముఖ్యమైనది. కాబట్టి ఇద్దరూ తమ అలవాట్లలో చాలా మార్పులు తీసుకురావాలి. మహిళలు ఈ బాధ్యతను కాస్త సీరియస్ గా తీసుకోవాలి.

కనీసం కొన్ని నెలల ముందైనా..మైండ్, శరీరాన్ని ప్రెగ్నన్సీకి సిద్ధం చేసుకోవాలి. ప్రెగ్నన్సీ కావడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను మైండ్ లో పెట్టుకోవాలి, కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి. మరి ప్రెగ్నన్సీకి ముందు.. ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రీనాటల్ చెకప్

గర్భం పొందాలి అనుకోవడానికి ముందు.. మీ హెల్త్ కండిషన్ ని ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ మెడికల్ హిస్టరీ గురించి.. డాక్టర్ ని వివరించడం, మెడిసిన్స్ గురించి తెలపడం చాలా అవసరం.

జెనెటిక్ కెరీర్ టెస్ట్

ఒకవేళ మీకు ఏవైనా వ్యాధులు ఉన్నాయా లేదా మీ పేరెంట్స్ లో ఎవరికైనా ఉన్న వ్యాధులు మీకు వచ్చే అవకాశం ఉందా అన్న విషయాన్ని ఈ జెనెటిక్ కెరీర్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఈ టెస్ట్ చేయించుకుంటే.. హెల్తీ బేబీని పొందడానికి అవకాశం ఉంటుంది.

చెడు అలవాట్లు

స్మోకింగ్, డ్రింకింగ్ వంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని కన్సీవ్ అవడానికి ముందు మానేయడం చాలా అవసరం. అలాంటి అలవాట్లు.. పొట్టలో పెరిగే గర్భస్థ శిశువుకి హాని చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

గర్భధారణ సమయంలో అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ హానిచేస్తాయి. అలాగే.. బయట వీధుల్లో, బండ్లపై ఆహారాలు తీసుకోవడం మానేయాలి.

కాఫీ మానేయాలి

కొద్ది మోతాదులో కెఫీన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ.. ఎక్కువ మోతాదులో ప్రెగ్నన్సీ టైంలో, ప్రెగ్నన్సీకి ముందు కాఫీ తీసుకోవడం మంచిది కాదు. అలాగే ప్రెగ్నన్సీ టైంలో కెఫీన్ కి పూర్తీగా దూరంగా ఉండటం మంచిది.

యాక్టివ్ గా ఉండటం

ప్రెగ్నంట్ అవడానికి ముందు.. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా వర్కవుట్ చేయడం చాలా అవసరం.

రిలాక్సేషన్

ప్రెగ్నన్సీ టైంలో.. ఎమోషనల్ గా చాలా హ్యాపీగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఒత్తిడికి లోనవకూడదు. ఒత్తిడి లేకుండా.. రిలాక్స్ గా ఉండటం వల్ల.. హెల్తీ బేబీని పొందుతారు.

English summary

What To Do Before Getting Pregnant

What To Do Before Getting Pregnant. It is better to prepare your mind and body for pregnancy at least a few months before conception. Read on to know what to do before getting pregnant.
Please Wait while comments are loading...
Subscribe Newsletter