For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత బరువు పెరిగినా ఆత్మవిశ్వాసంతో ఎలా వుండాలి ?

|

స్త్రీలు తల్లి అయిన తరువాత ఎదుర్కొనే అనేక సమస్యలలో బరువు పెరగడం కూడా ఒకటి. పేరొందిన తల్లుల సంఘంలో నివసించేవారికి ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ 13 నెలల వయసున్న బిడ్డ తల్లి నుండి ఇదిగో కొ౦త సహాయం.

చర్యచర్యలు:

1. బైటకి వెళ్ళడం ముఖ్యం. మీరు ఎంత బరువు పెరిగినా సరే, ఇంటినుండి బైటికి రండి. బైటికి వెళ్ళడం అంటే అందరినీ కలవమని కాదు, మాల్స్ కి పార్కులకి వెళ్ళడం వంటివి మార్పుని తెస్తాయి. మాల్ కి వెళ్ళినపుడు మీరు సాధారణంగా నర్సింగ్ గదిలోకి వెళ్లి ఇతర తల్లులతో ఇలాంటి విషయాలు మాట్లాడడం సహాయం చేస్తుంది. ఇంట్లోనే ఉంటె మీ బరువు పెరగడం గురించి ఆలోచించి ఒత్తిడికి గురౌతారు. అదనంగా ప్రతివారూ చురుకైన తల్లిని మెచ్చుకుంటారు.

How to Be Confident After Gaining Baby Weight

2. ఒంటికి అతుక్కునే పాత బట్టలను ధరించకండి. పాప పుట్టిన తరువాత మీ శరీరంలో వచ్చిన మార్పుని ఆమోదించి, ఇది తాత్కాలికమేనని మీకు మీరే చెప్పుకోండి. కానీ పాత దుస్తులను ధరించకండి, అది మిమ్మల్ని ఇంకా బాధిస్తుంది. మీ కొత్త శరీరానికి సరిపడే కొత్త దుస్తులను కొనుక్కోండి, మీలోని కొత్తదనాన్ని ఆహ్వానించండి.

3. ముదురు రంగు బట్టలు ధరించండి. ముదురు రంగులు ఇపుడు మీ కొత్త నేస్తాలు. ముదురు రంగులు, వి మెడలు బరువు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. ముదురు అంటే నలుపని కాదు. నలుపు మంచి ఎంపికే అయినప్పటికీ ముదురు నీలం, మెరూన్, ముదురు బ్రౌన్ వంటి ఇతర రంగులు కూడా ఉన్నాయి. పెద్ద నమూనాలు, చిక్కటి రంగుల దుస్తులను నివారించండి.

4. మీకు ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండండి. మీ ప్రియ స్నేహితుడు లేదా సోదరి లేదా ఎవరైనా మీ విషయాలని పంచుకొని, సహాయం చేస్తారనేది నిజం. మాట్లాడడం, పంచుకోవడం తో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పునర్నిర్మించు కోవడానికి సహాయపడుతుంది, అదనంగా బైటికి వెళ్ళడం అనేది అతి ముఖ్యం.

5. మీరు సంతోషంగా ఉండడానికి ఏదోకటి చేయండి. బరువు పెరగడ౦ మీ వినోదానికి అవరోధం కాకూడదు. నా చిట్టి తల్లిని నా భర్త వద్ద వదలివేసి, సంగీతం వింటూ డ్రైవింగ్ కి వెళ్ళడం, నాకోసం చాకొలేట్ కొనుక్కోవడం లా౦టివి యేవో కొన్ని చేయండి. మీకు నచ్చిన అద్భుతమైన పనిని చేయండి.

6. మీ భాగస్వామి సహాయాన్ని పొందండి. గర్భంతో ఉన్నప్పటి నుండి పాప రాక వరకు జరిగిన హెచ్చు, తగ్గులను మీతోనే ఉంటారు కాబట్టి చాలా వరకు చూసే ఉంటారు. అతనితో మాట్లాడడం వల్ల మీ భావాలను అర్ధం చేసుకోవడమే కాకుండా ( మీ భాగస్వామిని కూడా చుట్టుముడుతుంది) కానీ మీరు లావుగా ఉన్నారని అతను అనుకోవడం లేదనడానికి కూడా సహాయ పడుతుంది. మీరు ఏమి అనుభవిస్తున్నారో ఆయన పూర్తిగా అర్ధం చేసుకుంటారు.

7. వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం అద్భుతంగా వుంటుంది. తేలికగా మొదలు పెట్టి గట్టిగా ఆరు వారాలు చేయ౦డి. కానీ మధ్యస్తమైన దినచర్యతో ప్రారంభించండి. జిమ్ కి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోతె ఇంట్లోనే ప్రారంభించండి. ఆన్ లైన్ లో ఉన్న అనేక చిట్కాలతో, మీరు ప్రేరణ పొంది అభ్యసించండి. వ్యాయామం చేయడం మంచి భావనని, మంచి ఆలోచనని కలిగిస్తుంది.

చిట్కాలు

అస్తమానూ బరువు పెరిగడ౦ గురించే ఆలోచించడం మానేయండి.

ఇతర తల్లుల కధలని ఆన్ లైన్ లో చదవండి.

English summary

How to Be Confident After Gaining Baby Weight | ప్రసవం తర్వాత బరువు పెరిగినా ఆత్మవిశ్వాసంతో ఎలా వుండాలి ?


 Women deal with uncountable issues after becoming a mom...baby wight being one of them. Living in a society of celebrity moms sometimes it gets a little too much. But here's a little help from a mom of a 13 month old.
Story first published: Tuesday, January 15, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion