For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల గురించి తెలుసుకోవడం ఎలా ?

|

మీరు గర్భావతే కానీ, మీకు పిల్లల గురించి ఏమీ తెలియదా? పిల్లలుంటే చేతినిండా పని ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఈ వ్యాసం చదివితే మీకు పిల్లల గురించి ఎలా తెలుసుకోవాలో అర్ధమౌతుంది, అంతేకాక నిద్రలేని రాత్రులు, ఎడతెగని ఏడ్పులు ఉన్నా మీ పిల్లలను ఆస్వాదించి ఇందులోని అందమైన కోణాన్ని కూడా చూడగలుగుతారు.

చర్యలు:

1. వెతకండివెతకండి, మీకు చాలా ప్రశ్నలు ఉంటే సమాధానం దొరికే తేలికైన మార్గం వెతకడమే. ప్రతి పిల్లవాడూ ప్రత్యేకమైన వాడే కనుక ఇంటర్నెట్ లో కనపడే కొన్ని పరిష్కారాలు ప్రతి సారీ పనిచేయక పోవచ్చని గుర్తుంచుకోండి.

2. పిల్లల గురించిన పుస్తకాలు చదవండి. ఇవి లైబ్రరీల లోనూ, పుస్తకాల షాపులలోనూ దొరుకుతాయి. పిల్లల పుస్తకాలలో మీకు ప్రధానంగా :

పాల సీసా ఎలా తయారుచేయాలి?

పిల్లల్ని ఎలా నిద్రపుచ్చాలి?

పిల్లల ఏడుపు ఎలా మాన్పించాలి?

లాంటి విషయాలు తెలుస్తాయి. తాజా సమాచారంతో కూడిన పిల్లల పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి. లైబ్రరీలో వెతికి వాటిలో ఏముందో చూడండి.

3. స్థానిక హైస్కూల్ లేదా కాలేజ్ నించి శిశు పోషణ మీద శిక్షణ తీసుకోండి.

4. ఎవరైనా స్నేహితులని అడగండి. వారికి పిల్లలుండి పిల్లల గురించిన అనేక విషయాలు తెలిసిఉండాలి. లేదా మీ తల్లితండ్రులను కూడా అడగవచ్చు. వాళ్ళు మిమ్మల్ని పెంచారని గుర్తుంచుకోండి.

How to Learn About Babies

5. అనుభవంనుంచి నేర్చుకోండి. ఇది చాలా ముఖ్యం. ప్రతి శిశువు ప్రత్యేకమైనవాడే కాబట్టి పుస్తకాలలోనూ, ఇంటర్నెట్ లోనూ మీకు అన్ని సమాధానాలూ దొరకవు. మీ పొరపాట్ల నుంచే నేర్చుకుంటే, మీరు పిల్లవాడు ఏడుపు ఆపనపుడు వత్తిడికి గురికారు.

చిట్కాలు:

ఏం చేయాలో తెలియకపోతే కంగారు పడకండి. అలా చేస్తే మీకు విసుగుపుట్టి పిల్లలని ఆస్వాదించలేరు.

పిల్లాడు పుట్టాక ముందే వీలైనన్ని విషయాలు నేర్చుకుంటే మీరు మరింత సంసిద్ధులుగా ఉంటారు.

సరదాగా ఉండండి!! పిల్లల గురించి మీకు ఏం తెలీకపోయినా, పిల్లలు సంతోషం కలిగిస్తారు. వాళ్ళు చేతినిండా పని కల్పిస్తారన్నది నిజమే, కానీ దాన్ని ఇష్టపడితే మీరిక దేనినీ లెఖ్ఖచేయరు. మీ పిల్లవాడు ఎదిగి, టీనేజర్ గా రాత్రిపూట్ల జారుకోక ముందే వాడిని ఆస్వాదించండి.

English summary

How to Learn About Babies | పిల్లల గురించి తెలుసుకోవడం ఎలా ?

Are you pregnant but dont really know anything about babies? We all know babies can be a real handful! But if you read this article you can find out how to learn about Babies so that, apart from the sleepless nights and all the crying, you will be able to enjoy the baby and also see the good and REALLY cute sides of it!!
Story first published: Monday, January 28, 2013, 12:18 [IST]
Desktop Bottom Promotion