For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల గొంతులో ఆహారం పొరబడితే తీసుకోవలసిన జాగ్రత్తలు

|

 Kids Eat Right - Is Your Child 'Stuck' on a Food?
తింటూ తింటూ పొరబోయి దగ్గు వస్తుంటే ఎవరో తలచుకున్నారంటూ పిల్లల తలమీద కాస్త సుతారంగా తట్టడం అన్నది ఈ లోకంలో ఏ చిన్నారికైనా అనుభవంలోనికి రాని విషయం కాదు. ఇలాంటి ప్రమాదాలు తరచూ అన్ని ఇండ్లలోనూ చోటుచేసుకునేవే. అయితే గొంతులో ఆహారంగానీ మరేదైనా వస్తువుగానీ ప్రవేశిస్తే అది ప్రమాదంగా పరినమించకుండా చూసుకోవడం అవసరం. అసలు పొరబోవడం ఎందుకో పొరబోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...

ముక్కుతో పీల్చుకున్నా నోటితో పీల్చుకున్నా గాలి ఊపిరితిత్తులోకి వెళ్లడం మనం చూడవచ్చు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే.. తిన్న ఆహారంలో ఆహార వాహికలోనికి పోకుండా గట్టిగా దగ్గువచ్చిన ఆహారాన్ని బయటకు నెట్టేస్తుంది. ఇదే పొరబోవడం అన్నమాటి. అందుకే ఒ్కోసారి మనం పాలు లేదా నీళ్ల వంటి ద్రవపదార్థాలు తాగుతూ అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకుంటే ఠక్కున పొరబోతుంది. అంటే గాలి వేళ్ళే దారికి ఎపిగ్లాటిస్ పొర అడ్డుపడుతుంది.

గొంతులో పదార్థాలు ఇరుక్కోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ..
1. నాలుగేళ్ల లోపు పిల్లలకు నట్స్, గట్టిగా ఉండే చాక్లెట్ క్యాండీలు, పెద్ద గింజలుండే పండ్లు పెట్టకూడదు. పెద్దగా ఉన్న క్యారెట్, ఫ్రూట్ ముక్కలు తినిపించకూడదు.
2. నాలుగేళ్లలోపు వారికి పండ్లు, క్యారట్ వంటివి పెట్టాల్సి వస్తే వాటిని చిన్న ముక్కలుగా తురిమి పెట్టాలి. చాలా మెత్తగా నమిలి తినమని చెప్పాలి.
3. చిన్న పిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని విరగొట్టడం సహజం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి.
4. పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
5. పిల్లల ఉయ్యాలపై వేలాడతీసే రంగులు బొమ్మలు వాళ్ల చేతికి అందకుండా ఎత్తులో ఉండేలాజాగ్రత్త తీసుకోవాలి.
6. చిన్ని చిన్న పూసల్లా ఉండే బొమ్మలను చిన్న పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి.
7. మెడలో వేసుకొనే ఆభరణాలకు ఉండే సన్నపాటి చైన్ లను, లేస్ లను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
8. చిన్న పిల్లలు ఆడుకోవడానికి నాణాలు, కాయిన్స్ ఇవ్వడం సరికాదు. పొరబాటున వాటిని మింగేసే ప్రమాదం ఉంది.

గొంతులో వేదైనా ఇరుక్కున్నప్పుడు ఏంచేయాలి:
1. ఏదైనా మింగిన చిన్నారి దగ్గుతున్నా, గట్టిగా ఏడుస్తున్నా, మాట్టాడగలుగుతున్నా, గొంతులోంచి శబ్దాలు చేస్తున్నా అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్ల మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary

Kids Eat Right - Is Your Child 'Stuck' on a Food? | పిల్లల్లో తినేటప్పుడు పొరబడితే...

Children can get food stuck in their sinuses in a different way. Though generally not harmful to kids, food jags can be frustrating to parents trying to promote a varied menu. It's OK to offer the same foods again and again.
Story first published:Thursday, September 13, 2012, 12:02 [IST]
Desktop Bottom Promotion