ఆ వయస్సులో నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు ...

Posted By:
Subscribe to Boldsky

Making Food Healthy and Safe for Children..
పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే మనం కొన్ని జాగ్రతలు తీసుకొవాలి. 5 నుండి 14 సంవత్సరాల సమయంలో పిల్లల విషయంలో మనం నిర్లం చేస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ సందర్భంలో పిల్లలు గురించి పట్టించుకోవడంలో చాల జాగ్రతగా ఉండాలని హార్వర్డ్ స్కుల్ నిపుణుడు కరేన్ పీటర్సన్ అంటున్నారు. టీనేజ్ లో దీర్ఘకాలిక వ్యాధులు అనే అంశం మీద పోషకాహార నిపుణుడు కరేన్ పీటర్సన్ సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వలనే టీనేజర్లు సుధీర్ఘ వ్యాదుల బారిన పడుతున్నారని ఆయన అంటున్నారు.

వాటిలో మధుమేహం, గుండె, ఎముకల జబ్బుల వ్యాధులు రావడంతో జీవితాంతం బాధపడుతున్నారని తెలిపారు. కోమర దశ (5 నుండి 14 సంవత్సరాలు వయస్సు)లో పోషకాహార లోపంతో 17 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 15 శాతం మంది అధికంగా తినడం, వాంతులు చేసుకోవడం చేస్తున్నారు. చాల మంది అతి తక్కువ క్యాలరీలు ఉన్న పోషక ఆహారాలు తీసుకుంటున్నారు. వీటి వలన సమతులాహార సమస్యలతో వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడి అయ్యింది. తల్లిదండ్రలు పిల్లల ఆరోగ్యకర అహారపు అలవాట్లను ప్రోత్సహించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

ఇలాంటి జాగ్రతలు తప్పనిసరిగా పాటించాలి
1. ఉదయం అల్పహారాన్ని తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఈ ఆహారం మేధో ప్రదర్శనలో కీలకం.
2. భోజనంలో పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తదు.
3. పంచదార కలిపిన పానీయాలు, శీతలపానీయాలు బాగా తగ్గించాలి.
4. తగినన్ని నీరు. పాలు, పాల ఉత్పత్తులతో చేసిన పదార్థాలు బాగా తీసుకోవాలని సూచించాలి.
5. పండ్ల రసం కంటే పండ్లు తినడాన్నిఎక్కువగా ప్రోత్సహించాలి. వాటిలోని పీచుపదార్థాలు ఆహారాన్ని కాపాడుతాయి.
6. అధిక బరవు, తక్కువ బరువు రెండు సమస్యలే. ఇది డిఫ్రెషన్ కు దారి తీస్తుంది. ఈ విషయం పిల్లలకు పూర్తిగా అర్థం అయ్యే విదంగా చెప్పాలి. ఈ సమస్య థైరాయిడ్ సమస్యలకు చేరువ అవుతుందని వివరించాలి.
7. రోజుకు ఒక్క సారి అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే విదంగా ప్లాన్ చేయాలి. ఈ విదంగా పిల్లలు పోషక ఆహారం తీసుకునే వీలు ఉంటుంది.
8. పిల్లలు ఆరోగ్యపు ఆహార అలవాట్లు పరిచయం చేయడానికి పోషకాహార నిపుణుల దగ్గర కౌన్సింగ్ ఇప్పించడంలో జాప్యం జరగకుండ జాగ్రతలు తీసుకొవాలి. పిల్లలు ఎప్పడు ఎలాంటి ఆహారం, చిరుతిండ్లు తీసుకుంటున్నారు అని జాగ్రతగా పరిశీలించాలి, ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి.

English summary

Making Food Healthy and Safe for Children...| పిల్లల్లో పోషకాహార లోపంతో ఊబకాయం..

Parents of children in care play an important role in their lives but do not always get the information and support they need from social workers, foster carers and other professionals.
Please Wait while comments are loading...
Subscribe Newsletter