For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల అవసరాని కంటే అధిక స్వేచ్చను ఇవ్వకూడదు?ఎందుకని?

By Super
|

తల్లితండ్రులనుండి చాలా గారాబం పొందే పిల్లలకు ఏ నియమాలు కాని, నిరాశ కాని, వస్త్రధారణ నియమనిబంధనలు కాని మరియు మర్యాద కాని ఉండవని మీరు అనుకుంటారు. నిజమే, కాని వారు ఒక్కరే కాదు.

మీ అలవాట్లలో కొన్నిటి మూలంగా మీరు గారాబం చూపించే తల్లితండ్రుల కేటగిరి క్రిందకు వొస్తారు అంటే మీరు ఆశ్చర్యపోతారు, నిపుణుల ప్రకారం కూడా, మీరు మీ పిల్లల పట్ల చేస్తున్నది సరిఅయినదిగా భావిస్తుంటారని తెలుస్తున్నది.

5 Signs of Pushover Parents

'చాలామంది తల్లితండ్రులు వారివారి పాత్రను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు' అని పేరెంటింగ్ ఎక్స్పర్ట్ లియోనార్డ్ సాక్స్, MD, PhD, చెస్టర్ దేశం లోని ఫామిలి డాక్టర్, PA, మరియు 'గర్ల్స్ ఆన్ ది ఎడ్జ్ అండ్ బాయ్స్ అద్రిఫ్ట్' రచయిత చెపుతున్నారు. " తమ పిల్లలని టాప్ కాలేజ్ లో సీట్ సంపాయించటం మరియు వాళ్ళు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు మాత్రమే వారి పాత్ర ఉంటుందని చాలామంది తల్లితండ్రుల అభిప్రాయం. క్లిష్ట పరిస్థితులలో రక్షణ వలయంలాగా తల్లితండ్రులు ఉండాలి కాని పిల్లలని కూడా వాటి యొక్క పరిణామాలను తెలుసుకోగలిగే అవకాశాన్ని,తెలివిని పెంపొందించుకోనివ్వాలి."

ఇక్కడ సాధారణంగా తల్లితండ్రులు ఎందుకు, ఎలా పిల్లలని గారాబం చేస్తారో 5 పాయింట్లలో చెపుతున్నాము.

1. నిత్యకృత్యాలు లేదా పరిమితులు లేవు

చాలామంది తల్లితండ్రులకు పిల్లలని పెంచటంలో ప్రణాళిక లేకపోవటం ఒక లోపంగా ఉంటున్నది. దీనితో, వారి సంసారంలోనే క్రమశిక్షణ లేకపోవటం వలన పిల్లలు కూడా క్రమశిక్షణారాహిత్యంగా తయారవుతున్నారు.

2. వివాదానికి దూరంగా ఉండటం

చాలామంది తల్లితండ్రులు పిల్లలతో వాదనలు పెంచుకోవటం కన్నా వారి కోరికలని తీర్చటం సులభం అనుకుంటారు, ఫలితంగా పిల్లలు తల్లితండ్రులను అలుసుగా తీసుకుంటున్నారు. ఈ విషయం చాలామంది తల్లితండ్రులలో చూస్తున్నాము. వారు పిల్లలపట్ల కతినంగా ఉండటానికి ఇష్టపడరు.

3. స్కూల్ పని ఒక వంక

స్కూల్ హోం వర్క్ సాకుతో చాలామంది పిల్లలు ఇంట్లో వారి బాధ్యతలనుండి తప్పించుకుంటున్నారు ఎందుకంటే తల్లితండ్రులు చదువుకి సంబంధించిన విషయాలపట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు.

4. పిల్లలని తమ స్నేహితులలాగా చూడటం

కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలని, అధికారికంగా కాకుండా స్నేహితులలాగా ఉండాలన్న ప్రయత్నంలో చాలా గారాబం చేస్తారు.

5.టెక్నాలజీ పేరుతొ పిల్లలకి బహుమతులు

ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి మరియు చిన్న వయస్సున్న పిల్లలకి కూడా మొబైల్ ఫోన్ ఉంటున్నది ఎందుకంటే వారి తల్లితండ్రులను అడిగి, అలిగి మరీ తీసుకుంటున్నారు. కాని ఇది మంచిది కాదు, తప్పని పరిస్థితులలో పిల్లలు తల్లితండ్రులకు ఏదైనా విషయం చెప్పవలసి వొస్తే తప్ప.

English summary

5 Signs of Pushover Parents | పిల్లల అవసరాని కంటే అధిక స్వేచ్చను ఇవ్వకూడదు..?!

You might think that too-permissive parents are the ones whose kids have no rules, no curfews, no dress code, and no manners. True, but they're not the only ones.
Desktop Bottom Promotion