For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిలంటే ఎందుకంత మమకారం..?!

By Super
|

మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాల్లోనూ అనూహ్య మార్పులొస్తున్నాయి. భారత్ వంటి దేశాల్లో ఆడపిల్లలను ఇప్పటికీ ‘గుండెల మీద కుంపట్లు'గానే భావిస్తుండగా, బ్రిటన్‌లో మాత్రం కూతుళ్ల పెంపకంపైనే దంపతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మగపిల్లల కంటే ఆడపిల్లలకు దుస్తులు, స్కూల్ యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు సమకూర్చేందుకు తల్లిదండ్రులు అధికంగా డబ్బు ఖర్చు చేసేందుకు సుముఖత చూపుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

కుమారుడు ఉన్నప్పటికీ కూతురి దుస్తుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుమార్తెకు మంచి దుస్తులు కొనేందుకు షాపింగ్ చేయడమంటే ఇష్టపడతామని చాలామంది పేరెంట్స్ చెబుతున్నారు. ఏకైక సంతానం కుమార్తె అయితే దుస్తులు, ఇతరత్రా ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే కొత్త దుస్తుల్లో ఎంతో అందంగా, ముద్దొచ్చేలా కనిపిస్తుంటారని 41 శాతం మంది దంపతులు చెప్పడం విశేషం.

అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక బిడ్డకు తల్లితండ్రులుగా ఉండడం అనేది అద్భుతమైన ప్రయాణం. అయితే, అమ్మాయి అయితే తల్లికి మరింత ఉపయోగం ఎందుకంటే ఆమె వలె పిల్ల కూడా అదే ఆలోచనలతో తోడుగా ఉంటుంది. ఒక కుమార్తెను కలిగిఉ౦డడానికి గల కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అమ్మాయి - అమ్మాయి మాట్లాడుకోవడం

అమ్మాయి - అమ్మాయి మాట్లాడుకోవడం

మీరు మాట్లాడడానికి ఫోను అవసరం లేదు, మీరు మీ స్వంత కూతురుని ఒక అమ్మాయిగా అనుకుని మీ భావాలను పంచుకోవచ్చు. కొన్నిసార్లు పురుషులు చిన్నచిన్న విషయాలను, మాటలను లెక్కచేయరు. కానీ మీకు ఒక అమ్మాయి ఉన్నట్లయితే, మీరు చెప్పే విషయాలు వినడానికి ఆమె చెవి మీ వైపు ఉంటుంది.

ఖాళీ సమయం

ఖాళీ సమయం

అమ్మాయిలు ఉన్నవారికి ఇది ఒక అదనపు అవకాశం. మీకు ఇష్టమైన పనులకోసం విశ్రాంతి సమయాన్ని వెచ్చించవచ్చు. మీ ఇద్దరి ఆశక్తులు ఒకటే అయిఉంటే కొత్త వంటలు ప్రయత్నించి, సమయాన్ని ఆనందంగా గడపవచ్చు. అంతేకాక మీరు ఉల్లాసభరితమైన ప్రేమ హాస్య చిత్రాన్ని లేదా ఆడపిల్లల ప్రధానంగా తీసిన చిత్రాన్ని మీ అమ్మాయితో కలిసి చూడవచ్చు.

సాధారణ అభిరుచులను తీర్చుకోండి

సాధారణ అభిరుచులను తీర్చుకోండి

మీకు టైలరింగ్, ఫాషన్ లేదా ఇతర గొప్ప ప్రదేశాల పట్ల అభిరుచి ఉంటె, మీ అమ్మాయి కూడా వాటిని ఇష్టపడే అవకాశం ఉంది. కనీసం, మీరు కలిసి పనిచేయడం వల్ల ఆనందించవచ్చు, తద్వారా ఆమె అభిరుచులు తీరే అవకాశం ఉంటుంది.

కలిసి షాపింగ్ చేయడం

కలిసి షాపింగ్ చేయడం

ఇందుకనే అమ్మాయి ఉండాలి అనేది. చాలామంది పురుషులు షాపింగ్ కి దూరంగా ఉంటారు. షాపింగ్ ఎప్పుడూ అమ్మాయికి చెందినది అని వారు అంటారు. మీకు షాపింగ్ పిచ్చి ఉంటే, దానిని మీరు సంతోషంగా మీ అమ్మాయికి బదిలీ చేయవచ్చు, ఎందుకంటే ఆమె తనకు ఇష్టమైన బట్టలు కొనుక్కోవడానికి, ఎంత సమయమైనా సరే, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా మీతో రావడానికి రెడీగా ఉంటుంది.

ఫాషన్ గురించి చర్చించండి

ఫాషన్ గురించి చర్చించండి

మీరు మార్కెట్ లోని కొత్త ఫాషన్ పద్ధతుల గురించి చర్చించండి, దుస్తులు, ఫాషన్ విషయాల పట్ల తాజాగా ఉండండి. ఏ దుస్తులు మీకు సరైనవి ఏవి సరిపోవు అనేది మీ కుమార్తె నుండి నిజాయితీగా తెలుసుకోండి. ఇదే ప్రశ్న మీరు మీ భర్తను అడిగినట్లయితే, "నువ్వు ఈ దుస్తులలో దేవతలా ఉన్నావు" అనే సమాధానం మాత్రమే వస్తుంది.

అమ్మాయిలూ రాత్రులు మేలుకుని ఉండడం

అమ్మాయిలూ రాత్రులు మేలుకుని ఉండడం

మీరు మీ అమ్మాయితో రాత్రి మేలుకొని ఉండడానికి ప్రణాళిక చేయండి! మీరు మీ అమ్మాయి గోళ్ళరంగు, జుత్తు దువ్వడం, ఫేషియల్ చేయడం చేయవచ్చు. మీరు మీ అమ్మాయితో సెలవులకి కొన్నిరోజులు ఇంటి పనుల నుండి దూరంగా బైటికి వెళ్ళవచ్చు.

English summary

6 Reasons Why Having a Daughter Rocks

Parenting a child, be it a boy or a girl, is a wonderful journey that parents undergo. However, it is an added advantage for the mother if she has a daughter because she has a companion who thinks on the same wavelength as she does. Given below are some reasons on why having a daughter rocks.
Desktop Bottom Promotion