For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు వుండడం ఓ వర౦ ! ఎలా అవుతుందో తెలిపే 9 కారణాలు !!

By Super
|

పిల్లలు వద్దనుకునే దంపతుల సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోంది. ఉక్కిరిబిక్కిరి చేసే ఉద్యోగాలు, ఉరకలెత్తి౦చే సామాజిక జీవనం, ఇంకా వారిని తీరిక లేకుండా ఉంచే అనంతమైన పనుల మధ్య వారికి పిల్లలు కూడా వుండడ౦ చాలా భారంగా అనిపిస్తోంది. కానీ, పిల్లలు వుంటే మీ జీవితం ఎలా మెరుగౌతుందో మీకు ఇక్కడ చాలా కారణాలు ఇచ్చాం.
వు౦టు౦ది.

ఒక బాధ్యత అనే భావన:

మీకు ఓ పిల్లో పిల్లాడో కలగక ముందు మీరు ఎలా జీవించారో కానీ, తల్లి అవడం ఆ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. మీకు బాధ్యతగా వుండడం తప్ప మరో అవకాశం వుండదు, మీ పిల్లల్ని అడ్డాలలో పె౦చడం నుంచి మనుమలకు నీతి వాక్యాలు చెప్పేదాకా. అయితే మిమ్మల్ని జాగ్రత్త తీసుకునే, మార్గదర్శనం ఇచ్చే పెద్ద వారిగా అది మంచికే మారుస్తుంది.

స్వచ్చమైన అమాయకత్వాన్ని చూడడం :

ఒక పసిపిల్ల పడుకుని వుండగా చూడడం కన్నా స్వచ్చమైన, అమాయకమైన విషయం మరోటి ఉండదని చాలా మంది అంటుంటారు. అదొక అద్వితీయ భావన. మీరు కేవలం మీ పిల్లవాడిని స్పర్శించినా లేక వాడిని మీ గుండెలకు హత్తుకున్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

మీరు మళ్ళీ పిల్లలు అయిపోవడానికి ఇదో మార్గం :

మీ పిల్లలు ఎదిగే సమయంలో మీరు కూడా మీ బాల్యాన్ని తిరిగి అనుభవిస్తారు. మీకు పిచ్చివనిపించిన చాలా పనులు ఇప్పుడు మీరు సంతోషంగా చేస్తారు. దిండ్లతో కొట్టుకోవడం, గిలిగింతలు పెట్టుకోవడం, అల్లరి పనులు చేయడం మీ జీవితంలో భాగమైపోయి మీరు నవ్వడానికి మరిన్ని కారణాలు కల్పిస్తాయి.

ఒక సరికొత్త బంధం :

జీవితంలో మరి దేనికీ సాటి రాని తల్లీ పిల్లా బంధాన్ని మీరు కనుగొంటారు. తల్లి కావడం వల్ల ఆనందాలు, ఆందోళనలు, ఉత్సాహం, కంగారు - అన్నీ కలుగుతాయి. మీరు పిల్లలు వద్దనుకుంటే ఇలాంటి సాటి లేని ఆనందాలు ఎన్నో మీరు కోల్పోతారు.

జీవితం పై తాజా దృక్పథం :

మీ పిల్ల వాడు ఒకానొక పరిస్థితిలో ఒక విధంగా ప్రవర్తించడం చూస్తె ఆ పరిస్థితి పట్ల మీ దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం ఏది కాదు అనేది మీకు ఈ విషయం గుర్తు చేస్తూ వుంటుంది.

ఒత్తిడి దూరం చేస్తుంది :

పిల్లలు వుండడం వల్ల ఎంత ఆందోళన, వత్తిడి ఉంటాయో కథలు కథలుగా చెప్పే ఆడవారికి ఈ విషయం ఆశ్చర్యం కలిగించ వచ్చు. కానీ ఒక రోజంతా కష్టపడ్డాక ఇంటికి తిరిగి రాగానే పిల్ల వాడి చిరునవ్వు చూస్తె ఎంత సంతోషం కలుగుతుందో ఎవరైనా తల్లిని అడిగి చూడండి. మీరు ఎంత అలిసిపోయి, నిస్పృహగా, చికాకుగా వున్నా పిల్లవాడి ప్రేమపూర్వక ఆలింగనం చాలా మార్పు కలిగిస్తుంది.

మీ భర్త తో మీ బంధాన్ని బలవత్తరం చేసేందుకు ఇదొక మార్గం :

పిల్లలు వుండడం ఒక వివాహ బంధానికి చాలాసార్లు ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పుట్టగానే దంపతుల మధ్య బంధాలు బలపడడం చాలా సార్లు చూస్తూనే వుంటాం. పిల్లలు వుండడం వల్ల ఒకరిపట్ల ఒకరికి ఎంతో కృతజ్ఞత కలుగుతుంది, పోయిన ప్రేమలను తిరిగి పొందగలుగుతారు.

వృద్ధాప్యం లో మీ బలం :

మీరు వృద్ధులయిపోయి మీ శరీరం సహకరించనప్పుడు, మీ కొడుకో కూతురో మీకు కావలసిన మానసిక, శారీరిక, భావనాత్మక బలాన్ని అందిస్తారు, దాంతో వృద్ధాప్యం ఆనందంగా గడిచి పోతుంది. మీ మాటలు వినడానికి, మీ తల వారి భుజంపై వాల్చడానికి వారు అందుబాటులో వుండి మీ వార్ధక్యం కూడా చిన్న చిన్న ఆనందాలతో నిండిపోతుంది.

జీవిస్తూ పోవడానికి ఒక కారణం :

మనం జీవితంలో చాలా దశలలో పయనిస్తా౦. ఒక్కోసారి కాలం వెళ్ళదీయడానికి మీకు ఊహించనంత బలం కావాల్సి రావచ్చు. జీవితం ఒక్కోసారి మనల్ని కుంగదీస్తుంది. అయితే, మీకు పిల్లలు వుంటే వారి భావిని తీర్చి దిద్దడానికి ఈ కష్టాల్లోంచి బయట పడాలనే ప్రేరణ మీకు నిరంతరం కలుగుతూ వు౦టు౦ది.

English summary

9 Reasons Why Having Kids is a Blessing

There has been a recent surge in the number of couples choosing not to become parents. With demanding careers, a busy social life, and endless things to keep them busy, having a kid seems like something that might weigh you down.
Desktop Bottom Promotion