For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగే పిల్లల కొరకు 15 బెస్ట్ క్యాల్షియం రిచ్ ఫుడ్స్

|

క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా మహిళలు క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు చాలా అవసరం. ఎందుకంటే మహిళలు మోనోపాజ్ దశకు చేరుకోగానే ఎముకల్లో ఉండే క్యాల్షియం తగ్గడం ప్రారంభం అవుతుంది. అయితే, క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఎవ్వరి అవసరం లేదనుకుంటారు. పిల్లలతో సహా.. ముఖ్యంగా క్యాల్షియం గురించి మీరు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే మనశరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే ముఖ్యంగా అవసరమై పోషకాంశం క్యాల్షియం. కాబట్టి మీ పిల్లల పెరుగుదలకు, ఎదుగుదలకు క్యాల్షియం ఎక్కువ అవసరం అని గుర్తించి, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చడం చాలా అవసరం.

పిల్లలు తినేటటువంటి ఆహారాలు చాలా వరకూ క్యాల్షియంను కలిగి ఉంటాయి. కాబట్టి పిల్లలకు అంధించే ఆహారాలను జాగ్రత్తగా పరిశీలించి క్యాల్షియం, మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను ఎంపిక చేసుకొని మరీ అందివ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. క్యాల్షియం రిచ్ ఫుడ్ తినేటప్పుడు క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా అవసరమే.

విటమిన్ డి లేకుండా, క్యాల్షియం ఎముకల్లో చేరలేందు. కాబట్టి, పెరిగే పిల్లల కోసం క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా సమృద్ధిగా ఆహారాలు ఇవ్వాలని నిర్ధారించుకోండి. అన్ని రకాల ఆహారాలు పిల్లలకు ఇవ్వాల్సినవి కావు. ఎందుకంటే క్యాల్షియంను సీపుడ్స్ ప్రాన్స్ మరియు ఓయిస్ట్రెస్ లలో కనుగొనబడింది. అయితే ఈ సీఫుడ్స్ పిల్లలకు అలర్జీకి దారితీస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను పిల్లల డైట్ లిస్ట్ నుండి తొలగించబడింది.

పెరిగే పిల్లల కోసం ఇక్కడ కొన్ని సూటబుల్ క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వబడింది. వాటిని పరిశీలించండి...

పాలు:

పాలు:

పిల్లల పెరుగుదలకు పాల కంటే మరొక ఆహారం ఉండదు. పిల్లల పెరుగుదల మరియు జీవక్రియల రేటు పెంచడంలో పాలలోని క్యాల్షియం అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు గ్లాసుల ఫ్యాట్ మిల్స్ అంధివ్వడం వల్ల క్యాల్షియం మరియు ప్రోటీన్స్ రెండూ పుష్కలంగా అందుతాయి.

చీజ్:

చీజ్:

క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి చీజ్ ఒక మిల్క్ ప్రొడక్ట్. పాలను వివిధ రూపాలుగా (చీజ్, బటర్)గా తయారుచేసినా కూడా అందులోని క్యాల్షియం కంటెంట్ తగ్గదు. పిల్లలకు క్యాల్షియం ఫుడ్ అంధించడంలో ఇది ఒక మంచి ఉపాయం. ఎందుకంటే పిల్లలు చీజ్ ను ఎక్కువగా ఇష్టపడుతారు.

సార్డిన్స్:

సార్డిన్స్:

కోల్డ్ వాటర్ ఓషియన్ ఫిష్ సార్డిన్స్ . వీటిని క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ బూడిద వర్ణంలో ఉన్నటువంటి సార్డిన్స్ ను పిల్లల లంచ్ బాక్స్ కొరకు సాండ్విచ్ గా తయారుచేసి అందివ్వవచ్చు.

కాలే:

కాలే:

కాలే. గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో అనేక క్యాల్షియం కంటెంట్స్ ఉన్నాయి. కాబట్టి కాలే తో సలాడ్ తయారుచేసి ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను పచ్చిది తింటేనే మరింత ఆరోగ్యకరమైన ప్రయోజనం చేకూరుతుంది.

పెరుగు:

పెరుగు:

మరొక క్యాల్షియం రిచ్ ఫుడ్ పెరుగు. పెరుగు పిల్లల యొక్క జీర్ణ శక్తిని పెంపొందించడానికి మరియు ఆకలి పెంచడానికి బాగాసహాయపడుతుంది. అదే సమయంలో క్యాల్షియం శరీరానికి అందేలా చేస్తుంది.

బాదం :

బాదం :

బాదం క్యాల్షియంతో పాటు ‘విటమిన్ ఇ' మరియు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ను కూడా పిల్లకు అందిస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలను పెద్దల డైట్ లిస్ట్ లోనే కాదు పిల్లల యొక్క రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల వారి పెరుగుదలకు అవసరం అయ్యే క్యాల్షియం, విటమిన్ కె మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది. కొంత మంది పిల్లలు ఆకుకూరలు తినకుండా మారం చేస్తుంటారు. అటువంటి వారికోసం కొత్తరుచులతో వెరైటీగా తయారుచేసి ఇవ్వాల్సిన బాధ్యత మీదే...

సోయా మిల్క్:

సోయా మిల్క్:

లాక్టోజ్ లోపం ఉన్న వాళ్ళు పాలలోని ల్యాక్టోజ్ షుగర్ ను జీర్ణం చేసుకోలేరు. ఆలోపాన్ని నివారించడం కోసం పాలకు బదులుగా సోయా మిల్క్ ను అందివ్వడం ఒక గొప్ప ఉపాయం లేదా ఎంపిక.

బ్రాజిల్ నట్స్:

బ్రాజిల్ నట్స్:

బ్రాజిల్ నట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తారు. ఎందుకంటే, వీటిలో అనేకమైన న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఆ న్యూట్రీషియన్స్ లో క్యాల్షియం ఒక మేజర్ నూట్రిషియన్ కాంపోనెంట్.

హెరింగ్స్:

హెరింగ్స్:

సార్డిన్స్ లాగే హెరింగ్స్ కూడా కోల్డ్ వాటర్ ఫిష్. వీటిలో క్యాల్షియం మరియు విటమిన్ డి పుష్కలం. మీ పిల్లల కోసం వీటిని గ్రిల్డ్ చేసి ట్రీట్ ఇవ్వొచ్చు.

టోఫు:

టోఫు:

టోఫు అనేది సోయా ఉత్పత్తి. ఇందులో క్యాల్షియం మరియు విటమిన్ డి అధికం. కాబట్టి టోఫును ఉపయోగించి స్నాక్స్ తయారుచేసి ఒవ్వడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.

వైట్ బీన్స్:

వైట్ బీన్స్:

లెగ్యుమ్ జాతికి చెందిన ఈ గింజల్లో క్యాల్షియం ఎలా ఉంటుందని మీకు ఆశ్చర్యం కలగవచ్చు . కానీ అరకప్పు వైట్ బీన్స్ ను పిల్లలకు అందివ్వడం వల్ల 100గ్రాముల క్యాల్షియం అందుతుందనే విషయం మీకు తెలిసుండకపోవచ్చు.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్స్ మీ పిల్లలకు ఒక అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ . ఉదయం అల్పాహారానికి పాలలో ఓట్ మీల్ మిక్స్ చేసి అందించడం వల్ల క్యాల్షియం పుష్కలంగా అందుతుంది.

ఎండిన మూలికలు:

ఎండిన మూలికలు:

కొన్ని ఎండిన మూలికల్లో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది థైమ్ మరియు రోజ్మెరీ వంటివాటిలో క్యాల్షియం అధికంగా ఉందనడానికి మంచి ఉదాహరణ. ఇటువంటి మూలికలను మీ పిల్లలకు ఇష్టమైన ఆహారాలు, పిజ్జా, నూడిల్స్, పాస్తా వంటివాటితో మిక్స్ చేసి అందివ్వవచ్చు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

పిల్లల ఎదుగుదలతో పాటు వ్యాధినిరోధకతను ఎదుర్కోవడానికి అవసరం అయ్యే విటమిన్ సి'తో పాటు క్యాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉంది.

English summary

Calcium Rich Foods For Growing Kids

Calcium rich foods are essential for everyone. Especially women need these foods because they start losing calcium from their bones after menopause. But no one needs calcium rich foods as much as growing children.
Story first published: Tuesday, September 17, 2013, 17:48 [IST]
Desktop Bottom Promotion