For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పక్క తడపడానికి దారితీసే రాత్రి పూట భోజనం-చిరుతిళ్ళు !

By Super
|

మీకు పక్కతడిపే పిల్లలు ఉంటే, మీరు పక్కతడపడం సమస్యను పరిష్కరించే పోషకాల గురించి పుకార్లు వినేవుంటారు.

సాయంత్రం 6 గంటల నుండి ద్రవపదార్ధాలు తగ్గించండి. ఆరంజ్ జ్యూస్ మానేయండి. మసాలాతో చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండండి.
మీరు మీ పిల్లల పక్కతడిపే సమస్యను పోగొట్టడానికి మీరు వీటన్నిటినీ ప్రయత్నించి ఉండవచ్చు. కానీ మీరు ఇవి చేయడానికి ముందు, పక్కతడపడం ఆపే ప్రయత్నంలో అనవసరమైన ఆహార మార్పుల వల్ల మీరు మీ పిల్లలు ఆనందంగా లేకుండా, మునుపటి కన్నా ఎక్కువ నిరాశ చెందుతారు.
పక్కతడపడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్ధాలు కారణం కావచ్చని వైద్యులు చెప్తారు, అయితే వీటిని సమర్ధించే ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇవన్నీ సంప్రదాయంగా చెప్తూ వస్తున్నవే. పక్కతడపడానికి దారి తీసి ఆహారాలను కనుక్కోవడానికి చిట్కాలు

ప్రతి వారూ ప్రత్యేకమైన వారే కాబట్టి, మీ పిల్లవాడు పక్క తడపడానికి కారణ మౌతున్న ఆహారాలను కనుక్కోవడానికి మీరు, మీ పిల్లవాడు కలిసి ప్రయత్నం చేయండి.
ఒక పుస్తకం వుంచి పక్క తడపడం జరిగినప్పుడు నమోదు చేస్తుంటే ఈ ప్రమాదానికి కారణమైన సంఘటనలను పసి గట్ట వచ్చని నిపుణులు చెప్తున్నారు.
కొంత మంది పిల్లలు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు పక్క తడపకుండా ఉండడానికి ఉపకరిస్తున్నాఎమో తెలుసుకోవడానికి తమదైన సిద్ధాంతాలు ప్రయత్నించే ఆసక్తి కలిగి వుంటారు. పక్క తడపడానికి వారి వ్యక్తిగత కారణాలు తెలుసుకోవడం పిల్లలకు రెండు రకాలుగా మంచిది.
వారి పక్క తడిపే సమస్య మీద వారికి నియంత్రణ ఉందన్న భావన వారికి వస్తుంది, దాని వల్ల దాన్ని పరిష్కరించుకోవడానికి వారు బాధ్యత వహిస్తారు.
పక్క తడపడాన్ని నియంత్రిస్తుందని గానీ, కలుగచేస్తుందని కానీ వారు ఏదైనా ఆహార పదార్ధాన్ని కనుగొంటే అది తీసుకోవడమో, మానేయడమో వారే చేస్తారు, అది కేవలం ప్లాసేబో ప్రభావం వల్ల అయినా సరే.

పక్కతడపడం లో పోషకాహార వ్యూహాలు అమలు చేయడం
మీరు మీ పిల్లల పక్కతడిపే సమస్య నియంత్రించే ప్రయత్నంలో సాయంత్రం తీసుకునే ఆహరం లో మార్పులు చేయాలని నిర్ణయిస్తే, అవి ఈ చెడు ప్రవర్తనకు శిక్ష కాకుండా ఉండేలా చూసుకోండి.
పక్కతడిపే అనేకమంది పిల్లలు, ప్రత్యేకంగా పెద్ద పిల్లలు, నిద్రలో అప్రయత్నంగా మూత్రవిసర్జన చేయడం ద్వారా ఇబ్బందికి గురై సిగ్గుపడుతు౦టారు. అలాగే తరచుగా, తల్లితండ్రులు వారు పరిశుభ్రంగా లేరనే నిస్పృహకు లోనౌతున్నారు. ఇది పిల్లలకు ఆందోళన కలిగించవచ్చు, మానసికంగా వ్యాకులత చెంది, పక్కతడపడం మరింత ఎక్కువ అవుతుంది.

అందువల్ల, మీరు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, వారిని శిక్షించడానికి కాదని పిల్లలకు అర్ధమయ్యేలా చేయడం ముఖ్యం.

మసాలాతో చేసిన ఆహారపదార్ధాలు, పక్కతడపడం: అపోహ

మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలు పక్క తడపడానికి దారి తీస్తాయని తెలియగానే మీ ఇంట్లో సమోసా తినడం మానేశారా? అలా అయితే సరదాగా సలాడ్ లు, సాస్ లు తినేయండి, ఎందుకంటే మసాలాలతో చేసిన ఆహార పదార్ధాల వల్ల పక్క తడపడం జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

కొంత మందిలో మసాలా పదార్ధాలు మూత్రాశయాన్ని ప్రేరేపించడం వల్ల ఈ అపోహ వహ్చింది, విద్యులు కూడా పక్క తడిపే సమస్య వున్న వారిని మసాలా పదార్ధాలు తినవద్దని సలహా ఇస్తారు. కానీ పరిశోధనల్లో మసాలా దినుసులు వాడడానికి, పక్క తడపడానికి ఎలాంటి సంబంధం రుజువు కాలేదు.

సిట్రస్ పదార్ధాలు, పక్క తడపడం - మరో అపోహ

మసాలా పదార్ధాల లాగానే, నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పదార్ధాలు కూడా వాటిలో వుండే ఆమ్లాల వల్ల మూత్రాశాయాన్ని ప్రేప్రేపిస్తాయి. అందువల్ల పిల్లలకు బత్తాయి రసమో, నిమ్మ రసమో ఇవ్వకు౦డా వారికి మేలు చేస్తున్నామని మీరు అనుకోవచ్చు.కానీ మసాలా పదార్ధాల లాగానే, పరిశోధనల్లో సిట్రస్ పళ్లకు, పిల్లలలో పక్క తడిపే అలవాటుకు, అరుదుగా కొంతమందిలో సిట్రస్ కు అలర్జీ వుండే పిల్లలకు తప్ప, ఎటువంటి సంబంధం వున్నట్టు వైద్య పరిశోధనల్లో రుజువు కాలేదు.

కెఫీన్, పక్క తడపడం - వాస్తవం

ఆహారం లేదా పానీయంలో కెఫీన్ వుంటే అది మూత్ర కారకంగా పనిచేస్తుంది, అంటే మూత్రాశయాన్ని ప్రేరేపించి ఎక్కువ మూత్రం ఉత్పత్తి అయ్యేలా చేస్తు౦ది. అందువల్ల మధ్యాహ్నం, సాయంత్రాలలో కెఫీన్ వుండే పదార్ధాలు తీసుకోక పోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

మీ పిల్లవాడు కాఫీ తాగడం లేదు కనుక కెఫీన్ వాడట్లేదని అనుకోవద్దు. టీ, కోలాలు, ఎనర్జీ డ్రింక్ లలో కూడా కెఫీన్ వుంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడే చాకొలేట్ లో కెఫీన్ కు బాగా దగ్గరి సంబంధం వుండే రసాయనం వుంటుంది. అందువల్ల మీరు మీ పిల్లలు వేడి చాకొలేట్ డ్రింక్ కానీ, బ్రౌన్ గా వుండే పానీయాలు కానీ చాకొలేట్ ఐస్ క్రీమ్ కనీ తినకుండా జాగ్రత్త పడ౦డి.

పడుకునే ముందు పానీయాలు తీసుకోవడం, పక్క తడపడం - వాస్తవం

కేవలం మూత్రాశయం లో ఎక్కువ నీళ్ళు వుండడం వల్ల మాత్రమె మీ పిల్లవాడు పక్క తడుపుతున్నాడని అనుకోవద్దు. ఇలా ఆలోచించండి - మీరు పడుకునే ముందు ఒక గాలన్ నీళ్ళు తాగినా మీరు పక్క తడిపే బదులు, లేవగానే మూత్రాశయం ఖాళీ చేయాల్సిందే.

అయినా, పడుకునే ముందు మీ పిల్లవాడికి తక్కువ మోతాదులో ద్రవాలు పట్టించడం మంచిది, ఎందుకంటే అది మూత్రాశయం నిండడాన్ని ఆలస్యం చేసి పక్క తడపడం మరింత ఆలస్యం అవుతుంది. ఈ అదనపు సమయం వల్ల మీ పిల్లవాడు పక్క తడపకుండా మేల్కోవడానికి అవకాశం వుంటుంది.

English summary

Dinner and Nighttime Snacks That Can Cause Wet Nights

If you have a child who wets the bed, you’ve probably heard lots of rumors about nutritional bedwetting solutions.
Desktop Bottom Promotion