For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువున్న పిల్లల్లో హెల్తీగా బరువు తగ్గించే డైట్ టిప్స్

|

ఇటీవల పిల్లలకు శారీరక శ్రమ తగ్గడం, వాళ్లు టీవీ, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వంటి మార్పుల వల్ల అధిక బరువు అనే సమస్య పెరుగుతోంది. పైగా ఇటీవలి జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.

బరువు పెరగడం వల్ల వచ్చే భవిష్యత్తు సమస్యలు : అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లలు భవిష్యత్తులోనూ చాలా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని... అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్, కీళ్లనొప్పులు, కొద్దిపాటి శారీరక శ్రమతోనే, సమస్యలు కలగడం, సమస్యలు పెరగడం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఆస్తమా వమంటి ఇబ్బందులు, నిద్రలేమి, భవిష్యత్తులో సెక్స్ సమస్యలు, కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమస్యలు, డిప్రెషన్, హృదయసంబంధ వ్యాధులు, అమ్మాయిల విషయంలో రుతుస్రావ సమయంలో ఇబ్బందులు వంటివి చాలా సాధారణం.

Healthy Diet Tips for Kids

పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలా : ముందుగా వారికి తగినంత శారీరక శ్రమ కలిగేలా తల్లిదండ్రులు చూడాలి. ఈ శ్రమను పిల్లలు వినోదంగా తీసుకునే చేయాలి. ఉదాహరణకు తల్లిదండ్రులు షాపింగ్‌కు వెళ్లే సమయంలో పిల్లలను ఇంట్లో వదలకుండా తమతో తీసుకుని వెళ్లాలి. ఎక్కువగా నడిచేలా చేయాలి.

ప్రస్తుతం టీనేజ్‌లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి.

స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు.

పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు.

తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది.

పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది.

పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం.

English summary

Healthy Diet Tips for Kids

It's no surprise that parents might need some help understanding what it means to eat healthy. From the MyPlate food guide to the latest food fad, it can be awfully confusing. The good news is that you don't need a degree in nutrition to raise healthy kids. Following some basic guidelines can help you encourage your kids to eat right and maintain a healthy weight.
Story first published: Wednesday, October 23, 2013, 16:07 [IST]
Desktop Bottom Promotion