For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలకు చీకటి అంటే భయం పోగొట్టడం ఎలా?

|

చీకటి భయం అనేది బిడ్డలలో ఉండే అతి సాధారణ భయం. చీకటిగా ఉండే ప్రదేశంలో మీ ఇంద్రియాలు కూడా విశ్రాంతిగా ఉంటాయి కనుక మీరు బాగా నిద్ర పోగలరని అధ్యయనాలలో వెల్లడైంది. చీకటిలో నిద్ర పోవడానికి పిల్లలు సౌకర్యవంతంగా ఉందని భావించగలగడం ముఖ్యం.

చర్యలు

1. మీ పిల్లల పడకింటికి ఒక రాత్రి లైట్ ను పెట్టండి. రాత్రి లైట్లు తగిన౦౦త వెలుతురుని ఇస్తూ మీ పిల్లలు విశ్రాంతిని అనుభవించడానికి సహాయపడతాయి.

2. చీకటిగా ఉన్నప్పుడు మీ పిల్లలు ఎలా ఆలోచించి, భావిస్తున్నారో వారిని అడగండి. వారి భయాలకు, చింతలకు భరోసానివ్వండి.

3. వారి గది వెలుతురు ఉన్నప్పుడు ఎలా ఉందో చీకట్లో కూడా అలాగే ఉన్నదని వారికి చూపెట్టండి. మీరు వారితో బాటుగా వారి మంచం పై కూర్చొని లైట్ ను వెలిగించి ఆర్పి ఈ పని చేసి చూపెట్ట వచ్చు.

4. డిమ్మర్ స్విచ్ కొనండి. బాగా చీకటి అయ్యే దాక ప్రతి రాత్రి కొంచం కొంచంగా వెలుతురు తగ్గించండి. మీ బిడ్డకు ఎంతో విశ్వాసం వచ్చి చివరికి లైట్ ను ఆర్పుతారు.

How to Calm Your Child's Fears of the Dark

5. హాల్లోని లైట్ ను ఆపకుండా ఉంచి తలుపును తెరిచి ఉంచండి, అందువల్ల కొంత వెలుతురు గది లోనికి వస్తుంది. మీ బిడ్డ నిద్రపోయిన తర్వాత మీరు లైట్ ను ఆర్పండి.

6. లైట్ ను ఆర్పి మీ బిడ్డతో బాటుగా చీకట్లో కూర్చోండి. చీకటికి వారి కన్నులు అలవాటు పడే వరకు వారితో ఉండండి, అప్పుడు చీకట్లో కూడా వస్తువులను చూడగలమని వారికి తెలుస్తుంది.

చిట్కాలు

ఫోన్ను లేదా మంచం వద్ద రేడియో ను వారి మంచం వద్ద ఉంచండి, ఒక వేళ వారు భయపడితే మీకు ఫోన్ చేయవచ్చు.

వారికి పిల్లి, గుడ్లగూబ, గబ్బిలం వంటి నిశాచర జీవి రూపంలో ఉండే బొమ్మను కొనిపెట్టండి. వారికీ "చీకట్లో చూడగలిగే ఒక స్నేహితుడు" ఉండి వారిని కూడా చూసుకోగలిగితే వారి భయాలు మాయమౌతాయి.

మీ బిడ్డలను వారు చీకట్లో ఆలోచించే లేదా చూడగలిగే ఏవైన బొమ్మలను గీయమని ప్రోత్సహించండి. భయాలను పారద్రోలడానికి సంభాషించడం అవసరం.

జిల్ టామ్ లిన్ సన్ వ్రాసిన "ది ఔల్ హు వస్ అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్" (ఈ పేజి అడుగున అమెజాన్ లింక్ లో లభ్యమౌతుంది) పుస్తకాన్ని మీ బిడ్డతో కలసి చదవండి.

శాంతా క్లాస్ రావడానికి చీకటి ఎంత అవసరమో అతనికి తెలియ చేసిన ఒక చిన్న అమ్మాయి లాగ ఒక యువ గుడ్లగూబ తాను కలసిన వారి అభిప్రాయాలను విన్న తర్వాత చీకటి పట్ల తన భయాల నుండి ఎలా బయట పడిందో, అనేదే ఈ ఆకర్షణీయమైన కథ

లైట్లు అర్పి భయపడటానికి ఏమి లేదని వారికి తెలియ చేయండి. మీరు కలసి చూసిన సినిమాల సాంకేతికతను గురించి చర్చించుకోండి. అర్ధం చేసుకోవడమే శక్తి.

మీ బిడ్డలకు పరిస్థితిని అదుపు లోనికి తెచ్చే శక్తిని ఇవ్వండి. వారు అలసిపోయామని నిర్ణయించుకొనే వరకు నిశ్శబ్దంగా ఒక పుస్తక౦ చదువుకోవడానికి వారిని అనుమతించండి. వారు మంచం ప్రక్కన ఉన్న లైట్ ను అలాగే ఉంచడం లేదా నిద్రపోవడానికి ముందు లైట్ ను ఆర్పడం చేయవచ్చు. ఒకటికి రెండు సార్లు వారిని గమనించండి కాని ఇది వారికే వదిలేయండి.

హెచ్చరికలు

చీకట్లో ఉన్న దెయ్యాలను భయపెట్టడానికి అమ్మ, నాన్న ఉన్నారనే ఉత్సాహాన్ని వారికి కలిగించకండి, లేకపోతే భయమేసిన ప్రతి సారి మీ దగ్గరకే వారు పరిగెత్తుకొంటూ వస్తారు. పిల్లలు తమకు చీకటంటే ఉన్న భయాన్ని వారి స్వంత మార్గంలో వారనుకొన్న సమయానికి పరిష్కరించుకోవడం నేర్చుకోవలసి ఉంటుంది. అమ్మా నాన్నలను బలిపశువుగా చేయడం అరుదుగా పనిచేస్తుంది.

కొంత మంది పిల్లలు నిశ్శబ్దంగా ఉండే జురాసిక్ పార్క్ వంటి సినిమాల వలన నిరాశ, నిస్పృహ లకు గురి కావచ్చు. ప్రత్యేకంగా లైట్లు లేకుండా లేదా నిద్రపోవడానికి ముందు సినిమాలను కలసి చూసిన తర్వాత మీ బిడ్డతో మాట్లాడటం మరువ కండి.

English summary

How to Calm Your Child's Fears of the Dark | పిల్లలకు చీకటి భయం పోగొట్టడం ఎలా...?

Fear of the dark is an extremely common fear in children. Studies have shown that you sleep better in the dark, because it allows your senses to completely turn off. It is important for children to be able to feel comfortable enough in the dark to sleep.
Story first published: Wednesday, January 2, 2013, 18:54 [IST]
Desktop Bottom Promotion