For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని ఎలా పెంచవచ్చు?

By Super
|

మీ పిల్లలు చాలా సులభంగా చిన్న చిన్న విషయాలను మర్చిపోతున్నారా, తరచూ ఏకాగ్రత కోల్పోవడం మీరు చూసారా? అయితే అప్పుడు మీ పిల్లలలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని అర్ధం చేసుకోవాలి.

పిల్లలు టెలివిజన్ చూడటానికి ఎంతోఇష్టపడతారు. అతను తనకిష్టమైన కార్టూన్ ప్రోగ్రాం చూసేటపుడు మాట్లాడించండి. పలకడు. మీరు అతని పేరును రెండు సార్లు పిలవండి. లేదా కొంచెం గట్టిగానే పిలిచి మీ వైపు చూసేలా చేయాల్సి వుంటుంది. అదే విధంగా, అతను చదువుకునేటపుడు పిలవండి. మీరు పిలిచి పిలవగానే అతను మీ వైపుకు దూసుకు వచ్చేస్తాడు. చదువుకునేటపుడు అధిక ఏకాగ్రతతో వుండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మా పిల్లాడు టివి చూడటంలోని ఏకాగ్రత చదువులో చూపిస్తే ఎంత బాగుండు అనుకుంటారు. ప్రతి తల్లి తండ్రికి పిల్లల ఏకాగ్రత ఒక సమస్యే. కాని పిల్లల ఏకాగ్రత లేదా జ్ఞాపకశక్తి పెంచాలంటే ఎంతో తేలికే! అదెలాగో చూడండి..!

వృత్తి ఏదైనప్పటికి ఏకాగ్రత ప్రతి ఒక్కరికి అవసరమే. ఇటుకలు తయారీ అయినా...లేక గొప్ప సైంటిస్టు అయినా వారి పనిలో విజయులవ్వాలంటే...ఏకాగ్రత కావలసిందే. మన మనసు చంచలం అన్నది మనందరకు తెలుసు. అయితే, నిరంతర సాధన, నిశ్చితత్వం ల ద్వారా మన మనసును నియంత్రణలోకి తెచ్చి ఏకాగ్రతను ఏర్పరచవచ్చు. కింద ఇచ్చే చిట్కాలు మీ పిల్లల ఏకాగ్రత పెంచటానికి పనికి వస్తాయి. పరిశీలించండి.

ప్రణాళిక:

ప్రణాళిక:

మెదడు బాగా పని చేయడానికి తగినంత శక్తి అవసరం. క్రమం తప్పకుండా శారీరక చర్యలు మరియు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి పోషణ అందించబడుతుంది. మీ పిల్లలు బలమైన మానసిక కార్యక్రమములలో ఉన్నప్పుడు అంటే పరీక్ష సన్నాహాలు,ఇతర కార్యక్రమాల కొరకు ప్రణాళికా రచన వంటి వాటికీ అదనపు శక్తి అవసరం అవుతుంది.

ఆహారం:

ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారంను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు, జింక్, లెసిథిన్, మాంగనీస్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ E వంటి విటమిన్లు మరియు ఖనిజాలు కలిగిన కొన్ని ప్రధాన ఆహారాలను కూడా తీసుకోవలసిన అవసరం ఉంది.

పోషకాలు:

పోషకాలు:

మంచి పోషకాలు ఉన్న ఆహారాలుగా పూర్తి గోధుమ ఉత్పత్తులు, బ్రౌన్ రైస్, వోట్స్, సోయా చిక్కుళ్ళు మరియు చిక్కుళ్ళు, గుడ్లు, పాలు, పెరుగు,జున్ను(అవును ఒక అల్పాహారం వలె జున్ను ఇవ్వడానికి సురక్షితమైనది), డ్రై ఫ్రూట్స్, శుద్ధికాని కూరగాయల నూనెలు ఉంటాయి. అవిసె గింజలు మరియు చేపలలో కూడా ఎక్కువగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు యొక్క మంచి వనరులు ఉన్నాయి.

వ్యాయామం-నిద్ర:

వ్యాయామం-నిద్ర:

ఈ పోషకాలతో పాటు తగినంత నిద్ర మరియు వ్యాయామం అవసరం. వ్యాయామం మెదడుకు తాజా ఆక్సిజన్ అందించి ఉత్తేజపరిచటానికి మరియు నిద్ర మెదడు విశ్రాంతికి సహాయపడుతుంది.

పిల్లల మెదడు

పిల్లల మెదడు

మీ పిల్లల మెదడుకు పదును పెట్టె కార్యకలాపాలు అంటే చెస్, పజిల్స్, క్రాస్వర్డ్స్ మరియు మెమరీ గేమ్స్ తయారుచేసి ఆడించండి.

English summary

How can you increase your child’s concentration and memory?

Have you seen your child losing concentration quite often, forgetting trivial things very easily? Then your child’s memory must be suffering.
Desktop Bottom Promotion