For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో మంచి ప్రవర్తనకు ప్రోత్సాహం-అభినందన రెండు అవసరమే...

|

పిల్లల్లో క్రమశిక్షణ పెంచడానికి ఎలా ఉండకూడదో? చెప్పేకన్నా, ఎలా ఉండాలో చెప్తేనే మంచి ప్రభావం ఉంటుంది. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. తల్లిదండ్రులకు ఇది పెద్ద పరీక్ష వంటిదే. కాబట్టి మీ పిల్లలు మంచి ప్రవర్తనను, మంచితనాన్ని చూపితే వెంటనే వారిని అభినందించండి. కాని పొగడ్తలతో ముంచేయద్దు.

పిల్లల్ని అభినందించడం ఎలా...
1. ఏపనైనా వారు సరిగా చేసినందుకు సానుకూలమైన మాటలతో ప్రోత్సహించండి.
2. చిన్న విషయమైనా సరే బాగా చేస్తే చేసినపుడు పొగడుతూ ఉండండి. పదేపదే వద్దు.
3. నువ్వు పెద్దవారి పట్ల చాలా చక్కగా, మంచిగా ప్రవర్తించావురా అని.
4. నువ్వు చిత్రలేఖనంలో మంచినేర్పు గలవాడవని లాంటి సానుకూలమైన పొగడ్తలు చేస్తే, ఇంకా మంచి పనులు చేయగలుగుతాడు.
5. మీ మాటలే వారి గొప్ప బహుమానాలు కావాలి. వస్తువులేవియునూ ఇవ్వవద్దు.
6. వ్యతిరేకధోరణిలో మాట్లాడవద్దు. తిట్టవద్దు. కొంత సమయాన్ని మీ పిల్లల పనులతో గడపండి.
7. పిల్లల పనులలో మీ శ్రద్ధ వారికి సానుకూల దృక్పధాన్ని, మీపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి.
8. పిల్లలను ఎక్కడికైనా తీసుకొని వెళ్లండి. వారితోనే భోజనం , ఆరోజు గడపటం చెయ్యండి.

How to Encourage Positive Behavior in Children

పిల్లల్లో ప్రవర్తనకు ప్రోత్సాహం:
1. పిల్లలు ఇంట్లో అటూ, ఇటూ పరుగులు తీస్తూ అల్లరి చస్తుంటే ‘అలా ఇంట్లో పరిగెట్టకండి' అని అరిచే కంటే, ‘ఇంట్లో నడిస్తేనే మీరు బావుంటార్రా'అని అనాలి.
2. అలాగే అన్నా, చెల్లి, అక్కా,తమ్ముడు దెబ్బలాడు కుంటుంటే ‘మీరు నిశ్శబ్దంగా ఆడుకుంటేనే మంచిది. మీకో తాయిలం పెడతా' అని నెమ్మదిగా చెప్పాలి. అంతే కాకుండా వాళ్ళు అలా మీరు కొరుకున్నట్టు ప్రవర్తిస్తుంటే ‘మీరు ఇలా ఉంటే నాకిష్టం'అని మెచ్చుకోవాలి.
3. పిల్లలు ఎప్పుడూ, అన్ని పనులూ బ్రహ్మాండంగా చేస్తూ, నూరుశాతం క్రమశిక్షణతో ఉంటారని తల్లిదండ్రులు ఆశించకూడదు. క్రమశిక్షణగా ఉండాలనే పిల్లల ప్రయత్నాన్ని వారి చంచలమనస్సు ఎప్పటికప్పుడు పాడు చేస్తుంటుంది. కాబట్టి వారు ఎంత వరకూ బాగా ప్రవర్తించినా ఆ కొద్ది పాటి సత్ప్రవర్తననే మెచ్చుకుంటే పిల్లలు మరింత క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.

English summary

How to Encourage Positive Behavior in Children | పిల్లల ప్రవర్తనకు ప్రోత్సాహం-అభినందన రెండు అవసరమే...

Instilling positive behavior in children can often test the patience of parents. However, an early start helps you build a good foundation of your child's behavior and attitude. Here are some useful ideas to help you with this task.
Story first published: Friday, April 12, 2013, 17:54 [IST]
Desktop Bottom Promotion