For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు గోర్లు కొరకడం మాన్పించడానికి సులభ చిట్కాలు

|

మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా, ఉన్నట్లైతే వారిని గమనించినట్లైతే వారు ఏదో ఒక చెడు అలవాటును కలిగి ఉంటారు. పిల్లల్లో అతి సాధరణ చెడు అలవాటు పిల్లలు నోట్లో వేళ్ళు పెట్టుకోవడం లేదా గోళ్ళు కొరకడం ఎక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎవరైతే గోళ్ళు కొరుకుతారో అటువంటి పిల్లల్లో ఒక విధమైన భయం కలిగి ఉంటారు. మరియు వారు గోర్లు కొరకడం వల్ల వారిలో భద్రత భావన కలుగుతుందనేది వారి నమ్మకం. గోళ్ళు తరచూ కొరకడం వల్ల ఇది ఒక చెడు అలవాటుగా మారుతుంది. దాంతో పిల్లల్లో కడుపుకు సంబంధించిన అనే ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. మీ పిల్లలు ఇటువంటి అసాధరణ చెడు అలవాట్ల వల్లే కొన్ని ఇన్ఫెక్షన్స్ కు గురికావల్సి వస్తుంది. చేతులతో వివిధ రకాల వస్తువుల, బొమ్మలు చేత పట్టుకొని ఆడుకోవడం, తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా అలాగే నోట్లో పెట్టుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

కాబట్టి, ఈ అలవాటు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు గమనించిన వెంటనే కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వారిలో స్టొమక్ ఇన్ఫెక్షన్స్ మరియు స్టొమక్ అప్ సెట్ వంటి సమస్యలను నివారించవచ్చు. చిన్న పిల్లల్లో ఈ అలవాటును మాన్పించడానికి అనేక మార్గాలున్నాయి. మరి తల్లి దండ్రులు పాటించాల్సిన చిట్కాలేంటో ఒక సారి చూద్దామా...

1. తరచూ గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి:

1. తరచూ గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి:

చెడు అలవాటను మాన్పించడం కోసం, తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి చేతి వేళ్ళ గోళ్లను అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తుండాలి . పిల్ల చేతివేళ్ళకు గోళ్లు పొడవుగా పెరిగే వరకూ వేచి చూడకండి, అది చెడు అలవాటుగా మారుతుంది.

2. నెయిల్ పాలిష్ అప్లై చేయండి:

2. నెయిల్ పాలిష్ అప్లై చేయండి:

చిన్న పిల్లల గోళ్లకు నెయిల్ పాలిష్ అప్లై చేయడం వల్ల వారు అలవాటును మానుకోవడానికి అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ నెయిల్ పాలిష్ ను అప్లై చేయాలి.

3.గ్లౌజులు తొడగాలి:

3.గ్లౌజులు తొడగాలి:

పిల్లల చేతులకు గ్లౌజులను తొడగాలి. గోళ్లు కొరకడాన్ని ఆపుచేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

4. ఉప్పు రాయండి:

4. ఉప్పు రాయండి:

గోళ్లు కొరికే పిల్లలను గమనించినప్పుడు వారి చేతికి కొంచెం స్ట్రాంగ్ గా ఉప్పును అప్లై చేయండి. దాంతో వారు గోర్లు కొరికే చెడు అలవాటును తగ్గించుకుంటారు.

5. మీ పిల్లలను ఎప్పుడూ ఏదోఒక పనిలో బిజీగా పెట్టండి:

5. మీ పిల్లలను ఎప్పుడూ ఏదోఒక పనిలో బిజీగా పెట్టండి:

గోర్లు కొరికే పిల్లలను, గోర్లు కొరకకుండా మనస్సు మరల్చాలంటే వారిని ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యే విధంగా చేయాలి. దాంతో ఈ చెడు అలవాటును మాన్పించవచ్చు.

6. కారం పొడి అప్లై చేయండి:

6. కారం పొడి అప్లై చేయండి:

పిల్లల్లో ఈ చెడు అలవాటు ఎక్కువగా ఉన్నప్పుడు మిర్చి పౌడర్ అప్లై చేయకతప్పదు. అయితే మితంగా అప్లై చేయాలి. ముఖ్యంగా ఆ చేతులతో వారు కళ్ళు ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి.

7. నూనె:

7. నూనె:

గోర్లు కొరకడం మాన్పించడానికి ఇది ఒక ప్రధాన చిట్కా. ఆముదం నూనెను చేతికి అప్లై చేయడం వల్ల వారు అలవాటను మార్చుకుంటారు.

8. కాకరకాయ రసం:

8. కాకరకాయ రసం:

బిటర్ జ్యూస్, అంటే కాకరకాయ రసాన్ని అప్లై చేయడం వల్ల ఈ చెడు అలవాటును తప్పనిసరిగా మాన్పించవచ్చు. కాకరకాయను గ్రైండ్ చేసి ఆ రసాన్ని వారి వేళ్ళకు అప్లై చేయాలి. వారు వెంటనే గోర్లు కొరకడం మానేస్తారు.

9. అవగాహన కల్పించండి:

9. అవగాహన కల్పించండి:

గోర్లు కొరకడం వల్ల ఏంజరుగుతుందో వారికి, వారి భాషలో తెలియజేయండి, నోట్లో వేలు పెట్టుకున్నా, గోర్లుకొరికినా మీ దగ్గరికి ఎవ్వరు రారని, లేదా మీతో ఆడుకోరని చెప్పండి.

10. అలవాటును అధిగమించండి:

10. అలవాటును అధిగమించండి:

ఈ చెడు అలవాటును అధిగమించేందుకు ఒక క్రమమైన పద్దతిని అనుసరించాలి . గోర్లు కొరకడం వల్ల కలిగే నష్టాల గురించి వారికి వివరించండి. అది పనిచేయనప్పుడు మరో పద్దతిని ఫాలో చేయండి.

11. కారణం కనుక్కోండి:

11. కారణం కనుక్కోండి:

అతడు/ఆమె గోర్లు కొరకడానికి కారణాన్ని కనుగొనండి. వారు ఈ చెడు అలవాటుకు ఖచ్చితమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది. అది భయం వల్ల లేదా అభద్రత వల్ల కావచ్చు.

 12. గోర్లు పెంచుకోవడనానికి ఇష్టపడేలా చేయండి:

12. గోర్లు పెంచుకోవడనానికి ఇష్టపడేలా చేయండి:

గోర్లు కొరేకే పిల్లలకు గోర్లు కొరకుండా ఉండటానికి, వాటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలిని తెలియచేయండి.

13. ప్రత్యామ్నాయంగా స్నాక్స్ అంధించండి:

13. ప్రత్యామ్నాయంగా స్నాక్స్ అంధించండి:

ఒక చిన్న బౌల్లో స్నాక్ అంధించడం ద్వారా గోర్లు కొరకడాన్ని మాన్పించవచ్చు. కరకరలాడే స్నాక్స్ ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం.

 14. పనిష్మెంట్ ఇవ్వకండి:

14. పనిష్మెంట్ ఇవ్వకండి:

ఈ చెడు అలవాటును మీ పిల్లలు కలిగి ఉన్నప్పుడు, పనిష్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించకండి. వారు అర్ధం చేసుకొనే విధంగా తెలియజేడం తల్లిదండ్రుల బాధ్యత.

15. రివార్డ్స్:

15. రివార్డ్స్:

ఇది ఒక ఉత్తమ టెక్నిక్. గోర్లు కొరకకుండే ఉంటే ఒక బహుమతిని ఇస్తానని లేదా వారి మెచ్చకోవడం చేస్తుండాలి.

English summary

How To Stop Nail Biting In Kids

If you have a small kid, you will notice that they tend to pick up one bad habit or the other. One of the most common bad habits of children is biting the nails.
Story first published: Wednesday, November 20, 2013, 16:54 [IST]
Desktop Bottom Promotion