For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగే పిల్లల కొరకు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్స్

|

ఆకలేస్తే, ఆ సమయానికి ఏది పెడితే అది తినేస్తారు పిల్లలు. వాళ్లకి ఆకలి తప్ప ఆరోగ్యం తెలియదు కదా మరి. అందుకే వాళ్లకి ఏం పెడుతున్నాం, ఏం తింటున్నారు? అనే ప్రశ్నలు పెద్దవాళ్లే వేసుకోవాలి. అంతేకాదు అందుకు సరైన సమాధానం చెప్పే బాధ్యత కూడా పెద్దవాళ్లదే. ఆరోగ్యాన్నిచ్చేందుకు అవసరమైన ఆహారాన్ని సమయానికి అందించాలి. పిల్లలకు ఇష్టమైన ఆహారం వారి ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుంటే దాన్నుంచి వారి దృష్టిని ఎలా మరలించాలి అనేది ఆలోచించాలి. అదీ మరొక ఆరోగ్యకరమైన ఆహారంపై వారికి అభిరుచిని ఏర్పరచడం ద్వారానే సుసాధ్యం చేయాలి. మరి మీ వాళ్లకు ఏంపెడుతున్నారు, వారి ఆరోగ్యానికి ఏం అవసరం, వారు ఏం తింటున్నారు? ఇవన్నీ మీరు గమనిస్తున్నారా....

Kids

1. మొదటగా మీరు పిల్లలకు ఇచ్చే ఆహారంలో పళ్లు ఎంతవరకు వాడుతున్నారో చూడండి. ఎదిగే పిల్లలకు ఇచ్చే ఆహారంలో పళ్లు ప్రధానంగా ఉండాలి. వీటితో పాటు పాల ఉత్పత్తులతో తయారైన పదార్థాలు కూడా పిల్లలకు ఎంతో అవసరమని గుర్తించండి. అవి పిల్లల ఆహారంలో అలవాటు చేసి వాళ్లే అడిగి తినేలా చేయండి.
2. ఇంట్లో బంధువులు వచ్చినపుడు వాళ్లకు అనేక రకాల వంటకాలు చేసి పెట్టడం మామూలే. అలాంటి సమయాల్లో పిల్లలకు అవసరమైన పోషకాలు అందే ఆహారం అందులో ఉందో, లేదో చూసుకోవాలి. అలా లేకపోతే మాత్రం రోజూ పిల్లలకు మీరిచ్చే పోషకాహారం కచ్చితంగా ప్రత్యేకంగా తయారుచేసి వారికి అందించాలి. ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎప్పుడూ సమతుల్యంలో అందుతాయి.
3. ఆహారం తీసుకునే సమయంలో పిల్లలు టి.వి చూడటం, వీడియో గేమ్స్‌ ఆడుతూ ఉండటం చేస్తున్నా రేమో గమనించండి. అలాంటి అల వాట్లు ఉంటే వెంటనే మాన్పించండి. ఇవి వారి ఆరోగ్యానికి చేటు చేసే పద్ధతులు అని వారికి అర్థమయ్యేలా వివరించండి.
4. ఆకుకూరలు, పోషకాలు ఉన్న ఆహారం తినలే మని మొండికేస్తే సమోసాల్లో, పరోటాల్లో కలిపి పెట్టేయండి.
5. పాలు తాగని పిల్లలకు పాలతో తయారు చేసిన కోవా, పనీర్‌, రసమలై వంటివి తినిపించండి. క్యారెట్లు, బీట్‌రూట్లు తినకపోతే హల్వా, లౌజుల రూపంలో ఇవ్వండి.
6.బొప్పాయి, కర్బూజ వంటి కొన్ని పళ్లను ఇష్టపడకపోతే వాటిని ఫ్రూట్‌సలాడ్లలో మిక్స్‌చేసి చెప్పండి. లేదా వారు ఇష్టంగా తాగే కొన్ని జ్యూసులలో రెండు ముక్కలు మిక్సీలో వేసి కలిపేయండి.
7 .జీడిపప్పులు, బాదంపప్పువంటి డ్రైఫ్రూట్స్‌ రోజులో రెండు మూడు చేతికి ఇవ్వండి. బాదంపప్పు, కర్జూర వంటివి నీళ్లలో నానబెట్టి తినిపించండి. అవి కూడా తినకపోతే ఫ్రూట్‌ సలాడ్‌ లేదా పాలల్లో కలిపి ఇవ్వండి.
8. చదువుకునే పిల్లలకు స్ప్రౌట్స్‌ తినిపించడం జ్ఞాపకశక్తికి ఎంతో మంచిది. వారానికి రెండు సార్లయినా పిల్లలకు ఇస్తుండాలి. ఇవి ఇష్టపడి నప్పుడు, వీటిల్లో నిమ్మకాయరసం పిండి కీర వంటి కొన్ని కూరగాయ ముక్కలు లేదా పెరుగుతో కలిపి వెరైటీగా అందించే ప్రయత్నం చేయండి.
9. ఎప్పుడూ వేపుడు కూరలు కావాలని అడు గుతుంటే కూరను కుక్కర్‌లో ఉడికించి ఆ తరువాత పల్లీలపొడి, లేదా పుట్నాల పొడి కలిపి మూకుడులో కొద్దిసేపు అటుఇటుగా తిప్పితే పొడి ొడిగా అయిపోతుంది. దీన్ని వేపుడు కూరగా అందించండి.
10. ఏదో వండి పెడుతున్నాం, మనం పెట్టింది వాళ్లు కడుపునిండా తింటున్నారని కాకుండా పోషకాహారం గురించి, ఆహారం తీసుకో వటంలో పాటించాల్సిన కనీస జాగ్రత్తల గురించి ఏ సెలవు రోజుల్లోనో అప్పుడప్పుడూ వారితో చర్చిస్తూ ఉండండి. వారికి కూడా ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. ఎప్పుడైనా బయట ఆహారం తినే సందర్భం వచ్చినా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

English summary

Nutrition Food For Growing Kids

Concerned about your child's eating habits? Parents are the only ones who can raise children to be healthy eaters. But it really gets difficult to teach your children healthy eating habits. They hate things that are supposed to be the most healthy.
Story first published: Saturday, November 16, 2013, 16:21 [IST]
Desktop Bottom Promotion