For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓవైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల పెంపకం సాధ్యమా?

|

ఓ వైపు పిల్లల పెంపకం, మరో వైపు ఉద్యోగ బాధ్యతలు ఈ రెండింటిని సమతౌల్య పరుచుకోవడంలో మెళకువలు చెప్తారా?

ఈ రోజుల్లో చాలామంది మీమాంస పడే విషయమిది. ముందుగా పిల్లలకు ఉద్యోగం చేసే తల్లి పనుల ఒత్తిడిని నెమ్మది నెమ్మదిగా అవగతం చేస్తుండాలి. తాము పిల్లలతో చాలినంత సమయాన్ని గడపలేకపోతున్నామనే న్యూనతా భావంతో పిల్లలేం డిమాండ్ చేసినా సరేననే దృక్పథం చాలామందిలో సమంజసం కాదు.

నిబంధనలు విధించడమనేది ఉద్యోగం చేసే తల్లుల పెంపకంలోనైనా, ఉద్యోగినులు కానివారి పెంపకంలోనైనా, ఉద్యోగినులు కానివారి పెంపకంలోనైనా ఒకటేనని గుర్తించుకోవాలి. పోనీలే అని వదిలేస్తే పిల్లల్లో ప్రవర్తనా సంబంధిత తేడాలొస్తాయి.

Super Mom

కుటుంబ సభ్యులతో అంటే ఇంట్లోని పెద్దవారితో, ఇతర బంధువులతో చక్కని బాంధవ్యాలు అనుసరించాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వారి మద్దతు, సహాయ, సహకారాలు అందుతాయి. ఫలితంగా ఎంతో ఒత్తిడిని నివారించుకోగల అవకాశం ఏర్పడుతుంది.

పిల్లల బాధ్యత అంటే తానొక్కదాన్నే మోయాలన్న భావాలు పెంచుకోకూడదు. భాగస్వామికి కూడా పనులు అప్పగించాలి. ఇద్దరూ కలిసి బాధ్యతల్ని పంచుకున్నప్పుడే పిల్లల ఎదుగుదలలో ఆరోగ్యవంత వైఖరి కనిపిస్తుంది.

పిల్లలు మరీ చిన్నవారైనప్పుడు, ఇంట్లో ఎవరూ చూసుకోవడానికి లేరనుకున్నప్పుడు ఏ పనివాళ్ళమీదో వదిలేసివెళ్ళి, ఇంటికి వచ్చేవరకు టెన్షన్ పడే బదులు మంచి చైల్డ్‌కేర్ సెంటర్‌ను ఎంచుకుంటే రిలాక్సింగ్‌గా వుంటుంది.

ఉద్యోగం ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం అన్నీ జీవనగమమనంలో భాగాలు. ఒకదానికోసం ఒకటి వదులుకోవాల్సిన పనిలేదు. దేనికిచ్చే ప్రాముఖ్యం దానిదే. కాబట్టి వూరికూరికే ఆందోళనపడే తత్త్వాన్ని పెంచుకోకుండా చక్కని సమయపాలన, సామర్థ్యాలతో సులువుగా సాగిపోవడాన్ని చక్కగా అలవరచుకోండి.

English summary

Stop Trying To Be A Super Mom!

Most working mothers have this notion that they can manage everything; their home, kids and office without ever having a single hair ruffled. But being a super mom is not as much fun as you think. Most women go back to work after having a baby these days. This phenomenon comes with its own set of troubles.
 
Story first published: Monday, August 26, 2013, 17:41 [IST]
Desktop Bottom Promotion