For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలు రాత్రి పూట హాయిగా పడుకోవటానికి చిట్కాలు

By Lakshmi Perumalla
|

మీ పిల్లలకు మంచి నిద్ర అనేది సరైన మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీ పసిబిడ్డలకు సరైన నిద్రవేళ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఒకసారి మీరు మీ పసిపిల్లల కోసం నిద్రవేళలను అమలు చేయాలి. లేకపోతె మీకు గందరగోళాలు మరియు ఆందోళనలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఒక సాధారణ నిద్ర లేదా ముందుగా బెడ్ నిత్యకృత్యాల గురించి పద్ధతులు మరియు నిద్రకు సంబంధించిన నమూనాల గురించి తెలుసుకోవాలి.

మీరు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే,మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోవాలి. మీరు మీ పసిపిల్లల నిద్రవేళ కోసం కొన్ని సులభమైన మరియు సాధారణ చిట్కాలు అవసరం. పసిబిడ్డలు నిద్రవేళ ప్రతి రోజు ఒక సమయం అంటూ ఉండదు. ఇది ప్రతి పసిపిల్లలకు వారి అవసరాలు మరియు ఆసక్తులను బట్టి మారుతుంటుంది.

నిద్రవేళ కోసం వినూత్న చిట్కాల తరువాత సమయం ఆహ్లాదకరమైన మరియు ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ మీరు తక్కువ కృషితో పరిస్థితిని నిర్వహించడానికి సహాయపడే పసిపిల్లల యొక్క నిద్రవేళ కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి.

నిర్దిష్ట సమయం

నిర్దిష్ట సమయం

ప్రతి రోజు వారు పడుకోవటానికి ఒక నిర్దిష్ట సమయం ఉండాలనేది చాలా కీలకమైన చిట్కా అని చెప్పవచ్చు. నిద్ర అనేది వారి రోజు వారి కార్యక్రమాలలో ఒక భాగంగా ఉండాలి.

డిన్నర్

డిన్నర్

మీ పిల్లలు పడుకోవటానికి ముందు డిన్నర్ కు అనుమతించవద్దు. దీని వలన రాత్రి పూట ఎక్కువ సార్లు మేల్కొవటం జరుగుతుంది. రాత్రి పడుకొనే ముందు ఆహారం ఇవ్వటం వలన వారికీ నిద్ర కూడా దూరం అవుతుంది. కాబట్టి మీ పిల్లలకు మంచి ఆహారాన్ని పడుకోవటానికి ఒక గంట ముందు పెట్టాలని గుర్తుంచుకోండి.

వెచ్చని స్నానం

వెచ్చని స్నానం

పసిబిడ్డలు నిద్రవేళకు ముందు ఒక వెచ్చని స్నానం చేయించుట వలన మంచి నిద్రకు సహాయం చేస్తుంది.ఒక వెచ్చని స్నానం చేయుట వలన ఒక మంచి నిద్ర కలిగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాక మీ పిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రత సౌకర్యవంతముగా ఉంటుంది.

దుస్తులను సిద్ధంగా ఉంచండి

దుస్తులను సిద్ధంగా ఉంచండి

ఒక వెచ్చని స్నానం తర్వాత వదులుగా మరియు సౌకర్యవంతముగా ఉన్న రాత్రి దుస్తులను సిద్ధంగా ఉంచండి. నిద్రవేళ కోసం ముఖ్యమైన చిట్కాలలో ఒకటిగా దీనిని అమలు చేసే ప్రయత్నంలో విజయవంతముగా సహాయం చేస్తుంది.

ఆరోగ్యకరమైన పద్ధతులు

ఆరోగ్యకరమైన పద్ధతులు

మీ పిల్లలు పడుకోవటానికి ముందు వారి ముఖం కడగటం,నాపి మార్చటం,బ్రష్ చేయటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పరిచయం చేయాలి. నిద్రవేళ చిట్కాలు పిల్లాడిని మంచి నిద్రవేళ అమలు కోసం ఆరోగ్యకరమైన పద్ధతులు చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి.

నిద్రవేళ కథలు

నిద్రవేళ కథలు

మీ చిన్న పిల్లలు మీరు చెప్పిన వాటిని అర్ధం చేసుకుంటారని భావించుట లేదు. కానీ వారు సులభంగా నిద్రపోవటానికి నిద్రవేళలో రొటీన్ గా కధ చెప్పటం అవసరం. ఇటువంటి నిద్రవేళ చిట్కాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మీ ధ్వని వారు పడుకోవటానికి మరింత సౌకర్యవంతం చేస్తుంది.

మృదువైన సంగీతం ప్లే చేయండి

మృదువైన సంగీతం ప్లే చేయండి

మృదువైన సంగీతం మనస్సు ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది పసిబిడ్డల విషయంలో బాగా పనిచేస్తుంది. ఏదైనా మృదువైన సంగీతం ప్లే చేస్తే విశ్రాంతికి సహాయం చేస్తుంది. మృదువైన సంగీతం ప్లే చేయటం అనేది మీ పిల్లవాడు సౌకర్యవంతంగా పడుకోవటానికి నిద్రవేళ చాలా ఉపయోగకరమైన చిట్కాలలో ఒకటి.

గుడ్ నైట్ చెప్పండి

గుడ్ నైట్ చెప్పండి

మీరు మీ పిల్లలకు గుడ్ నైట్ చెప్పటం ద్వారా వారికి నిద్రవేళ అయినదని తెలుస్తుంది. మీ పిల్లవాడు పడుకోవటానికి సిద్ధం చేయండి. కొన్నిసార్లు మీరు ఒక ముద్దు లేదా కౌగిలింత ఇవ్వడం ద్వారా మీ పసిపిల్లలను సౌకర్యవంతము చేయవచ్చు.

నిద్ర వాతావరణం

నిద్ర వాతావరణం

మీరు మీ పసిబిడ్డ కోసం సురక్షితమైన మరియు భద్రతా అనుభూతి కలిగేలా చేయాలి. లేకుంటే నిద్రవేళ కోసం మీ చిట్కాలు ఏమి విజయవంతముగా పనిచేయకపోవచ్చు.వారి బెడ్ లో మీ పిల్లలకు మరింత సౌకర్యవంతమైన చేయటానికి ఏదైనా దిండు లేదా ఒక బొమ్మను ఉంచాలని గుర్తుంచుకోండి.


English summary

Tips For Bedtime Routines In Toddlers

A good sleep is very important for the right mental and physical health of your toddler. This increases the importance of proper bedtime for toddlers.
Story first published: Saturday, December 14, 2013, 7:34 [IST]
Desktop Bottom Promotion