For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలను కూర్చోబెట్టి బిజీగా ఉంచటానికి మార్గాలు

By Super
|

కొన్ని సమయాలలో మీ సొంత పిల్లవాడిని,మీ సోదరి కొడుకు అంటే మేనల్లుడుని మీ భార్య మరియు మీ సోదరి లేకుండా కూర్చోబెట్టి బిజీగా ఉంచవలసిన అవసరం వస్తుంది.సాదారణంగా పిల్లల తల్లి లేకుండా పిల్లల బాగోగులు చూడటం అనే విషయం చాలా కష్టమైనది. సాదారణంగా వారి మనస్సు చాలా అమాయకంగా ఉంటుంది. మీరు వారి దగ్గర లేకుండా వారిని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు.

వారు త్వరగా మీ మాట వినటానికి చాక్లెట్లు మరియు ఐస్ క్రీమ్ వంటి బహుమతులు సహాయపడతాయి. ఇటువంటి బహుమతులు తప్పనిసరిగా పిల్లల మీద ప్రభావం చూపుతాయి. వాటిని తీసుకోవటం వలన చాలా సేపటి వరకు భోజనానికి రారు. సాధారణంగా కొంత మంది పిల్లలు అధిక చురుకుగా ఉంటారు. వారు ఒక నిమిషం కూడా విరామం ఇవ్వకుండా ఏదో కొత్త వస్తువు కోసం పరుగులు తీస్తూ ఉంటారు. వారికి ఆసక్తికరమైన మరియు కొత్త విషయాల అవసరం ఉంది. వారికీ మీరు కీ బొమ్మ ఇవ్వండి. అప్పుడు వారు కొన్ని గంటలపాటు సమయాన్ని మర్చిపోయి కదలకుండా ఆడుకుంటారు.

మీ పిల్లవాడిని కోర్చోబెట్టి మీ పనులు చేసుకోవటానికి కొంత ముందు సన్నాహాలు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. వాటి కోసం PG రేటింగ్ DVD,పిల్లల గేమ్స్ కోసం PS3 / Xbox, కొన్ని క్యాండీలు,మీ స్మార్ట్ ఫోన్లో గేమ్స్ డౌన్లోడ్ మొదలైనవి సేకరించి ఉంచాలి. అంతేకాక సురక్షితంగా ఉండేలా చూడాలి. వారికీ పుస్తకాల మీద ఆసక్తి ఉంటే కనుక మీరు పిల్లలకు కథల పుస్తకాలను ఇవ్వవచ్చు.

పిల్లలను కోర్చోబెట్టి బిజీగా ఉంచటానికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి.

1. డ్రాయింగ్

1. డ్రాయింగ్

పిల్లలు బొమ్మలు గీయటం,కలరింగ్ మరియు పెయింట్ అంటే ఇష్టపడతారు. వారు ఈ పనిని సరదాగా చేస్తారు. అంతేకాక కంప్యుటర్ లో కొన్ని స్కెచ్లు డౌన్లోడ్ చేసి ప్రింట్స్ తీసి వాటితో పాటు కొన్ని క్రేయాన్స్ ఇస్తే కొన్ని గంటల పాటు విశ్రాంతిగా డ్రాయింగ్ వేసుకుంటారు.

2. హైడ్ అండ్ సీక్

2. హైడ్ అండ్ సీక్

పిల్లలు ఆటలు ఆడుకోవటానికి ఇష్టపడతారు. దీనిని ఒక సార్వత్రిక ఆటగా చెప్పవచ్చు. మీరు ఒకరికి కళ్ళు మూస్తే మిగతావారు దాక్కుంటారు. అప్పుడు వారిని కనిపెట్టాలి.

3. కార్టూన్లు

3. కార్టూన్లు

వారికి ఇష్టమైన కార్టూన్ ఛానెల్ ఎంపిక ఎప్పుడు ఉంటుంది. ఇతర విషయాలలో నియంత్రణ చేయటం కొరకు మీరు బయటకు వెళ్ళిన సమయంలో PG రేట్ కార్టూన్ సినిమాలను ప్లే చేయవచ్చు.

4. బిల్డింగ్ బ్లాక్స్

4. బిల్డింగ్ బ్లాక్స్

పిల్లలను కొంతసేపు ఆహ్లాదకరముగా ఉంచటానికి ఇది ఒక మార్గం అని చెప్పవచ్చు. పిల్లలకు LEGO బాక్స్ ఒకటి ఇచ్చి ఒక చాప మీద వాటితో కొన్ని క్రేజీ నిర్మాణాలు చేయమని చెప్పాలి.

5. పుస్తకాలు

5. పుస్తకాలు

పిల్లలు పుస్తకాలు చదవటం లేదా. అయితే మీరు వాటిని చదవడానికి ఆసక్తిని కలిగించాలి. రంగుల చిత్రాలు మరియు ఆసక్తికరమైన పిల్లల పుస్తకం కొనుగోలు చేసి వారికి ఆసక్తికరంగా కథను వివరిస్తే వారు నిశ్శబ్దంగా ఉంటారు.

6. పార్క్స్ మరియు ఆట స్థలాలు

6. పార్క్స్ మరియు ఆట స్థలాలు

మీ సమీపంలో ఒక పార్క్ కలిగి ఉంటే వీలు అయినంత సమయాన్ని అక్కడ గడపవచ్చు. పిల్లలు పార్క్ లేదా ఒక ప్లేగ్రౌండ్ లో పరుగు పెట్టటం,స్లయిడ్ మీద జారటం వంటి వాటిని ఇష్టపడతారు.

7. షూటింగ్

7. షూటింగ్

రెండు ఫోమ్ బుల్లెట్ తుపాకులను కొనుగోలు చేసి పిల్లలతో కొన్ని యుద్ధం గేమ్స్ ను ఆడించవచ్చు. పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అయితే ఈ ఫన్ గేమ్ తో సమయం గడిచిపోతుంది.

8. వీడియో గేమ్స్

8. వీడియో గేమ్స్

మీరు మీ మొబైల్ లో ఒక కూల్ కిడ్స్ గేమ్ డౌన్లోడ్ చేయండి. మీ కన్సోల్ లో ఒక సులభమైన పిల్లల ఆటను ప్రారంభించి పిల్లవాడితో వారికి ఇష్టమైన శైలితో ఆడించండి.

 9. పాత్ర పోషించుట

9. పాత్ర పోషించుట

ఒకవేళ అమ్మాయి అయితే ఒక పాత్ర చెప్పి అలా నటించమని చెప్పితే కొన్ని గంటల సమయం గడిచిపోతుంది. మీరు ఆమెకు ఒక బార్బీ ఇవ్వాటానికి ఎంచుకోవచ్చు. ఇది బాగా పనిచేస్తుంది.

10. పడుకొనే సమయం

10. పడుకొనే సమయం

పిల్లలు పడుకొనే సమయం ఎటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఒక కథ చదివి విన్పించండి. పిల్లలు పడుకోవటానికి ఉత్తమంగా ఉంటుంది. అంతేకాక వారికీ జ్ఞానం కూడా పెరుగుతుంది.

English summary

Ways to keep kids busy when babysitting

There will be times when you are made to baby sit your own kid when your wife is out for girl’s night out or your nephew when your sister makes an offer you just can’t say no to.
Story first published: Thursday, November 21, 2013, 19:06 [IST]
Desktop Bottom Promotion