For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు సంతోషంగా నిద్రపోవడానికి సహాజ చిట్కాలు

|

నేటి యాంత్రికయుగంలో, ప్రతి పనినీ టైముతో ముడిపెట్టి చేసే హడావుడి రోజుల్లో పిల్లలు రాత్రిపూట నిద్రపోకపోతే పెద్దలకు ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఇబ్బంది నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాల్సిందే...

1. ముందుగా పిల్లలు ఒక నిర్ణీతమైన సమయం ప్రకారం నిద్రపోయేలా సమయపాలన పాటించేలా చూడాలి. పిల్లలకు రాత్రిపూట ఫలాన సమయంలో నిద్రపోవాలనే భావనను అలవాటుగా మార్చాలి.

2. నిద్రకు సంబంధించిన వరస సంఘటనలను పిల్లల మదిలో నిక్షిప్తం చేయగలిగితే, రెండు, మూడు వారాల్లో కొత్త రొటీన్‌ కు అలవాటుపడతారు. ఉదాహరణకు: రాత్రిపూట ఏడింటికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, స్నానం చేసేప్పుడు నీళ్ల మీద తేలే బొమ్మలను ఆడుకోవడానికి ఇవ్వడం.

3 రంగురంగుల బొమ్మలు ప్రింట్‌ చేసిన నైట్‌ డ్రస్‌ను తొడగడం.

4. మంచి సుగంధ భరితమైన పౌడర్‌ను రాయడం, నిద్రకు ముందు మంచి కథను చెప్పడం, వీలైతే మంచి సంగీతాన్ని వినిపించడం. ఇవన్నీ పిల్లలు ఇష్టపడే అంశాలు. వీటిని రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే కొన్ని రోజులకు పిల్లల్లో ఈ విధానం సహజనిద్రను ప్రేరేపిస్తుంది.

5. పాప నిద్రిస్తున్నప్పుడు మీరు కూడా తనతో పాటే అక్కడే ఉండాలని భావిస్తున్నట్లయితే పాప నిద్రపోయే వరకూ మీరు అక్కడే ఉండాలి.

12 Tips for Helping Your Child Fall Asleep

6. నిద్రకు ఉపక్రమించిన పావుగంట తరువాత దుప్పటి సవరించడం వంటివి చేయవచ్చు. ఒకవేళ పాప ఏడిస్తే చూడనట్లు ఉండాలి తప్పితే ఎక్కువ ఆతృత కనపరచకూడదు.

7. పిల్లలు ఏడ్చినప్పుడు తల్లితండ్రులు అతిగా స్పందిస్తే, ఏడవడం ద్వారా దేనినైనా సాధించుకోవచ్చు ననే భావన పిల్లల్లో పెరిగిపోయి చీటికీమాటికీ ఏడుస్తారు.

8. తల్లితండ్రులు వారి అలవాట్లను పిల్లలకు ఆపాదించకూడదు. ఉదాహరణకు లైటు వెలుతురు వలన మీకు నిద్ర రాకపోతే పిల్లలకు కూడా రాదనుకోకూడదు.

9. నిజానికి లైట్లు ఉంటేనే చాలామంది పిల్లలు ధైర్యంగా నిద్రపోతారు. కొంతమంది పిల్లలు దుప్పటి కప్పితే సౌకర్యవంతంగా నిద్రపోతారు. మరికొంతమందికి సాఫ్ట్‌టాయ్ ను తోడుగా ఉంచుకుని నిద్రపోవడం అలవాటు. ఈ అలవాట్లను వ్యతిరేకించండి. వీటితో ఎవరికీ నష్టం ఉండదు.

10. అలాగే పై కప్పు మీద మెరిసే నక్షత్రాలను అతికించడం, గోడల మీద ఆసక్తి కలిగించే పోస్టర్లను అతికించడం వంటివి చేస్తే పిల్లలు వాటిని చూస్తూ నిద్రలోకి జారుకుంటారు.

11. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అసలు నిద్రపోరనీ, పెరిగే వయస్సులో నిద్రపోకపోతే ఎలా అనీ వాపోతుంటారు. అయితే పిల్లలకు ఎంత నిద్ర అవసరమైతే అంతే నిద్రపోతారు. నిద్ర ఎక్కువయిందా? తగ్గిందా? అనే విషయం గురించి పెద్దగా ఆందోళనపడకూడదు.

12. పిల్లలు ఇతరత్రా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. మనం మరీ పొద్దుపోయే వరకూ టివి మొదలైనవి చూస్తూ ఉంటే పిల్లలకూ అదే అలవాటవ్ఞతుంది. పిల్లలను పగటిపూట, ముఖ్యంగా సాయంత్రం పూట నిద్రపోనివ్వకూడదు. రాత్రి పడుకునే ముందు పాలు పట్టండి. నిద్రలో కలవరిస్తుంటే లేపడానికి ప్రయత్నించకండి.

English summary

12 Tips for Helping Your Child Fall Asleep


 There are no specific lists of baby sleep patterns. A baby can sleep in so many different postures and with so many different styles of sleeping. It is fun to watch how they sleep and what usually they do when going to bed. You can even find a mom complaining of baby sleep trouble. Baby sleep problem can occur over an extended period of time or it can be a temporary phase in the life of the child.
Story first published: Monday, June 30, 2014, 17:14 [IST]
Desktop Bottom Promotion