For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలపైనా లైంగిక వేధింపులు: పేరంటింగ్ టిప్స్

|

సహజంగా మనం మన పిల్లలలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం చెప్పండి? పువ్వులంత సున్నితంగా అంతేనా? మరి మనం కంటికి రెప్పలా చూసుకునే ఆ పిల్లలకు మనం లేనప్పుడు, మనింటి బయట కూడా అంతే ప్రేమ, భద్రత దొరుకుతున్నాయా?అంటే లేదనే చెప్పాలి. స్కూళ్లు, బస్సులు, పార్కులు, కొన్ని సార్లు మన ఇల్లే వాళ్ళపై వేధింపులకు నిలయాలుగా మారవచ్చు. దగ్గరి బందువులు, తెలిసిన వాళ్లు, స్కూల్లో పనిచేసేవాళ్లే ‘బూచాళ్లు'గా మారి పిల్లల ఆనందాన్ని హరించేయచ్చు. మరి ఏం చేయాలి? ఎప్పుడూ వాళ్లని మనతోనే ఉంచుకోగలమా?లేదు..వాళ్ళకు సంతోషకరమైన భవిష్యత్తును అందించాలంటే, వాళ్లకు ఎవరితో ఎలా మెలగాలో ఎలాంటి సందర్భంలో ఎలా స్పందించాలో వివరించాలి. అప్పుడే ఇంటాబయటా పొంచి ఉన్న ప్రమాధాల బారి నుంచి వాళ్లను రక్షించుకోగలుగుతాం...

స్కూల్లో....ప్లే గ్రౌండ్ లో: పిల్లలు ఎక్కువ సమయం గడిపేది స్కూల్లోనే...అక్కడ టీచర్లు, ఆయాలు, మిగిలిన ఇతర సిబ్బందితో వాళ్ళ అనుబంధం పెంచుకుంటారు. వారి వల్ల వందకు 99శాతం సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ పిల్లలతో ఉన్న చనువును అడ్డం పెట్టుకొని వాళ్ళపై లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకు ఒక ఉదాహరణ గత వారం బెంగుళూర్ లో ఒక స్కూల్లో జరిగిన సంఘటనే....కాబట్టి కార్పొరెల్ పనిష్మెంట్ లతో పాటు లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్న సందర్భంలో స్కూలు వాతావరణం ఎలా ఉందని గమనించడం తప్పనిసరి. మంచి స్కూల్లో చేర్పించేశాం అని అనుకోవడం పూర్తిగా సరికాదు. ఎంత మంచి పేరున్న స్కూలైనా తరచూ మీ పిల్లల క్లాస్ టీచర్ తో మాట్లాడుతుండాలి. పిల్లల చదువు గురించే కాకుండా వాళ్ల ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలి. తల్లిదండ్రులు టీచర్స్ మీటింగ్స్ కు తప్పకుండా హాజరవ్వాలి. అలాగే పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని తప్పకుండా వినాలి. వాళ్ళు చెప్పే విషయాలను పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఏదైనా చిన్న సమస్య గురించి చెప్పినా కొట్టిపడేయకుండా దాన్నుంచి ఎలా బయటపడాలో వాళ్లకు వివరించండి. ఇప్పుడిప్పుడే కొన్ని స్కూళ్లు మానసిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నాయి. అవసరాన్ని బట్టి వాళ్ళ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. స్కూల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటి వల్ల అదనపు భద్రత ఉంటుందని మీరు భావిస్తే పిల్లలను అటాంటి స్కూళ్లలోనే చేర్చొచ్చు.

స్కూల్లో టాయిలెట్ల దగ్గర పిల్లలు అవహేళకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లెంత చిన్న పిల్లలైనా సరే..తమను చూసి ఎదుటివాళ్లు నవ్వడం, లేదా వెక్కిరించడం చేస్తే చాలా బాధపడతారు. ఈ విషయాలను కొందరు బయటకు చెబితే మరికొందరు చెప్పుకోవడానికి భయపడుతారు. అందుకే పిల్లలు వయస్సు, వాళ్లు అర్ధం చేసుకునే తీరును బట్టి టాయిలెట్ కి వెళ్లినప్పుడు లోపలి నుండి గడియ పెట్టుకోవాలా? లేదా అన్నది వివరించి చెప్పాలి. మరీ చిన్నపిల్లలైతే బయట ఒకరిని తోడుగా నుంచోమని చెప్పాలి. కొత్తవారిని లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి.

6-12 School Age Children Development & Parenting Tips

ఆడపిల్లలు అనుకోకుండా వచ్చే నెలసరితో ఏం చేయాలో తెలియక బిత్తరపోతారు. ఈ కారణంగా స్కూల్లో కొన్ని సార్లు అటపట్టింపులకు వ్యాఖ్యాలకు కూడా గురిఅవుతారు. ఇలాంటి సందర్భాల గురించి పిల్లలకు ముందుగానే వివరించాలి. అలాంటి పరిస్థితుల్లో టీచర్లతో విషయం చెప్పమనాలి. ముందు జాగ్రత్తగా బ్యాగ్ లో శానిటరీ న్యాప్ కిన్ ను ఉంచాలి. ఒక వేళ న్యాప్ కిన్ లేకపోయినా, స్నేహితురాలి సహాయంతో పర్మిషన్ తీసుకొని దగ్గర్లోని బందువుల ఇంటికో, మీ ఇంటికో రమ్మని చెప్పాలి. ఇవేవీ కుదరని పక్షంలో స్కూల్ నుంచి మీకు ఫోన్ చేయిస్తే వెంటనే వచ్చి తీసుకెళ్తామన్నభరోసా వాళ్లకు కలిగించాలి.

ఒత్తిళ్లన్నీ మర్చిపోయి పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే ప్రదేశం ప్లే గ్రౌండ్. కలిసి చదువుకునే వాళ్లతో ఆడుకోవడమే కాదు..కొత్త వాళ్లతో పరిచయాలు కావడానికి ఇక్కడే ఆస్కారం ఉంటుంది. అయితే ఆటవస్తువులు ఉంచే లేదా దుస్తులు మార్చుకునే గదులు దూరంగా జనసంచారం లేకుండా ఉంటాయి. కాబట్టి వాటిలోకి ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని పిల్లలకు సూచించాలి. తమ స్నేహితులతో కలిసి వెళ్లడాన్ని ప్రోత్సహించాలి. కొన్ని సార్లు ఆటలాడేటప్పుడు పిల్లల షర్ట్, స్కర్ట్ చిరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాళ్ల అవమానానికి గురి కాకుండా ఉండటం కోసం స్కూల్ లాకర్ లో మరో అదనపు యూనిఫాం ఉంచాలి. ఈ సౌకర్యాన్ని ఇప్పటికే చాలా స్కూళ్ళు అమలు చేస్తున్నాయి. ఒక వేళ మీ పిల్లల స్కూల్లో లాకర్ సదుపాయం లేకపోతే పేరెంట్, టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఈ సదుపాయం కోసం అడగొచ్చు.

ఇంట్లోనూ అప్రమత్తంగానే ఉండాలి: చిన్నారులపై జరిగే అత్యాచారాల్లో 60శాతం ఆ కుటుంబానికి బాగా తెలిసున్న వ్యక్తుల కారణంగానే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. బందువులు, స్నేహితులు, పిల్లలు ప్రేమగా ‘అంకుల్' అని పిలిచే వాళ్లే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మానాన్నలు ఇంట్లో లేనప్పుడో, ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లినప్పుడో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.

బందువులైనా, దగ్గరి స్నేహితులైనా, టీచర్లైనా ఇంకెవరైనా వ్యక్తిగత భాగాలను తడమడం, హత్తుకోవడం, దగ్గరకు తీసుకోవడం లాంటివి చేసినప్పుడు, ఆ స్పర్శ అసహజంగా అనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వచ్చేయమని పిల్లలకు వివరించాలి. వాళ్లు ఎంత కావాల్సిన వాళ్లైనా మొహమాట పడకుండా విషయాన్ని మీకు చెప్పమని చెప్పాలి. అలాంటి సందర్భాల్లో ‘అతను అలాంటి వాడు కాదు' అంటూ కొట్టిపడేయకుండా వాళ్లు చెప్పిన దాండ్లో ఎంత మేరకు నిజముందో కనుక్కునే ప్రయత్నం చేయాలి.

English summary

6-12 School Age Children Development & Parenting Tips


 Parents need to make it a point to know their neighbors, their children's friends, as well as those children's parents. Police also say that children should be encouraged to trust their own instincts. If something about a person does not look or feel right, the child needs to get away from that person as quickly as possible. Parents, too, need to learn to trust a child's instincts, and believe their child if he says that he feels threatened by someone
Story first published: Tuesday, July 22, 2014, 17:43 [IST]
Desktop Bottom Promotion