For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పిల్లలను కాపాడుకోవడం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

నవంబర్.. డిసెంబర్ మొదలైందంటే చాలు. చలి..చలి.. వాతావరణంలోని మార్పులతో పాటు శరీరంలో అనేక మార్పులకు చేటుచేసుకుంటుంది. అయితే ఇది ఈ మార్పులు పెద్దలకు మాత్రమే కాదు .. పిల్లల పట్లకూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలకు సంబంధించి పెద్దలకున్న అనేక సమస్యల్లో అసలు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లల్ని ‘స్కూలుకి టైమ్ అవుతోందంటూ తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు, చలికాలంలో పిల్లలకు మరెన్నో సమస్యలు. వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

పిల్లలకు కాలాలతో పనిలేదు. కాలం ఏదైనా వారి ఆటలు, వారి ఐస్‌క్రీంలు, వారి చాక్లెట్లు, వారి కూల్‌డ్రింకులు వారివే. కాబట్టి తల్లిదండ్రులే ఈ విషయాలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొనే ముందు అసలు చలికాలంలోనే పిల్లలకు ఈ ఇబ్బందులు ఎందుకొస్తాయనే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం చాలా అవసరం. చలికాలంలో పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది: చలికాలంలో పిల్లల శరీరతత్వంలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం...

How To Care For Your Kids In Winter?

1. చలికాలం తీవ్రమైన చలితో పాటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాల్ని కూడా వెంట మోసుకొస్తుంది. పిల్లల విషయంలోనైతే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. స్వెట్టర్లు, క్యాప్ లు సరిగ్గా ధరించకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. కాబట్టి ఇంట్లోఉన్నా, బయటికి వెళ్లిన పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మాత్రం మరిచిపోకూడదు.

2. అసలే తీవ్రమైన చలి అంటే...కొందరు వాళ్ళ పిల్లలకు అడిగిన వెంటనే ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్స్ వంటివి కొనిచ్చేస్తుంటారు. ఇవి తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం చలికాలం అయిపోయేంత వరకైనా పిల్లల్ని వీటి జోలికి పోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

3. స్కూలుకు వెళ్ళే పిల్లలకు యూనిఫాంతో పాటు స్వెట్టర్, తలను కప్పి ఉండేలా క్యాప్ లాంటివి కూడా వేసి పంపించాలి. అప్పుడే చలి నుంచి వాళ్ల శరీరానికి రక్షణ దొరుకుతుంది.

4. ఒక్కోసారి పెద్దలే చలికి తట్టుకోలేకపోతారు. ఇక చిన్న పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది?అందుకే చలికాలంలో పిల్లల బట్టల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటమో...అలాగే పాదరక్షల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చలికి పాదాలు పకగలకుండా సాక్సులు, బూట్లు లాంటివి వేయాలి.

5. పిల్లలకు సూప్స్, స్నాక్స్, భోజనం...ఇలా అన్నీ ఇంట్లోనే వేడి వేడిగా వండిపెట్టాలి. సాధ్యమైనంత వరకూ బయటి ఆహారం తినకుండా పిల్లల్ని అదుపు చేయాలి. చాలి నుంచి రక్షించుకోవడానికి పిల్లలకు పెట్టే ఆహారమూ ముఖ్యమే. అందుకే ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

6. ఫ్లూ రాకుండా ఉండేందుకు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే క్యారెట్లు, లైకోపిన్ ఉండే టమోటో, క్యాప్సికం, లాంటి వాటితో కూరలు లేదా సూప్స్ చేసి పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు పిల్లలకు అంది ఆరోగ్యంగా ఉంటారు. అందుకు అవసరం అయ్యే వ్యాధినిరోధక శక్తి అందించే గుణగణాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి.

7. ఈ సీజన్ లో వేధించే మరో సమస్య చర్మం పొడిబారడం, చల్లగా వీచే గాలులు వల్ల శరీరంలోని తేమ శాతం తగ్గిపోయి చర్మం పొడిబారేలా చేస్తాయి. దీని వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందులోనూ సుకుమారంగా ఉండే పిల్లల చర్మం మీద చలి ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్య నుంచి పిల్లల లేత చర్మాన్ని సంరక్షించుకోవాలంటే రోజూ మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి రాయడం మర్చిపోవద్దు.

8. చలికి స్నానం చేయాలంటే పెద్దవారే బద్దకించేస్తుంటారు. ిక చిన్న పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. కాబట్టి పిల్లలకు ఉదయం పూట స్నానం చేయించి..సాయంత్రం కాళ్లు, చేతులు శుభ్రంగా కడగాలి. లేదంటే చర్మంపై పడిన దుమ్మ ధూళి అలాగే ఉండిపోయి నిర్జీవంగా మారిపోతుంది. శుభ్రం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.

9. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య కేవలం వేసవిలో వస్తుందనుకుంటే పొరపాటే, చలికాలంలో కూడా ఎదురవుతుంది. కాబట్టి పిల్లల్ని డీహైడ్రేషన్ కు గురికాకుండా చూడాలి. ఇందుకోసం వాళ్లకు విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ, నిమ్మ పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. అలాగే పిల్లలు ఎనిమిది గ్లాసుల నీటిని తాగేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోయి తద్వార ఆరోగ్యంగా ఉండవచ్చు. చూశారు కదా చలికాలంలో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో...! మరి మీ పిల్లల విషయంలో కూడా ఇవన్నీ పాటిస్తారు కదూ!

English summary

How To Care For Your Kids In Winter?

Those cute little feet need to be warm always in the cold season. As winter is zooming, let's give you a few tips on baby winter clothes. Take a look. As a parent, you would always want to protect your tiny ones the best way. Specially during cold weathers, which is why we have a few simple tips
Story first published: Friday, November 21, 2014, 17:33 [IST]
Desktop Bottom Promotion