For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళుతున్నారా?

By Super
|

ఒక రోజు పాఠశాల నుండి తిరిగి వొచ్చిన ఏడు సంవత్సరాల కొడుకు పనికిమాలిన మాటలు మాట్లాడటం విన్న పఖి జైన్ షాక్ కి గురయ్యింది.. "ఇటువంటి మాటలు ఎవరు నేర్పుతున్నారు? అని అడిగినప్పుడు, అతను తన స్కూల్ బస్సు లో ప్రతి ఒక్కరూ మాట్లాడతారని చెప్పాడు మరియు తను సీనియర్లలాగానే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు" అని జైన్ చెప్పారు. "ఆ సమయంలో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు" అని జైన్ చెప్పారు.

ఆమె మాత్రమే కాదు. అధిక సంఖ్యలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం తరగతిగదిలో,నాలుగు గోడల లోపల మాత్రమె క్రమశిక్షణ అవసరం అనుకుంటారు, ఈ నియమాలు ఏవి కూడా పాఠశాల బస్సులకు వర్తింపచేయారు. ఇటీవలి కాలంలో, పిల్లలు బస్సుల్లో చేసే పోకిరీ ప్రవర్తన వల్ల ఒకరినొకరు కొట్టుకున్న కేసులు అనేకం ఉన్నాయి.

ఎప్పుడు మీ పిల్లవాడు రౌడిగ మారతాడు

 Is your kid travelling to school safely?

మీరు మీ పిల్లవాడు స్కూల్ బస్సులో మిగతావారినుండి చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడని అనుకుంటున్నారా? మీ బాబుకు క్రమశిక్షణ గురించి చెప్పండి మరియు ఇటువంటి పనికిరాని భాష మాట్లాడటం మంచిది కాదు అని వివరించండి. సీనియర్స్ లాగా ప్రవర్తించటంలో గొప్పతనమేమి ఉండదు అని అర్థం అయ్యేలా చెప్పండి మరియు వారి లాగా తప్పు పనులు చేయడంలో ఏ గొప్పతనం ఉండదు అని చెప్పండి. " పిల్లల బస్సులో ఎవరో ఒకరు పోట్లాడుతుండటం, అది తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు, వారు డ్రైవర్ లేదా పాఠశాల అధికారులతో పోట్లాడటం జరుగుతుంటుంది. కాని ఇటువంటి తప్పు ఉదాహరణలతో పరిస్థితులను అదుపులోకి తేవటం సరిఅయిన పధ్ధతి కాదు." అని సానని చెప్పారు.

దీనికి బదులుగా, రెండువైపులా సంభాషణను తెలుసుకోండి మరియు మీరు మీ పిల్లవాడిది తప్పు అని భావిస్తే, ఆందోళనతో కాకుండా కొద్దిగా కఠినంగా వ్యవహరించాలి. "మరొక వ్యక్తిని బెదిరించటం అన్నది తప్పు అని అర్థం అయ్యేలా మీ పిల్లలకు తెలియచేయండి. సహజంగా, పిల్లలు వేధింపుల వంటి సందర్భాల్లో విషయాలను తల్లితండ్రులకు తెలియనివ్వరు. కాబట్టి, వారికి ఇటువంటి సంఘటనలు,సందర్భాలు తల్లితండ్రులకు తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని లేదా ఉపాధ్యాయులకు కాని లేదా బస్ సూపర్వైజర్ కు కాని తెలియచేయాలని చెప్పండి.," అని డాక్టర్ సోనార్ చెప్పారు .

పాఠశాల యాజమాన్యాల పాత్ర

బస్సుల్లో భద్రత మరియు క్రమశిక్షణ అన్న ఆలోచనతో పాఠశాల యాజమాన్యాలు ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.. కొన్నినగరపాఠశాలలు మాత్రమే ప్రతి బస్సులో విద్యార్థి మానిటర్లను నియమించారు - వారు బస్సులో క్రమశిక్షణ నిర్వహించడానికి మాత్రమే కాదు, బస్సు సిబ్బందిపై ఒక కన్ను ఉంచడానికి కూడా, కొన్ని వాహనాల లో CCTV కెమెరాలను కూడా అమర్చాలన్న ఆలోచనను కలిగి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , చండివలి వద్ద ఒక అంతర్జాతీయ పాఠశాలలో పిల్లలు, తమ ఐ-కార్డును బస్సుకు కొట్టటం వంటివి కూడా ఒక టెక్స్ట్ సందేశం ద్వారా పంపబడుతుంది.

చాలా పాఠశాలలు RTA (రహదారులు, రవాణా అథారిటీ) జారీ చేసిన గైడ్ లైన్స్ అనుసరించడానికి ఒక లేడీ అటెండెంట్ ను నియమించుకున్నయి. "బస్సుల్లో శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉండటం చాలా ముఖ్యం. పెద్దపిల్లలు మరియు చిన్న పిల్లలు కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, అటెండెంట్ పెద్దపిల్లలు వెనుకభాగాన కూర్చునేట్లుగా మరియు చిన్నపిల్లలు ముందుభాగాన కూర్చునేట్లుగా నిర్ధారించుకోవాలి. మరియు ముందుభాగం మరియు చివరిభాగం మధ్యలో కొంతభాగం వదిలివేయాలి." అని సానని చెప్పారు.

పాఠశాల అధికారులు చేపట్టవలాసిన చర్యలు

- తరగతులలో పాఠశాల బస్సు భద్రత గురించి సూచనలు అందించటం .

- సరిఅయిన సమయంలో విద్యార్థులను పంపంటం, అందువలన వారు బస్సులు పట్టుకోవడానికి పురుగేత్తనవసరం లేదు,

- సాంకేతిక అంతరాయాలు లేకుండా బస్సులను పరీక్షించాలి మరియు భద్రతగా ఉన్నదని నిర్ధారించుకోండి .

- బస్సులో తగినంత సిబ్బంది ఉన్నారని నిర్ధారించుకోండి మరియు ఒక మహిళ అటెండెంట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేట్లుగా చూసుకోవటం

- పిల్లలు ప్రవర్తన పర్యవేక్షణ కోసం బస్సుల్లో CCTVs అమర్చటం

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

- బస్సులను ఏ ఏజెన్సీ నుండి అద్దెకు తీసుకున్నారో, దాని గురించి తెలుసుకోండి

- పాఠశాల బస్సు కోసం వేచిఉండటం ఎలా మరియు ఎక్కడం ఎలా మరియు భద్రత యొక్క ప్రాముఖ్యతను మీ పిల్లలకు నేర్పండి.

English summary

Is your kid travelling to school safely?

Pakhi Jain was in for a shock when she heard her seven-year old return from school one day and mouth expletives. "When asked who taught such words, he said everyone in his school bus used them and he was following suit because he wants to be like his seniors," says Jain, who didn't know how to deal with the situation at that time.
Story first published: Friday, September 12, 2014, 16:32 [IST]
Desktop Bottom Promotion