For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో వేలు చీకే అలవాటును మన్పించటానికి అద్భుతమైన పరిష్కారం

By Super
|

పిల్లలు పెరుగుతున్నప్పుడు బొటనవేలు చీకే అలవాటు మానటం సాధ్యం కాకపోవచ్చు. ఈ అలవాటు కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది. ఈ అలవాటు వెంటనే పోతుందని మేము ఆశించటం లేదు. కానీ,ఇక్కడ మీకు సహాయపడటానికి ఉపయోగపడే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.

1. పిల్లల దృష్టి
ఇది బొటనవేలు చీకే అలవాటును ఆపడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు చేయవలసిందల్లా పిల్లల రెండు చేతులను ఉపయోగించి చేసే పనులను వారికీ అప్పగించాలి. అప్పుడు మీరు బొటనవేలు వారు నోటిలో పెట్టకపోవటం గమనించవచ్చు. ఒక మృదువైన బొమ్మను కౌగలించుకోవడం,పుస్తకం చదవటం, PSP లో ఆటలను ఆడించటం వంటివి చేయించాలి.

Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

2. బొటనవేలు చుట్టూ చుట్టటం
బొటనవేలు చుట్టూ బ్యాండ్ ఎయిడ్ లేదా టేప్ తో చుట్టాలి. లేకపోతే బొటనవేలికి తోలుబొమ్మ చేతితొడుగును తొడగాలి. పడుకొనే సమయంలో బొటనవేలు చీకుతూ ఉంటే సాక్స్ ను ఉపయోగించవచ్చు.
Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

3. కాలపరిమితి పెట్టటానికి ప్రయత్నించండి
మీ పిల్లలకు దీని గురించి వివరంగా చెప్పండి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే బొటనవేలు నోటిలో పెట్టుకోవచ్చని చెప్పండి. లేకపోతే పిల్లలు నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పగటి సమయంలో పెట్టకుండా చూడండి.
Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

4. బొటనవేలికి నిమ్మరసం రాయండి
పిల్లలకు నిమ్మరసం రుచి నచ్చదు. అందువల్ల పిల్లల బొటనవేలికి నిమ్మరసం రాయండి. మీరు ఈ పరిష్కారాన్ని పునరావృతం చేయవచ్చు. ఇది కెమికల్ ఆధారిత నెయిల్ పెయింట్ కంటే ఎంతో శ్రేయస్కరం అని చెప్పవచ్చు.
Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

5. ఒక బొటనవేలి గార్డ్ ఉపయోగించండి
బొటనవేలును బిగించటానికి ప్లాస్టిక్ మోల్డ్ ఉంటుంది. బొటనవేలు చీకటాన్ని ఇది చాలా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. కానీ దీనిని బలవంతంగా ఉపయోగిస్తే మీ పిల్లల మనస్సు మీద ప్రభావం చూపవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.
Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

English summary

Wonderful Remedies To Stop Thumb Sucking Habits In Children

For grown up kids and grown-ups, leaving thumb sucking instantly may not be possible. It is a habit developed over years. We cannot expect it to vanish in a while. But, here are some remedies that may be of help to you:
Story first published: Wednesday, October 29, 2014, 18:05 [IST]
Desktop Bottom Promotion