For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పిల్లల్లో ఇమ్యూనిటి పవర్ పంచే హెల్తీ ఫుడ్స్

By Super
|

సీజన్ బట్టి, మన శరీరంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. సీజన్ బట్టే మనం శరీరంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలను తీసుకోవల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధినిరోధకత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా త్వరగా జబ్బున పడుతుంటారు. ముఖ్యంగా వార్షాకాలంలో మరింత వేగంగా జబ్బులు చుట్టుముడుతుంటాయి. వర్షాకాలంలో పిల్లల్లో ఇమ్యూనిటి పెంచాలన్నా, ఇన్ఫెక్షన్ల బారీ నుండి తప్పించుకోవాలన్నా వారికి మూన్ సూన్ ఫుడ్స్ ను అందివ్వడమే. అంటే వారిలో రోగనిరధక శక్తి పెంచే ఆహారాలు అందివ్వడం చాలా అవసరం.

వర్షాకాలంలో చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ ను అటాక్ అవుతుంటాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో అంతర్గతంగా స్ట్రాంగ్ గా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు .

READ MORE: పిల్లలజ్ఞాపకశక్తి, బ్రెయిన్ డెవలప్మెంట్ కు టాప్15 ఫుడ్స్

మనం రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ డైట్ కంటే మాన్ సూన్ ఫుడ్స్ కు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండవు. కానీ, వర్షకాలంలో కొద్దిగా ఎక్కువ, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎప్పుడూ హోం మేడ్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏలాంటి జబ్బులు ధరించేరకుండా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తీసుకొనే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది.

అంతే కాకుండా, వెనిగర్ మిక్స్ చేసిన నీటిలో పండ్లు మరియు వెజిటేబుల్స్ ను కొద్ది సయం నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మక్రిములు తొలగిపోయి, క్లీన్ గా ఉంటాయి. మరియు వర్షాకాలంలో పిల్లలకు అందివ్వాల్సిన మాన్ సూన్ ఫుడ్స్ ఏంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం....

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో అత్యవసరం అయిన ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు పూర్తిగా పోషకాహారం. పిల్లలకు ప్రతి రోజూ ఒక గుడ్డును అందివ్వడం ద్వారా పిల్లలకు అవసరం అయ్యే విటమిన్స్ , మినిరల్స్, మరియు ప్రోటీనులు పుష్కలంగా అంది, దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం పొందుతారు. అంతే కాదు వర్షాకాలంలో గుడ్లు తినడం వల్ల పిల్లల శరీరం కొద్దిగా వెచ్చగా ఉంటుంది.

ఫ్రెష్ ఫ్రూట్స్:

ఫ్రెష్ ఫ్రూట్స్:

వర్షాకాలంలో దాదాపు అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే, వాటిలో సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సీజనల్ గా మనకు అందుబాటులో ఉండే ప్రతి పండులోనూ వ్యాధినిరోధక శక్తులు పుష్కలంగా ఉండి, ఆయా సీజన్లలో వచ్చే జబ్బుల నుండి మన శరీరాన్ని కాపాడుతాయి. మరియు పిల్లలకు కూడా ఫ్రూట్ జ్యూసులకు బదులుగా నేరుగా పండ్లను తినడానికి అలవాటు చేయండి .

బాదం:

బాదం:

మంచి కంటి చూపుకోసం, చర్మం కాంతివంతం మరియు హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ కోసం ప్రతి రోజూ రెండు బాదంలను అందివ్వాలి. బాదంను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి, తర్వత రోజు ఉదయం పొట్టు తీసి అందివ్వాలి. అలాగే నీటిలో నానెబట్టిన బాదంను పేస్ట్ లా చేసి పాలలో మిక్స్ చేసి పిల్లలకు అందివ్వొచ్చు.

కేసర్ మిల్క్ :

కేసర్ మిల్క్ :

కేసర్ లేదా కుంకుమపువ్వు మొక్కలో ఉండే కెమికల్స్ లో వ్యాధులను నివారించే శక్తి చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్లు కనుగొనబడినది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఇక సహాయకారి ఫుడ్ గా ఉంది. పాలతో మిక్స్ చేసి, పిల్లలకు అందివ్వాలి.

సూప్స్:

సూప్స్:

వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే, సూప్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. మరియు పాస్తా సూప్ ఒక కంప్లీట్ మీల్ గా సహాయపడుతుంది . పిల్లలకు సూప్స్ ఎల్లప్పుడూ ఒక హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు.

హేర్బల్ టీ:

హేర్బల్ టీ:

సహజంగా హేర్బల్ టీని పెద్దలు ఎక్కువగా తీసుకుంటుంటారు , కానీ పిల్లలకు అందివ్వాల్సిన సమయం కూడా...వర్షకాలంలో పిల్లలకు హేర్బల్ టీ అందివ్వడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిది . హేర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధులతో మరియు క్రిములతో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

అల్లం:

అల్లం:

వర్షకాలంలో పిల్లల్లో వ్యాధినిరోధకత శక్తి తగ్గిపోతుంది మరియు చాలా తర్వగా స్టొమక్ ఇన్ఫెక్షన్స్ సంక్రమిస్తాయి. ఇలాంటి సమయంలో అల్లంతో చేసిన ఆహారాలు, జింజర్ టీ త్రాగడం వల్ల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు మరియు పొట్ట సమస్యలు దూరం అవుతాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వర్షకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, వారికి ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలను అందివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు లేదా వెల్లుల్లి పేస్ట్ ను రెగ్యులర్ డైట్లో చేర్చాలి .

స్పైసీస్:

స్పైసీస్:

మన ఇండియన్ మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి . అందుకే వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వంటలకు మంచి రుచి, ఫ్లేవర్ తో ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే మసాలను రెగ్యులర్ వంటల్లో చేర్చడం వల్ల వర్షాకాలంలో పిల్లల్లో కూడా వ్యాధినిరోదక వక్తిని పెంచవచ్చు. అందుకు పసుపు, ధనియాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి.

పప్పులు:

పప్పులు:

ధాన్యాలు, శరీరానికి చాలా అవసరం అయినటువంటి పౌష్టికాహారం, శరీరంలో కణాల అభివ్రుద్దికి మరియు డ్యామేజ్ అయిన కణాల మర్మత్తుకోంస ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. వర్షాకాలంలో వ్యాధుల నుండి ఉపశమనం పొందాలంటే ఇవి చాలా అవసరం . వీటిని ఉడికించి లేదా మొలకలు రూపంలో తీసుకోవడం చాలా అవసరం.

English summary

10 Best Monsoon Foods For Kids: Pregnancy Article in Telugu

10 Best Monsoon Foods For Kids: Pregnancy Article in Telugu, One easy way to take care of your kids during the rainy season is to plan monsoon foods for them. By monsoon foods, we mean healthy foods for kids. We all know that during monsoon, the body is more susceptible to catch an infection. Every care has
Story first published: Friday, November 13, 2015, 13:31 [IST]
Desktop Bottom Promotion