For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరీక్షల్లో మీ పిల్లలు టాప్ స్కోర్ పొందాలంటే బెస్ట్ డైట్ టిప్స్

By Super
|

పిల్లలు పరీక్షల సమయంలో అత్యంత నిర్లక్ష్యం చేసే అంశాలలో ఆహరం ఒకటి. పిల్లలు సాధారణంగా ఆరోగ్యకర ఆహరం మానేసి, జంక్ ఫుడ్ తినడం, పరీక్షల సమయంలో ఎక్కువసేపు మేల్కొని ఉండడానికి ఎక్కువ కాఫీని త్రాగడం గమనించబడింది. మీరు మీ పిల్లల పరీక్షల సమయానికి ముందే ఆహార ప్రణాళిక చేసుకోండి, వారితో చర్చించండి, మీరు ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి! మేము ప్రయత్నించి, పరీక్షించిన మీకు సహాయపడే 10 చిట్కాల జాబితాను ప్రయత్నించండి.

1. అధికమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభించండి:

1. అధికమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభించండి:

స్థిరమైన గ్లూకోస్ ని అందించే తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ తో ఉండే ఓట్స్, ముసేలి, ఉప్మా, ఖిచిడి, ఇడ్లి మొదలైన వాటిని ఎంచుకోవడం మంచిది.

2. కొద్ది ఆహరం, తరచుగా తీసుకోండి:

2. కొద్ది ఆహరం, తరచుగా తీసుకోండి:

కొద్దిపాటి, తరచుగా, పౌష్ఠిక ఆహరం చదువుకు ఆటంకం లేకుండా కొనసాగడానికి ఎంతో చలాకీగా, మేల్కొని ఉండేట్లు చేస్తుంది. తాజా పండ్లు/పండ్ల స్మూతీలు/డ్రై ఫ్రూట్స్/తేనె కలిపిన గింజలు/సూపులు/ఆశక్తికర సలాడ్లు మొదలైనవి మంచి ఎంపిక.

3. మీ ఆహారంలో ప్రోటీన్లను కూడా జతచేయండి:

3. మీ ఆహారంలో ప్రోటీన్లను కూడా జతచేయండి:

పిండిపదార్ధాలు త్వరగా జీర్ణమౌతాయి, అదేసమయంలో ప్రోటీన్లు నిదానంగా తగ్గి మనకెంతో అవసరమైన శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ (గుడ్లు, పోహా, ఇడ్లీలు, దోసె, దోక్లా, మొదలైనవి) రక్తంలో, బ్రెయిన్ లో టైరోసిన్ (అమైనో యాసిడ్) స్థాయిలను మెరుగుపరిచి, మీ పిల్లలను చురుకుగా, తాజాగా ఉంచే రసాయనాల తయారీకి ఉపయోగపడే నరాల కణాలకు సహాయం చేస్తాయి.

4. ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచండి:

4. ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచండి:

పిల్లలు వారి గదిలో సౌకర్యవంతంగా కూర్చున్నపుడు, బహుశ AC వేసుంటే, వారికి దప్పిక వేయదు, అందువల్ల వారు ఎక్కువ నీరు తీసుకోరు. డి-హైడ్రేట్ అయినపుడు, శరీరం, మెదడు మొద్దుబారి, చికాకుగా ఉంటుంది. దీనివల్ల చదువుపై దృష్టిని కేంద్రీకరించలేరు. వాళ్ళు ఎక్కువ నీరు తాగడానికి ఇష్టపడకపోతే, తాజా పండ్ల రసాలను/చాస్ లేదా మజ్జిగ/నిమ్మకాయ నీళ్ళు లేదా నిమ్మ రసం/గ్రీన్ టీ ఇవ్వండి.

5. కెఫీన్ ఎక్కువ తీసుకోకండి:

5. కెఫీన్ ఎక్కువ తీసుకోకండి:

పరీక్షల సమయంలో మీ పిల్లలు కాఫీ/ఎనర్జీ డ్రింక్ లు/టీ/కోలాలు ఎక్కువ తీసుకుంటే రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడి వారు కోరుకున్న సరైన నిద్రను పొందలేరు.

6. ఎక్కువ పంచదార, ప్రాసెస్ చేసిన పదార్ధాలను మానేయండి:

6. ఎక్కువ పంచదార, ప్రాసెస్ చేసిన పదార్ధాలను మానేయండి:

చాకొలేట్, కుకీస్ వంటి పదార్ధాలు రక్తంలోని చక్కర స్థాయిలను అకస్మాత్తుగా విరగ్గోడతాయి. కొద్దికాలం తరువాత, పొట్ట ఖాళీగా ఉన్నదని అనిపించినపుడు, అలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.

7. ఒత్తిడి తగ్గించే ఆహారాన్ని తీసుకునేట్లు చేయాలి:

7. ఒత్తిడి తగ్గించే ఆహారాన్ని తీసుకునేట్లు చేయాలి:

పరీక్షల సమయంలో ఒత్తిడిగా ఉన్నపుడు, శరీరానికి జింక్ వంటి మినరల్స్, విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C వంటి నీటిలో కరిగే విటమిన్లు కొన్ని అవసరమౌతాయి. ఇవి సిన్తేసిస్, ఒత్తిడిపై పోరాడే అడ్రినల్ హార్మోన్ల పనితీరుకు సహాయపడతాయి. బ్రౌన్ రైస్, గింజలు, గుండ్లు, తాజా కూరగాయలు, పండ్లు సహాయపడతాయి.

8. మీ మెదడుకు సామర్ధ్యాన్ని పెంచే ఆహరం తీసుకోండి:

8. మీ మెదడుకు సామర్ధ్యాన్ని పెంచే ఆహరం తీసుకోండి:

మెదడు కణాలను దెబ్బతీసే విటమిన్ A,C,E వంటి యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ పై ఒత్తిడి పెంచుతాయి. ఈ అవసరాన్ని తీర్చేందుకు గుడ్లు, చేపలు, కారెట్లు, గుమ్మడికాయ, ఆకుకూరలు, తాజా పండ్లు సహాయపడతాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడి, పరీక్షల సమయంలో పిల్లలు రోగం బారిన పడకుండా కాపాడతాయి.

9. జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి:

9. జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి:

చేపలో ప్రధానంగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితనాన్ని, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మీరు కనీసం వారానికి రెండు సార్లు సాల్మేన్ ని తినమని సూచన. మీరు చేపలు తినకపోతే, మంచి చేపలు అందుబాటులో లేకపోతే, మీ ఆహారంలో అల్స్, గుమ్మడికాయ విత్తనాలు, టిల్, సోయాబీన్ ఆయిల్ ని జతచేయండి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

10. పరీక్షల సాయంలో బైట ఆహరం తినొద్దు:

10. పరీక్షల సాయంలో బైట ఆహరం తినొద్దు:

పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అందువల్ల, సాధ్యమైనంత వరకు బైటి ఆహరం తినకండి. నిజంగా మీ పిల్లలు బైటి ఆహారానికి తపిస్తే, మీకు నమ్మకమున్న, పరిచయం ఉన్న రెస్టారెంట్ కు తీసుకువెళ్ళండి.

English summary

10 diet changes to help your kids top exams

A child’s diet is one of the most neglected aspects during their exams. It has been observed that even kids who usually eat healthy end up eating a lot of junk food and drink pots of coffee to stay awake during exam times.
Desktop Bottom Promotion