For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు ఆటలు ఆడుట వలన పొందే లాభాలు

By Super
|

క్రీడల వల్ల పిల్లలకు ఏవైనా లాభాలున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. క్రీడలు పిల్లల జీవితాలలో ప్రాధాన పాత్ర పోషిస్తాయి. క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిజానికి, పిల్లలకి ప్లేగ్రౌండ్ కు అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యకరంగా మీ పిల్లలు ఎదగాలని మీరనుకుంటే కచ్చితంగా మీ పిల్లలకు క్రీడలను అలవాటు చేయాలి. ఈ తరం పిల్లలు ఒబేసిటీతో బాధపడుతున్నారన్న విషయం తెలిసిందే. అటువంటి సమస్యలను అధిగమించాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలలో పాల్గొనే అలవాటు చేయాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి.

తల్లితండ్రులుగా, పిల్లలకు స్పోర్ట్స్ వల్ల కలిగే ప్రయోజనాలని మీరు తప్పక తెలుసుకోవాలి. మీ పిల్లలని ఆటలకు దూరంగా ఉంచడమంటే వారిని అందమైన బాల్యం నుంచి దూరంగా ఉంచడమేనని అర్థం చేసుకోండి. .

ఈ రోజులలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్స్ లేవు. ఇది చాలా విచారించదగ్గ విషయం. కళ్ళు తెరచుకుని మంచి తల్లిదండ్రులుగా పిల్లలకు ఆటల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. తద్వారా పిల్లలు చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

పిల్లలలో మానసిక ఎదుగుదల

పిల్లలలో మానసిక ఎదుగుదల

తాజా సర్వే స్పోర్ట్స్ లో పాల్గొనే పిల్లలు చురుగ్గా ఉంటారు. వీరు, వివిధ అంశాలపై ఫోకస్ ను మెయింటైన్ చేయగలుగుతారు. స్పోర్ట్స్ లో పాల్గొనడం వీరికి ఈ లాభాన్ని తెచ్చిపెడుతుంది. పిల్లలు చురుగ్గా ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యం. అందువల్ల, పిల్లలని స్పోర్ట్స్ వైపు ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం.

సోషల్ స్కిల్స్

సోషల్ స్కిల్స్

సోషల్ స్కిల్స్ అనేవి ఎంతో ముఖ్యమైన అంశం. పిల్లలు స్పోర్ట్స్ లో పాల్గొనడం ద్వారా ఈ స్కిల్ ను పెంపొందించుకుంటారు. మిగతా పిల్లల్ని కలిసి వారితో ఇంటరాక్ట్ అవడం ద్వారా ఈ స్కిల్స్ ను పెంపొందించుకునే సౌలభ్యం ఉంటుంది.

టీం వర్క్ మెళకువలు

టీం వర్క్ మెళకువలు

అవునండి, ఇది నిజం. క్రీడలలో పాల్గొనే పిల్లలలో టీం వర్క్ సామర్థ్యాలు ఎక్కువ. ఒక టీం విజయం సాధించడానికి అవసరమయ్యే లక్షణాలు పిల్లలు పెంపొందించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. దీని వల్ల పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత ఉద్యోగాలలో త్వరగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు.

మెదడు చురుగ్గా ఉంటుంది

మెదడు చురుగ్గా ఉంటుంది

తలలో ఉండే మెదడు అభివృద్ధి ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండే ఆరోగ్యకరమైన మెదడు వల్ల పిల్లలు చక్కగా నేర్చుకుని త్వరగా ఎదుగుతారు. ఆరోగ్యకరమైన మెదడు సులభంగా గుర్తుంచుకుని జ్ఞప్తికి తెచ్చుకునే శక్తిని కలిగి ఉంటుంది.

శారీరక ఎదుగుదల

శారీరక ఎదుగుదల

స్పోర్ట్స్ లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల కండరాల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అలాగే, ఎముకలు కూడా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అందువల్ల, తరచూ స్పోర్ట్స్ లో పాల్గొనమని పిల్లల్ని ప్రోత్సహించాలి.

గుడ్ పోస్టర్

గుడ్ పోస్టర్

క్రీడలలో చురుగ్గా పాల్గొనడం వల్ల శరీర భాష కూడా అభివృద్ధి చెందుతుంది. పిల్లల శరీరంలోని కండరాలు సరైన దిశలో ఎదుగుతాయి. తద్వారా సరైన భంగిమలో పిల్లలు ఎదుగుతారు.

ఆరోగ్యకరమైన గుండెకి, హెల్తీ శ్వాశకు

ఆరోగ్యకరమైన గుండెకి, హెల్తీ శ్వాశకు

కార్డియో వర్క్ అవుట్స్ గా స్పోర్ట్స్ ను పేర్కొనవచ్చు. మీ పిల్లల లంగ్స్ మరింత పటిష్టంగా పనిచేస్తాయి. రక్తప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. మీ పిల్లలలో స్పోర్ట్స్ పై ఆసక్తి కలిగించాలని అనుకుంటున్నారా? వారికి స్పోర్ట్స్ యొక్క గొప్పదనం గురించి వివరించి స్పోర్ట్స్ బేసిక్స్ ను వివరించండి. వారికే ఆసక్తి కలుగుతుంది.

రోగ నిరోధక శక్తికి

రోగ నిరోధక శక్తికి

మీ పిల్లలు క్రీడలలో పాల్గొంటే వారిలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ప్రకృతిలోని సహజసిద్ధమైన గాలిని వారు పీల్చడం ద్వారా కూడా వారు ఆరోగ్యంగా ఉంటారు. నిజానికి మీ పిల్లలు బయటి వాతావరణానికి అలవాటు పాడడం వాళ్ళ వారి శరీరంలో బాక్టీరియాతో పోరాడే శక్తి పెరుగుతుంది.

కాంపిటీటివ్ స్పిరిట్

కాంపిటీటివ్ స్పిరిట్

కాంపిటీటివ్ వరల్డ్ గురించి మీ పిల్లలు తెలుసుకోబోయే ముందు పిల్లలకు పోటీతత్వం గురించి కచ్చితంగా వివరించాలి. ఈ విషయాలు స్పోర్ట్స్ ద్వారా వారికి తేలిగ్గా అర్థమవుతాయి.

స్పోర్టివ్ వైఖరి

స్పోర్టివ్ వైఖరి

గెలుపోటములు జీవితంలో భాగమన్న నిజాన్ని పిల్లలు స్పోర్ట్స్ ద్వారా తెలుసుకుంటారు. ఒకవేళ ఓడినా నష్టమేమీ లేదన్న వైఖరిని పిల్లలు స్పోర్ట్స్ ద్వారా తెలుసుకుంటారు. గెలుపుకోసం పడే శ్రమను గుర్తిస్తారు.

ఏకాగ్రత

ఏకాగ్రత

స్పోర్ట్స్ పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించేందుకు తోడ్పడతాయి. ఏకాగ్రత అనేది ఎందులోనైనా విజయం సాధించేందుకు ముఖ్యమైన సాధనం. మీ పిల్లలు స్పోర్ట్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచకపొతే స్పోర్ట్స్ వల్ల కలిగే లాభాలను వారికి వివరించండి.

ఓర్పు

ఓర్పు

క్రీడలు పిల్లల్లో భౌతిక ఓర్పును కలిగిస్తాయి. ప్రతి ఆటను చివరి వరకు ఆడాల్సి రావడం వల్ల పిల్లలలో ఓర్పు పెరుగుతుంది. మీ పిల్లల్ని ఆటలకు ఎలా అలవాటు చేయాలని ఆలోచిస్తున్నారా? వారిని ఒకసారి ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్ళండి. ఆటలలోనున్న సంతోషాన్ని వారు తప్పక తెలుసుకుంటారు.

స్టామినా

స్టామినా

ప్రతి ఆట ఆటగాడి స్తమినాకు సవాల్ విసురుతుంది. పిల్లలను ఆటలలో పాల్గొనమని ప్రోత్సహించడం ద్వారా వారి స్టామినాని మరింత పెంపొందించుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారని అర్థం. ఫిజికల్ యాక్టివిటీస్ కు స్టామినా ఎంతో ముఖ్యం.

గెలుపు విలువ తెలుసుకుంటారు

గెలుపు విలువ తెలుసుకుంటారు

మీ పిల్లలు ఏదైనా ఆటలలో గెలుపొందిన ప్రతి సారి గెలుపు విలువ తెలుసుకుంటారు. గెలుపొందడం సులభం కాదన్న విషయం గుర్తిస్తారు. ఆటల ద్వారా పిల్లలు ఎన్నో విలువైన అంశాలను గ్రహిస్తారు. జీవితంలో గెలుపొందడానికి ఆటలు పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయి.

తల్లిదండ్రులు గర్వపడేలా

తల్లిదండ్రులు గర్వపడేలా

మీ పిల్లలు ట్రోఫీ గెలుచుకున్నప్పుడల్లా మీరు గర్వపడతారు. గెలుపొందిన పిల్లల తల్లిదండ్రులు అటువంటి చురుకైన పిల్లలను కన్నందుకు ఎంతో సంతోషంగా ఉంటారు. అటువంటి గొప్ప మూమెంట్స్ ని టేస్ట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరి.

English summary

15 Benefits Of Sports In Children's Lives

Are there any benefits of sports in children's lives? Well, there are so many. In fact, it is very important to expose kids to the playground if you really want your children to grow in a healthy way. It is a fact that the new age children are suffering from obesity. To counter such problems, it is very important to allow your kids to indulge in sports.
Story first published: Monday, January 19, 2015, 17:53 [IST]
Desktop Bottom Promotion