For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న పిల్లల్లో తెల్లజుట్టు నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

మీ పిల్లలు చిన్న వయస్సులోనే ప్రీమెచ్చుర్ గ్రేహెయిర్ సమస్యతో బాధపడుతున్నారా? పిల్లలు తెల్లవెంట్రులకలు సమస్యతో బాధపడుతున్నట్లైతే , అది తల్లిదండ్రులకు బాధకరమైన విషయమే...

సాధరణంగా 60 నుండి 70ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీబాధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. ముఖ్యంగా 20 నుండి 30ఏళ్ళవారిలో తెల్లవెంట్రుక ఒక్కటి కనబడితే చాలా ఇక వారి ఆందోళ అంతా ఇంతా కాదు, అలాంటిది చిన్న పిల్లల్లో తెల్ల జుట్టు కనబడితే పరిస్థితేంటి. రెండేళ్ళ వయస్సులోనే పిల్లల్లో తెల్లజుట్టు. దీనికి ఒక లాజికల్ ఎక్సప్లనేషన్ ఏంటంటే, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి.

పోషకాల లోపం మరియు డైట్ ను సరిగా అనుసరించకపోవడం మరియు ఇతర కొన్న కారణాల వల్ల చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కోవల్సి వస్తున్నది. డెర్మటాలజిస్ట్ ప్రకారం చిన్న పిల్లల్లో కనిపించే తెల్ల జుట్టును కొన్ని ప్రికాషన్స్ మరియు హోం రెమెడీస్ ద్వారా నివారించుకోవచ్చవని అంటున్నారు .

పిల్లల్లో తెల్ల జుట్టుకు కారణలేంటి:
కేశాలు ప్రోటీన్స్ వల్ల పెరుగుతాయి మరియు తలలోని చర్మంలోపల ఫోలిసెల్స్ ద్వారా జుట్టు పెరుగుతుంది. ఫోలిసెల్స్ చర్మం మీద కేశాలు మొలవడానికి సహాయపడుతాయి. జుట్టు వక్తి అందంగా కనబడటానికి ముఖ్య పాత్ర వహిస్తుంది . జుట్టు తెల్లబడటం ప్రారంభమైతే, అది ఆ వ్యక్తి యొక్క అందం మీద ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల్లో కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరి కారణాలేంటో తెలుసుకుందాము...

వంశపారంపర్యం:

వంశపారంపర్యం:

చిన్న పిల్లల్లో తెల్లజుట్టుకు ముఖ్య కారణం వంశపారం పర్యం వల్ల వస్తుంది . వారి వంశంలోని కుటుంబంలో చిన్న వయస్సు నుండే తెల్లజుట్టు లక్షణాలు కనబడితే వారి జనరేషన్ వారిలో కూడా అదే సమస్య ఉంటుంది.

చుండ్రు:

చుండ్రు:

చుండ్రుకు మరియు జుట్టు తెల్లబడుటకు చాలా దగ్గరి సంబంధం ఉందని కొన్ని రీసెర్చ్ ల ద్వారా తెలిసింది. అయితే ఇది ఒక్కటి మాత్రమే కారణం కాకపోవచ్చు. అంతర్గత కారణం అయ్యుండొచ్చు . చుండ్రు తీవ్రంగా ఉన్నప్పుడు తెల్ల జుట్టు వచ్చే అవకాశాలు ఎక్కువు.

వ్యాధులు మరియు దీర్ఘకాలిక జబ్బులు

వ్యాధులు మరియు దీర్ఘకాలిక జబ్బులు

కొన్ని రకాల డిజార్డర్స్ ట్యూబరస్ స్కలొరోసిస్ మరియు విటిలిగో మరియు హెయిర్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతాయి . ఇంకా సీజర్స్, ట్యూమర్స్ మరియు మరికొన్ని ఇతర కారణాలు కూడా అయ్యుండవచ్చు.

థైరాయిడ్:

థైరాయిడ్:

థైరాయిడ్ సమస్యలు పిల్లల్లో చాలా తక్కువ. కానీ,పిల్లల్లో థైరాయిడ్ కూడా తెల్లజుట్టుకు ఒక కారణం అయ్యుండవచ్చు . పిల్లల రక్తంలో ఎక్కువ థైరాయిడ్ కంటెంట్ ఉన్నట్లైతే కూడా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది

కరివేపాకు :

కరివేపాకు :

నూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకూ బాగా ఉడికించాలి.ఆ నూనెతో తలకు మసాజ్ చేయాలి . ఇది చాలా ఎఫెక్టివ్ గా పిల్లల్లో తెల్ల జుట్టును నివారిస్తుంది.

పెరుగు మరియు ఈస్ట్ :

పెరుగు మరియు ఈస్ట్ :

పెరుగులో ఈస్ట్ మిక్స్ చేసి రెగ్యులర్ గా ప్రతి రోజూ త్రాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నివారించబడుతుంది. తెల్ల జుట్టు నివారణకు ఇది ఒక ఉపయోగకరమైన హోం రెమెడీ

ఉసిరి:

ఉసిరి:

కొబ్బరి నూనెలో కొద్దిగా ఉసిరి ముక్కలు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నూనెను గోరువెచ్చగా తలకు పట్టించాలి. అలాగే ఉసిరికాయను నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఆ నీటితో పిల్లలకు తలస్నానం చేయించాలి

ఉసిరి మరియు బాదం ఆయిల్:

ఉసిరి మరియు బాదం ఆయిల్:

బాదం మరియు ఉసిరి నూనెను మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తలస్నానం చేయాలి. ఈ హోం రెమెడీ పిల్లల్లో తెల్ల జుట్టును నివారిస్తుంది.

 ఆవు పాలతో తయారుచేసిన బట్టర్:

ఆవు పాలతో తయారుచేసిన బట్టర్:

ఆవు పాలతో తయారుచేసిన బట్టర్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఈ హోం రెమెడీ ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది వీటిని ఉపయోగించిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం కనబడుకపోతే వెంటనే డాక్టర్ వద్ద చికిత్స తీసుకోవడం మంచిది. పరిస్థితి మరింత తీవ్రం కాకముందే చికిత్సనందించడం మరింత ఉత్తమం.

English summary

9 Effective Home Remedies To Treat Grey Hair In Kids:Prengnancy in Telugu

9 Effective Home Remedies To Treat Grey Hair In Kids, Nowadays, we find many kids suffering from premature graying. The early graying may be genetic problem, nutritional deficiency or bad hair care. Take a look at the cause, treatment and remedies in brief.
Desktop Bottom Promotion