For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు

By Nutheti
|

చినుకు పడితే చాలు.. చిన్నారులకు జలుబు, దగ్గు అంటూ.. రకరకాల సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి.. వాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగు నీళ్లు.. వర్షపు నీళ్లు తాకి.. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రిమీకీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం, అలవాట్లపై చాలా అలర్ట్ గా ఉండాలి.

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వైరస్ దాడి మొదలవుతుంది. స్కూల్ కి వెళ్తున్నప్పుడు.. ఆడుకుంటున్నప్పుడు వర్షంలో తడవడం.. లేదా.. వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు పిల్లలు. అలాంటప్పుడు వాళ్లకు ఎంజాయ్ మెంట్ ఇస్తూనే.. హెల్త్ పైనా శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలం తీసుకొచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి...

కాచిన నీళ్లు

కాచిన నీళ్లు

వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ కాబట్టి.. కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి. బయట దొరికే మజ్జిగ, నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. అలాగే ఐస్, కుల్ఫీ వంటి వాటికి దూరంగా పెట్టాలి.

పండ్లు

పండ్లు

వర్షాకాలం ఎక్కువగా దొరికే పియర్, బొప్పాయి, దానిమ్మ, నేరేడు, యాపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఫ్రెఫ్ అండ్ హాట్ గా

ఫ్రెఫ్ అండ్ హాట్ గా

పిల్లలకు ఏ పూటకు ఆ పూట వండి పెట్టడం మంచిది. ఉదయం, రాత్రి వేడివేడిగా వండి తినిపిస్తే మంచిది. చాలా మంది తల్లులు మొలకెత్తిన గింజలు పిల్లలకు ఇస్తుంటారు. కానీ.. వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది. అలా ఇవ్వడం కంటే ఉడకబెట్టి ఇస్తే మేలు.

జాకెట్

జాకెట్

స్కూల్ కి వెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా.. రెయిన్ జాకెట్ వేయడం మంచిది. పాదాలు కూడా వర్షపు నీటిలో తడవకుండా.. వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

శుభ్రంగా

శుభ్రంగా

ఆడుకోవడం.. అది ఇదీ ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులు బ్యాక్టీరియా, వైరస్ లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా. చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు చేయాలి.

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్

పిల్లలకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కి వానాకాలంలో గుడ్ బై చెప్పాలి. ఇవి అనారోగ్య కారకాలు. ఈ కాలంలో పిల్లలకు పెట్టే ఆహారంలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

English summary

Health Tips For Child In Monsoon: in telugu

Seasonal changes bring along various health problems. Just now, you are hit by summer heat but within a month or two, you will have to get wet in the monsoon rains. Even if you do not get wet in the rain, you often suffer from cold and cough in this season. In worst cases, you can suffer from viral fever.
Story first published: Tuesday, October 6, 2015, 15:02 [IST]
Desktop Bottom Promotion