For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో హోం సిక్ నెస్ ను దూరం చేయడానికి చక్కటి మార్గాలు

|

కొంత మంది పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ, సరిగా చదవకపోవడం వల్ల హాస్టళ్ళలో చేర్పిస్తుంటారు. అలా హాస్టల్లో చేర్చి ఇంటికి వచ్చారో లేదో అప్పుడే హాస్టల్ నుండి ఫోన్ ‘మీ అబ్బాయో..లేదా అమ్మాయో..' ఇంటికి వస్తానని బాగా ఏడుస్తోంది...అస్సలు ఆపడం లేదు...' అని చెబుతుంటారు . ఇంకేముంది..అప్పటికప్పుడు మళ్లీ హాస్టల్ కి వెళ్లి తమ పిల్లల్లి తమ వెంట తీసుకొచ్చే వరకూ వాళ్ళు ఏడు ఆపరు.

READ MORE: చిన్న పిల్లల్లో కోపాన్ని ఎలా తగ్గించాలి?

తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల ఏడుస్తున్నారోమోనన్న భయంతో వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఒక వారం తర్వాత మళ్లీ హాస్టల్లో దిగబెడుతుంటారు. ఆ మరుసటి రోజు నుండి తిరిగి పిల్లలు మారం చేయడం ప్రారంభం అవుతుంది. ‘నేను ఇక్కడ ఉండనే ఉండను...ఇంటికి వెళ్లిపోతాను...' అని మళ్లీ ఏడుపు ప్రారంభించింది. ఇలా చాలా మంది పిల్లలు ఇంటి మీద బెంగ పెట్టుకోవడం, తల్లిదండ్రులను విడిచి ఉండలేకపోవడం..వంటి పలు కారణాల వల్ల హాస్టల్ కి, ఆఖరికి ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే డేస్కాలర్స స్కూలుకు కూడా వెళ్లనని మారాం చేస్తుంటారు.

READ MORE: పిల్లలు తల్లితండ్రులకు చెప్పకుండా ఉండే 6 విషయాలు

అలాగని ఇంట్లోనే ఎన్నాళ్లని ఉంటారు? అందుకే పిల్లల్లో ుండే హోమ్ సిక్ నెస్ దూరం చేసే ప్రయత్నం చేయాలి. దీని వల్ల వారు స్కూల్ లేదా హాస్టల్ కి వెళ్లడమే కాదు...చదువుల్లో కూడా బాగా రాణించగలుగుతారు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం ...

 భావోద్వేగాలు అదుపులో:

భావోద్వేగాలు అదుపులో:

సహజంగా పిల్లల్ని ఒంటిరిగా బంధువుల ఇళ్లకు పంపడానికే తల్లిదండ్రులకు మనసొప్పదు. అలాంటిది ఎవరూ తెలీని హాస్టల్ కి పంపడం అంటే వారికి కొంచెం బాధగానే ఉంటుంది. అలాగని పిల్లలు హాస్టల్ కి వెళ్తున్నారని తల్లిదండ్రుల పిల్లల కంటే ముందే డల్ అయిపోవడం, డీలా పడిపోవడం మంచిది కాదు. అలాంటి భావోద్వేగాలు పిల్లలు చూస్తే హాస్టల్ కి వెళ్లాలి...బుద్దిగా చదువుకోవాలి...' అనేక ఆసక్తి, ఉత్సాహం వారిలో తగ్గిపోతాయి. అలాగే వారు హాస్టల్ కి వెళ్లిన తర్వాత కూడా ‘నేనొచ్చేటప్పుడు అమ్మనాన్నలు బాధపడ్డారు..ఇంట్లోనే వాళ్ల దగ్గరుంటేనే బాగుండేది..' అని ఇంటి మీద బెంగ పెరిగిపోతుంది. కాబట్టి పిల్లల్ని హాస్టల్ కి పంపేటప్పుడు తల్లిదండ్రులు వారికి ఎంత బాధ కలిగినా మనసులో దాచుకొని వారికి ధైర్యం చెప్పి పంపాలి. దీనివల్ల పిల్లలు కూడా ఎలాంటి బెంగ లేకుండా సంతోసంగా హాస్టల్ కి వెళ్లి, ఎలాంటి ఆలోచనలు లేకుండా బాగా చదువుకునే అవకాశం ఉంటుంది.

వారి అభిప్రాయం తెలుసుకోవాలి:

వారి అభిప్రాయం తెలుసుకోవాలి:

కొంత మంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండానే వారిని అదరబాదరాగానే తీసుకెళ్లి హాస్టళ్లో చేర్పిస్తుంటారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం పిల్లలకు ఇష్టం లేకపోతే వారు హాస్టళ్లో ఉండనంటే ఉండను అని మొండికేస్తారు. దాంతో మీరు చేసిన ప్రయత్నం వ్యర్థం అవుతుంది. కాబట్టి ముందుగా పిల్లలకు హాస్టల్ పట్ల ఆసక్తి ఉందో లేదో అడిగి తెలుసుకన్న తర్వాతే వారిని హాస్టళ్లో చేర్పిస్తే ఇలాంటి సమస్యలేవీ ఎదురుకాకుండా ఉంటాయి. దాంతో పాటు పిల్లలకు హాస్టల్ గురించి ఏమైనా భయాలుంటే వాటిని తొలగించడానికి ప్రయత్నించండి.

తగిన ప్రోత్సాహం అవసరం:

తగిన ప్రోత్సాహం అవసరం:

పిల్లల్ని హాస్టళ్లో చేర్పించాం..వారే వెళ్తారులే..’ అన్నట్లుగా కాకుండా వారు హాస్టల్ కి ఇష్టపడి వెళ్లేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. తద్వార వారిలో హోమ్ సిక్ నెస్ ఎదురవకుండా జాగ్రత్తగపడవచ్చు. ఇందుకోసం హాస్టల్ కి వెళితే అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతాయి. వారితో ఆటలు ఆడుకోవచ్చు...కలిసి బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదివచవచ్చు..’అంటూ వారి మనసు సానుకూల ఆలోచనలవైపు మళ్లించాలి. తద్వారా వారిలో హాస్టల్ కి వెళ్తున్నామనే బాధ, ఇంటి మీద బెంగను కొంత వరకూ తగ్గించుకోవచ్చు.

బెంగను దూరం చేయడానికి:

బెంగను దూరం చేయడానికి:

పిల్లల్లో ఇంటి మీద బెంగను దూరం చేయడానికి కొన్ని సూళ్లలో బడులు ప్రారంభమైన పదిహేను రోజులకు ‘హోమ్ సిక్ హాలిడేస్' పేరిట కొద్ది రోజుల పాటు సెలవులిస్తారు. ఇలా ఇంటికొచ్చిన పిల్లలతో ఏవేవో విషయాలు మాట్లాడుతూ సమయం వేస్ట్ చేయకుండా ...హాస్టళ్లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు, మీ బంధువు, స్నేహితుల పిల్లలు హాస్టళ్లో ఉండడం వల్ల ఎలాంటి లాభాలు పొందారు? ఎంతటి ఉన్నత చదువులు చదివారు...వంటి విషయాలను గురించి వివరించండి. తద్వార మళ్లీ హాస్టల్ కి ఎప్పుడెప్పుడు వెళ్తమా..అన్న ఆసక్తి వారిలో కలిగించండి. దీని వల్ల తిరిగి వాళ్లని హాస్టల్ కి పంపంచడం తల్లిదండ్రులకు సులభమవుతుంది.

అప్పుడప్పు వెళ్ళి చూసు రావాలి:

అప్పుడప్పు వెళ్ళి చూసు రావాలి:

పిల్లల్ని హాస్టళ్లో చేర్చేశాం కదా...అని గుండెపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోలేరు. తల్లిదండ్రులు. వారు హాస్టల్ కి వెల్లినప్పటి నుంచి సెలవులు ఎప్పుడొస్తాయా? వారిని ఎప్పుడెప్పుడు చూద్దామా? అిన ఎదురుచూస్తుంటారు. మరొకొంతమంది హాస్టల్ కి వెళ్లి వారిని చూసి వస్తుంటారు. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు..కానీ వారానికోసార అలా వెళ్లడం మంచిది కాదు. దాని వల్ల అదే అలవాటుగా మారిపోతుంది. ఏదైనా పనివల్ల మీరు వెళ్ళలేకపోతే వారికి తిరిగి ఇంటిమీద బెంగ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని వారినికోసారి కాకుండా నెలకు ఒకటి లేదా రెండుసార్లు వెళ్లడం ఈగ్యాప్ మరీ ఎక్కువ అనిపిస్తే మధ్యమధ్యలో ఫోన్ చేసి మాట్లాడడం ఉత్తమం.

వార్డెన్ తో మాట్లాడాలి:

వార్డెన్ తో మాట్లాడాలి:

పిల్లలు మీ దగ్గరే ఉంటే వారి ఆలనాపాలనా చూసుకుంటారు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మరి హాస్టళ్లో అయితే వారిని చూసుకోవడానికి హాస్టల్ వార్డెన్స్ ఉంటారు. కాబట్టి మీ పిల్లల్ని హాస్టళ్లో చేర్పించేటప్పుడే వారితో మాట్లాడి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. అలాగే టీచర్లకు కూడా పిల్లల్ని ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంచమని చెప్పండి. తద్వారా వారు వారి పనుల్లో నిమగ్నైపోవడం వల్ల ఇంటి ధ్యాస ఎక్కువగా ఉండదు. దాంతో వారి బెంగ రాన్రానూ తగ్గిపోతుంది.

English summary

How to Get Rid of Homesickness for Kids :Pregnancy Tips in Telugu

How to Get Rid of Homesickness for Kids, Pregnancy Tips in Telugu, Preparing a child mentally, physically, and emotionally for a stay away from mom and dad can be a good way to ensure they are less likely to be homesick. Try and set them up for success by doing these things before they go away.
Desktop Bottom Promotion