For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల ముందు జరిగే వాదులాట, పోట్లాటలని ఎలా సంభాళించాలి ??

By Super
|

మీ పిల్లలముందు మీ దంపతులిద్దరూ పోట్లాడుకోవడం అస్సలు ఆరోగ్యకరం కాదు.వాళ్ళు పెరిగి పెద్దయ్యేవరకూ హింస లేదా ఇతర నెగెటివ్ ప్రభావాలనుండి దూరం గా ఉంచడం మంచిది.

కానీ ఒక్కోసారి మీ కోపం కట్టలు తెగిపోతుంది.బాగా నిరాశ చెంది కోపాన్నంతా మీ భాగస్వామి మీద వ్రెళ్ళగక్కాలనిపించవచ్చు. మీ ఆగ్రాహాన్నంతా వ్రెళ్ళగక్కేసాకా అకస్మాత్తుగా మీ పిల్లలు ఈ తతంగాన్నంతా దూరం నుండి అలా నిశ్శబ్దం గా గమనిస్తున్నారని తెలుసుకుంటారు.

మీలోని ఇంకొక కోణాన్ని వారి ముందు ఆవిష్కరించానని సిగ్గు పడతారు కూడా.అలాంటప్పుడు ఏమి చెయ్యాలి?? సరే, అయిందేదో అయిపోయింది, దానిని మీరు మార్చలేరు.

ఈ అనుభవం భవిష్యత్తులో మీకు మీ పిల్లలకి ఒక పాఠం గా ఉండేటట్లు చూసుకోవాలి.అది ఎలా చెయ్యాలో తెలుసుకోవాలంటే చదవండింక..

How To Handle Arguments In Front Of Kids

పిల్లలముందు వాదులాటలని ఎలా సంభాళించాలి??

జాగ్రత్త:
మీరు మీకోపాన్ని అదుపుచేసుకోలేకపోతే కనుక మీ పిల్లల ముందే మీ భాగస్వామితో వాదులాట మొదలుపెట్టే అవకాశం ఉంది.అలాంటప్పుడు అరిచి గీ పెట్టకుండా మాటలని ఆచీ తూచి వాడండి.మిమ్మల్ని మీ పిల్లలు గమనిస్తున్నారని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసలండి అలాంటి పరిస్థితిలో.

How To Handle Arguments In Front Of Kids

నిజాయితీ
మీ మాటలూ, చేతలలో వీలయినంత నిజాయితీ ఉండేటట్లు చూసుకోండి.మీ పిల్లలు మీరు పోట్లాడుకోవడాన్ని చూడటానికి ఇష్టపడరు కానీ కొన్ని అనివార్య పరిస్థితులలో పిల్లల ముందే పోట్లాట జరుగుతుంది.ఒక బంధం లో ఉన్నప్పుడు వాదన తప్పదని మీ పిల్లలు గ్రహిస్తారు.

జరిగింది మర్చిపోయి మళ్ళీ కలిసిపోండి
మీ పోట్లాట అయ్యిన వెంటనే మీ భాగస్వామితో మళ్ళీ మామూలుగా కలిసిపోండి. పోట్లాట తరువాత కలిసిపోవటం ముఖ్యమని మీ పిల్లలు అప్పుడే తెలుసుకోగలుగుతారు

How To Handle Arguments In Front Of Kids

మాటలు:
మీరిద్దరూ పోట్లాట తరువాత కలిసిపోయాక వారితో మాట్లాడండి.ఈ తతంగాన్నంత నిశ్శబ్దం గా చూస్తున్న మీ పిల్లలకి ఏమి జరిగిందో వివరించడం అవసరం.ఇలాంటివి మామూలే అని కానీ ఇలాంటి వాద ప్రతివాదనలొచ్చినప్పుడు సామరస్యం గా పరిష్కరించుకోవాలని చెప్పండి.

ఇవీ మీ పిల్లలముందు సగౌరవంగా మీ పోట్లాటలని పరిష్కరించుకునే కొన్ని విధానాలు. మీకు

English summary

How To Handle Arguments In Front Of Kids

Fighting in front of your child isn't healthy at all. It is better to keep your kids far away from violence and other negative elements till they grow up.
Desktop Bottom Promotion