For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరీక్షలకు మీ పిల్లల్ని ఎలా సిద్దం చేస్తున్నారు?

|

వార్షక పరీక్షలొస్తున్నాయంటే చాలు..పిల్లలకే కాదు..పెద్దవాళ్లకూ టెన్షనే. ఈ క్రమంలో పరీక్షలు ఎలా రాస్తామో? అని పిల్లలు, మా పిల్లలకు మొదటి ర్యాంకు వస్తుందో? రాదో? అని వారి తల్లిదండ్రులు ఇలా ఎవరికి వారే మానసిక ఆందోళకు గురవుతుంటారు. ఇలాంటి ఒత్తిళ్ల వల్ల అనుకున్న ఫలితం దక్కకపోగా..పిల్లల ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ప్రణాళికతో తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తే...అటు పిల్లలు పరీక్షల్లో విజయం సాధించడంతో పాటు వారి ఆరోగ్యంపై కూడా ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు. మరి అందుకు కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

How To Help Your Child Prepare For Exams?

ఏ పరిక్ష ఎప్పుడు అని తెలుసుకోవాలి?
పిల్లల్ని పరీక్షలకు ప్రిపేర్ చేసే క్రమంలో ముందుగా వారి పరీక్షల టైమ్ టేబుల్ ను ఓసారి చూడండి. తద్వారా ఏ పరీక్ష ఎప్పుడెప్పుడు ఉందో తెలుసుకోవచ్చు. దానికి తగినట్టుగా ఉన్న సమయాన్ని బట్టి ఏ పరీక్షకు ఎన్ని రోజులు కేటాయించాలనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ తర్వాత అన్ని సబ్జెట్టులు చదవడానికి సమయం బాగా కలిసివచ్చేలా ఒక ప్రణాళిక తయారుచేయాలి. దీన్ని పిల్లలు చదువుకునే గదిలో, మీరుండే గదిలో కూడా అంటించండి. దాంతో అటు పిల్లలకు గుర్తుంటుంది. మీకూ దాన్ని చూసినప్పుడల్లా పిల్లల్ని చదివించాలనే విషయం గుర్తొస్తుంటుంది.

ఎందులో వీక్ అని తెలుసుకోండి?
అందరు పిల్లలూ అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ప్రణాళిక సిద్దం చేసేటప్పుడు ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకోవాలి. దీనికి అనుగుణంగానే..బాగా వచ్చిన సబ్జెక్టుకు కాస్త తక్కువ సమయం, నైపుణ్యం అంతగా లేని సబ్జెక్టులకు కాస్త ఎక్కువ సమయం కేటాయించేలా ప్లాన్ చేయండి. ఇలా రోజులో అన్ని సబ్జెక్టులకు సమయం సరిపోయేలా ప్రణాళిక ఉండడం మంచిది. ఎందుకంటే ఒక రోజు ఒకే సబ్జెక్టు చదవడం అంటే పిల్లలకు కూడా బోర్ గానే ఉంటుంది. రోజూ అన్నీ చదవడం ఆసక్తిగా ఉండొచ్చు. ఫలితంగా అన్నింట్లోనూ బాగా మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది.

How To Help Your Child Prepare For Exams?

దగ్గరుండి:
ఎక్సామ్ ప్రిపరేషన్ ప్లాన్ తయారుచేడయంతో పనైపోయిందనుకుంటున్నార? దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. ఎందుకంటే పిల్లలు ఒక్కరే కూర్చొని చదువుకోమంటే అంత శ్రద్ద పెట్టకపోవచ్చు. కాబట్టి వారితో చదివిస్తూ పాఠాలన్నీ నేర్చుకునేలా చేయాలి. ఒక వేళ కాస్త పెద్దవాళ్లయితే, వాళ్లే చదువుకోగలరని అనిపిస్తే వాళ్లను చదువుకోనివ్వండి. కానీ ఆరోజంతా ఏం చదివారన్నది మాత్రం వాళ్లను అడగాలి. అవసరమైతే మీరే వాళ్లు చదివిన పాఠ్యాంశాలపై చిన్న చిన్న పరీక్షలు పెట్టడం మరీ మంచిది. లేదంటే వాళ్లు మీరు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి చదవకుండా టైం పాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అడిగితే భయంతో శ్రద్దగా చదువకుంటారు.

అన్నీ ఉన్నాయా?
పిల్లల వార్షిక పరీక్షల కోసం చక్కటి ప్రణాళిక రూపొందించాం. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ వారికి చదువకోవడానికి, రాసుకోవడానికి ఇంకా ఏమైనా అవసరమున్న స్టడీ మెటీరియల్, పెన్నులు, పెన్సిళ్ళు, వంటివి ఉన్నాయా లేదో కూడా పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ లేకపోతే వాటిని వెంటనే కొని తెచ్చుకోవడం వల్ల పిల్లలకు సమయం వృథా కాకుండా ఉంటుంది.

సాయంత్రం కాసేపు:
ఎంత పరీక్షల సమయమైనా రోజు మొత్తాన్ని చదవడానికి కేటాయించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పిల్లలకు అంత సేపు చదివే మానసిక శక్తి ఉండదు. కాబట్టి, బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, వంటి సమయాల్లో చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వడంతో పాటు కనీసం రెండు గంటకొకసారైనా రీడింగ్ రూమ్ నుంచి పది నిముషాల పాటు అలా బయటకు రావడం, మధ్యాహ్నాం కాసేపు పడుకోవడం..వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది. వీటితో పాటు సాయంత్రం కాసేపు ఆటలకు కూడా కొంత సమయాన్ని కేటాయించడం వల్ల అటు చదువుపై శ్రద్ద పెట్టడంతో పాటు ఇటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

How To Help Your Child Prepare For Exams?

వేళకు ఇవి కూడా...
పరీక్షలు దగ్గర్లో ఉన్నాయి కదా..అని పిల్లలు మొత్తం చదువు ధ్యాసలోనే ఉండిపోతారు. మీరు వేళకు తినడం, నిద్రపోవడం...వంటివి చేస్తున్నార? లేదా? కూడా మనమే చూసుకోవాలి. ఈ సమయంలో పిల్లల మెదడు చురుగ్గా తయారుచేసే మంచి పోషకాహారం ఇవ్వడం, శరీరంలో నీటి శాతం పెంచడానికి నీరు ఎక్కువగా తాగేలా ప్రోత్సహించండం తప్పనిసరి. అలాగే ఈ సమయంలో పిల్లలు జంక్ ఫుడ్ జోలికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఎందుకంటే ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు ఇందులో ఉండే అదనపు క్యాలరీల వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారానికి పిల్లల్ని సాధ్యమైనంత దూరంగా ఉంచడం మంచిది.

సరిపడా నిద్ర: రాత్రుళ్ళు త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేచేలా పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే రాత్రి కంటే ఉదయాన్నే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చదివింది బాగా గుర్తుండే అవకాశ ఉంటుంది.

English summary

How To Help Your Child Prepare For Exams?

You must help your child prepare for exams. If you have a school-going kid, then you will surely face a stressful time during his or her exams. You want your kid to get through the exams with good marks. For that, you too might have to spend some time to help your kid prepare for his exams.
Story first published: Monday, March 23, 2015, 17:11 [IST]
Desktop Bottom Promotion