For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలకి వికారం,వాంతులా?? కారణం ఏమై ఉండొచ్చు??

By Super
|

మీ పిల్లలకొచ్చిన వికారం తగ్గకపోగా వాంతులకి దారి తీసిందా?? కొంచెం మోతాదులో అయ్యే వాంతులు ప్రమాదకరం కాదు. అవి త్వరగానే తగ్గిపోతాయి.సాధారణంగా పొట్టలో వైరుస్ చేరడం వల్ల కానీ ఆహారం విషతుల్యమవడం వల్ల కానీ వాంతులకి గల సాధారణ కారణాలు.మీ పిల్లవాడి వయసు 12 వారాలకంటే తక్కువైనా లేదా పిల్లల వాంతులతో మీరు కంగారు పడుతున్నా వైద్యుడిని సంప్రదించండి.


డీహైడ్రేషన్ లక్షణాలు:

డీహైడ్రేషన్ లక్షణాలు:

వాంతులవుతోంటే కనుక మీ పీల్లలలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూడండి.పెద్ద వారితో పోలిస్తే పిల్లలు త్వరగా డీ హైడ్రేట్ అవుతారు. మీ పిల్లవాడు అలసిపోవడం లేదా తిక్కగా ఉన్నా, నోరు ఎండిపోవడం,ఏడ్చినప్పుడు కొద్ది మోతాదులో మాత్రమే కన్నీరు రావడం,కాళ్ళ వాపు,ఒళ్ళు చల్లగా ఉండటం, మామూలు కంటే తక్కువ సార్లు మూత్ర విసర్జన, మూత్ర విసర్జన సమయంలో అతి తక్కువ మూత్రం రావడం లేదా మూత్రం చిక్కటి పసుపచ్చగా ఉండటం లాంటి లక్షణాలు డీహైడ్రేషన్ ని సూచిస్తాయి.

డీహైడ్రేషన్ ట్రీట్మెంట్:

డీహైడ్రేషన్ ట్రీట్మెంట్:

డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించగానే మొట్టమొదట మీ పిల్లవాడికి వీలైనన్ని ద్రవ పదార్ధాలు ఇవ్వండి.ఒక వేళ మీరు ఇచ్చిన ద్రవాలని వాంతి చేసుకున్నా ఫరవాలేదు, ద్రవాలు కొంచమైనా శరీరం లోకి వెళ్ళినట్లే.మంచి నీళ్ళూ,స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా ఓరల్ రీ హైడ్రెషన్ ద్రవాలైన పెడీలైట్,ఇంఫా లైట్, సెరాలైట్ వారికి ఇచ్చి చూడండి.వాంతి చేసుకున్న కాసేపటికి చాలా కొద్ది పరిమాణంలో ద్రవాలు ఇచ్చి మరి కొంతసేపటికి ఇంకొంచెం ఇవ్వండి. మరి కాసేపయ్యాకా మోతాదు పెంచి ఇంకొంచం ఇస్తే వారు దానిని శరీరం లో నిలుపుగోగలుగుతారు.ఈ క్రమంలో వాళ్ళు క్రమం తప్పకుండా మూత్ర విసర్జన చేసేటట్లు చూడండి.

సోడా

సోడా

చాలా సంవత్సరాల క్రితం వరకూ తల్లితండ్రులు పిల్లలకి వాంతులయితే నిమ్మ సోడా లేదా అల్లం రసం ఇచ్చేవారు.ఇప్పటికీ కొంతమంది డాక్టర్లు వీటిని సిఫారసు చేస్తారు.కానీ పిల్లకి వాంతులయినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ ద్రవాలే ప్రభావితమైనవని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.వీటిల్లో పంచదారా,ఉప్పు సమ పాళ్ళలో ఉంటాయి.లేదా సమపాళ్ళలో మంచి నీళ్ళు, స్పోర్ట్స్ డ్రింక్స్ కలిపి కూడా ప్రయత్నించవచ్చు.

ద్రవాహారం

ద్రవాహారం

మీ పిల్ల లేదా పిల్లవాడు ఆఖరుసారి కొన్ని గంటల క్రితం కనుక వాంతి చేసుకుని ఉంటే మీరు వారికి మంచి నీరు, ఓరల్ రీహైడ్రేషన్ సల్త్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ కి బదులు క్లియర్ గా ఉండే ఆపిల్ జ్యూస్ ద్రవ పదార్ధాలని ఇవ్వవచ్చు.ఇవి త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి.చారు,ఆపిల్ జ్యూస్, క్రాన్ బెర్రీ జ్యూస్ ఇవ్వవచ్చు. పోప్సికిల్స్(ఐస్ ఫ్ర్రొటు లాంటిది) లేదా జెల్లీ లు కూడా శరీరానికి కావాల్సిన ద్రవాలని అందిస్తాయి.

మందులు:

మందులు:

సాధారణం గా పిల్లలలో వాతులు నిమ్మ కాయని నాకించడం వల్ల పోతాయి.వాంతులవుతున్నపుడు వెంటనే మందులు వెయ్యకుండా కాసేపు వేచి చూస్తే మంచిది. వాంతులకి మెడికల్ షాప్ లో కొనుక్కొచ్చి వేసే మందులు పిల్లలకి మంచిది కాదు.వైరస్ వల్ల వాంతులవుతోంటే ఈ మందులు అస్సలు ఉపయోగపడవు.ఒకవేళ వాంతులు విపరీతం గా అవుతోంటే డాక్టర్లు వేరే మందులు సూచిస్తారు.

అల్లం:

అల్లం:

ఉదర సంబంధిత వ్యాధులు లేదా నెప్పి కి అల్లం వేల సంవత్సరాలనుండీ నివారిణి గా ఉపయోగపడుతోంది.అల్లం లో ఉండే రసాయనాలు పొట్ట, పేగులు, మెదడు, నాడీ వ్యవస్థ మీద సమర్ధవంతం గా పనిచేస్తాయని అధ్యయనకారులు నమ్ముతారు.ఇది పిల్లలలో కూడా వాంతులు, వికారాన్ని తగ్గిస్తుందని ఋజువు చెయ్యబడకపోయినా ఓ సారి ప్రయత్నిచవచ్చు. రెండేళ్ళు పైబడ్డ పిల్లలకి అల్లం వాడవచ్చు. మీ పిల్లల డాక్టరు ని వాంతులకి అల్లాన్ని ఎలా ఉపయోగించాలో అడిగి ప్రయత్నించండి.

ఆక్యూప్రెజర్:

ఆక్యూప్రెజర్:

కొంతమందిలో ఆక్యూప్రెజర్ వికారాన్ని తగ్గిస్తుంది.ఆక్యూప్రెజర్ లో ఒక భాగం లో నొక్కడం వల్ల శరీరం లో వేరెక్కడో మార్పు కనిపిస్తుంది. ఇది చైనీయుల ఆక్యూపంక్చర్ లాంటిది.పిల్లలో వికారాన్ని ఆక్యూప్రెజర్ ద్వారా పోగొట్టాలనుకుంటే మీ చూపుడు వేలు, మధ్య వేలుతో వారి మణికట్టు వెనకవైపు(అరచేయి మొదలయ్యే చోట) రెండు ఎముకల మధ్య భాగంలో నొక్కండి.

 డాక్టర్ ని ఎప్పుడు పిలవాలి:

డాక్టర్ ని ఎప్పుడు పిలవాలి:

మీ పిల్లవాడి వయసు 12 వారాలకంటే తక్కువ ఉండి ఒకసారి కంటే ఎక్కువ వాంతి చేసుకున్నా,డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా లేదా విషాన్ని సేవించారేమో అని అనుమానం వచ్చినా అతి జ్వరం,తలనెప్పి,దద్దుర్లు, మెడ పట్టెయ్యడం, కడుపు నెప్పి ఉన్నా లేదా కంగారుగా ప్రవర్తిస్తున్నా వారి వాంతిలో రక్తం లేదా పిత్తం కనిపించినా, బాగా అలసిపోయినట్లున్నా లేదా 8 గంటలపైబడి వాంతులు చేసుకుంటున్నా..ఇవన్నీ ప్రమాదకర లక్షణాలు.ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.


Desktop Bottom Promotion