For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలకు మాంసాహారం మొదటిసారి తినిపించడం ప్రారంభించడానికి 7 చిట్కాలు

By Super
|

మాంసాహారం మంచి ప్రోటీన్ కలిగిన అద్భుతమైన ఆహార మూలం, ఇది పిల్లల్లో బలాన్ని పెంపొందించి, కండరాల అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. అయితే, పిల్లలు పుట్టిన కనీసం ఒక ఏడాది తర్వాత మాత్రమే వారి జీర్ణ వ్యవస్థ ఈ ఆహారాన్ని తీసుకోగలదు.

READ MORE: మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
మీ పిల్లలకు మాంసాహారాన్ని ఇవ్వడానికి అవసరమైన అనుసరించవలసిన కొన్ని నియమాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

గుడ్లతో ప్రారంభించండి:

గుడ్లతో ప్రారంభించండి:

ఇది ప్రోటీన్ కి అద్భుతమైన మూలం, ఇది మీ పిల్లల జీర్ణ వ్యవస్థ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మీ శిశువు తొమ్మిది నెలల లోపు వయసు వుంటే గుడ్లను ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. మీ పిల్లల జీర్ణ వ్యవస్థ మాంసాహారాన్ని జీర్ణించుకునే పరిపక్వత చెందదు.

 ఒక సంవత్సరం వయసు తర్వాత మాత్రమే చేపలు, చికెన్ ఇవ్వండి:

ఒక సంవత్సరం వయసు తర్వాత మాత్రమే చేపలు, చికెన్ ఇవ్వండి:

మీరు మీ పిల్లలకు చికెన్ లేదా చేపలు ఇవ్వాలి అనుకుంటే, ఒక సంవత్సరం నిండే వరకు ఆగండి. మీ శిశువు 13 లేదా 14 నెలలు దాటినా తరువాత ప్రారంభించండి. అయితే, మీరు చేపలు, చికెన్ ను ముందుగా పెడుతుంటే దానిని ఉడకపెట్టిన రసం లేదా సూప్ రూపంలో ఇవ్వడం అవసరమని గుర్తుంచుకోండి, ప్రారంభ ఆహరం గా మాంసాన్ని ముక్కలుగా ఇవ్వడం మానేయండి.

చికెన్ కి ముందు చేపలు ఇవ్వండి:

చికెన్ కి ముందు చేపలు ఇవ్వండి:

మొట్టమొదటగా మీ పిల్లలకు మాంసాహారాన్ని పెట్టాలి అనుకుంటే మాంసం కంటే ముందు చేపలను పెట్టండి. చేపలతో ప్రారంభించి తర్వాత మాంసం పెట్టడం మంచిది. మీరు ముందు ఉడకబెట్టిన రసంతో ప్రారంభించి ఒక నెల తరువాత ఆవిరికి ఉడకించిన, ఉడికించిన లేదా కాల్చిన ముక్కలను పెట్టటం మీరు అనుసరించాల్సిన ఒక పద్ధతి అని గుర్తుంచుకోండి.

రెడ్ మీట్ నిదానంగా వెళ్ళండి:

రెడ్ మీట్ నిదానంగా వెళ్ళండి:

ఎర్ర మాంసం విషయానికి వస్తే, సాసేజ్, ముదురు ఎరుపు మాంసం కంటే గొర్రె మాంసం మంచి ఎంపిక. గొర్రె మాంసం కాకుండా, ఎర్ర మంసంలోని ఇతర రకాలలో నైట్రేట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మీ పిల్లల మెదడు చురుకు దనానికి దోహదపడుతుంది. మీ పిల్లలు ఐదు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉంటె ఎర్ర మాంసం పెట్టకుండా ఉండడం మంచిది.

మాంసాన్ని ఎక్కువగా ఉడకపెట్టకండి:

మాంసాన్ని ఎక్కువగా ఉడకపెట్టకండి:

చేపలు, మాంసం రెండిటికీ ఈ నియమాన్ని పాటించండి. మీ పిల్లలు మూడు సంవత్సరాల లోపు వారైతే ఎల్లపుడూ గ్రిల్, ఆవిరి, ఉడికించిన మాంసాన్ని మాత్రమే ఎంచుకోండి.

తక్కువ పెట్టండి:

తక్కువ పెట్టండి:

ప్రత్యేకంగా పిల్లలు, చిన్న పిల్లలు వారానికి రెండుసార్ల కంటే మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించండి. చేపలు, మాంసం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి తరచుగా తీసుకుంటే మీ పిల్లల జీవక్రియ స్థాయి తగ్గిపోతుంది. ప్రత్యేకంగా మీ పిల్లలకు చేపలు లేదా మాంసాన్ని రాత్రి భోజనంలో కాకుండా మధ్యాహ్న భోజనంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల తీసుకున్న ఆహరం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం ఉండి, తరువాతి ఆహారానికి సిద్ధంగా ఉంటారని తెలుసుకోండి.

మాంసాన్ని సరిగా ఉడికించండి:

మాంసాన్ని సరిగా ఉడికించండి:

మీరు మాంసాన్ని ఉడికించే ముందు బాగా కడిగి, శుభ్రంగా ఉందొ లేదో నిర్ధారించుకోండి. మీ పిల్లలకు ప్రాసెస్స్ చేసిన మాంసం కొనడం మానండి.

English summary

Seven tips to start your baby on non-vegetarian food: Pregnancy Tips in Telugu

7 tips to start your baby on non-vegetarian food: Pregnan Non-vegetarian food is an excellent source of first-class protein and contributes in a big way to promote muscle development and strength in children. However, your baby’s digestive system isn’t ready for it, at least during the first year after birth.
Story first published: Saturday, July 18, 2015, 12:40 [IST]
Desktop Bottom Promotion