For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల రెగ్యులర్ డైట్ లో తేనె చేర్చడానికి ముఖ్య కారణం

|

తేనె ఒక న్యూట్రీషినల్ ఫుడ్. దేవుడు మనకు ప్రసాధించిన ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే తేనె అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా తేనె తినడానికి తియ్యంగా ఉంటుంది. ఆ తియ్యదనం పువ్వుల మకరందం నుండి తేనెటీగలు స్వీకరించి, తేనె పట్టును పెడుతాయి. అంటే తేనె తయారుచేయడంలో తేనెటీగలు కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. తేనెటీగలు పువ్వుల యొక్క మకరందం(నెక్టార్)సేకరించి వాటికి నివాసాలుగా ఏర్పరచుకుంటాయి. దాంతో అది తేనెగా మార్పు చెందుతుంది.

తేనెలో అనేక వైద్యపరమైన గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి . ముఖ్యంగా తేనెను ఈజిప్ట్, గ్రీస్, రోమన్ మరియు ఇండియాలో తయారుచేసే ఔషధాల్లో చాలా ట్రెడిషినల్ గా తేనెను ఉపయోగిస్తుంటారు . అందుకే తేనెను చిన్న పిల్లల రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి ఇది శ్రీరామ రక్ష వంటింది. గొంతు నిప్పి నివారించడం నుండి లివర్ ఫంక్షన్ వరకూ ఎలా ఆరోగ్య సమస్యలైన సమర్దవంతంగా నివారిస్తుంది. కాబట్టి తేనె మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తేనె మనకు చాలా సహాయపడుతుంది.

Reasons To Include Honey In Child's Diet

ముఖ్యంగా పిల్లలకు అందించే తేనె నాణ్యమైనదై ఉండాలి. కమర్షియల్ లేదా లోకల్ తేనెను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరో ముఖ్య విషయం 12నెలలోపు పిల్లలకు తేనె మంచిది కాదు. ఎదిగే పిల్లలకు తేనె వల్ల అనేక ప్రయోజనాలను అందివ్వవచ్చు . పిల్లల రెగ్యులర్ డైట్ లో తేనెను చేర్చడానికి అనేక కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం...

ఎనర్జీ నిలకడగా ఉంచుతుంది: తేనె ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మరియు సుక్రోస్ నుండి తయారవుతుంది. నార్మల్ షుగర్స్ లో సుక్రోస్ మరియు గ్లూకోస్ కలిగి ఉంటుంది . ఇది చాలా త్వరగా జీర్ణం అవుతుంది మరియు చాలా త్వరగా శరీరం గ్రహించబడుతుంది. అందువల్ల ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. అయితే తేనెలో ఉండే ఫ్రక్టోజ్ అంత త్వరగా జీర్ణం కాదు కాబట్టి, ఇది ఎనర్జీగా నిలకడగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, పిల్లల్లో తక్కువ ఎనర్జీ లెవల్స్ కలిగిన వారికి తేనె ఒక ఉత్తమ ఆహారం.

Reasons To Include Honey In Child's Diet

విటమిన్స్ మరియు మినిరల్స్: బేబీ డైట్ లో తేనె చేర్చడానికి మరో ముఖ్య కారణం తేనెలో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి . పిల్లల ఎదగడానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు, తేనెలో ఉండే అమినో యాసిడ్స్ పెరిగే పిల్లల్లో శారీర పెరుగుదలకు ఎక్కువగా సహాయపడుతాయి.

కాలేయాన్ని రక్షిస్తుంది: ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల లివర్ పాడవుతుందని అనేక పరిశోధనలు నిర్ధారించాయి . అయితే తేనెలో కాలేయంను రక్షించే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్ల డైట్ లో దీన్ని చేర్చడం ఉత్తమం.

Reasons To Include Honey In Child's Diet

వ్యాధినిరోధకతను పెంచుతుంది: బేబీ డైట్ లో తేనె చేర్చడానికి మరో ముఖ్య కారణం, అనేక ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది . ఎదిగే పిల్లల డైట్ లిస్ట్ లో తేనె చేర్చినప్పుడు వారిలో వ్యాధినిరోధకత పెరుగుతుంది.

దగ్గు నివారిస్తుంది: పిల్లలు తరచూ దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటారు . దగ్గు వల్ల పిల్లల్లో నిద్రలోపిస్తుంది . కాబట్టి, తేనెలో దగ్గు నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చండి.

Reasons To Include Honey In Child's Diet

లో వైట్ బ్లడ్ సెల్స్ ను నివారిస్తుంది: కీమోథెరఫికి గురైన పిల్లల్లో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తక్కువగా ఉంటుంది . ముఖ్యంగా దీని వల్ల పిల్లల్లో క్యాన్సర్ సమస్య. కాబట్టి, నేచురల్ గా తేనెను తీసుకోవడం వల్ల లో వైట్ బ్లడ్ సమస్యను నివారిస్తుంది.

English summary

Top 6 Reasons To Include Honey In Child's Diet

Honey, in its most natural form, is one of the biggest gifts to mankind. This is a sweetened food, which is produced from the nectar of the flowers. The honey bees also play an important role in the making of the honey. They collect the nectar, swallow it and regurgitate in the hives. It is then transformed into honey.
Story first published: Tuesday, February 17, 2015, 17:56 [IST]
Desktop Bottom Promotion