For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడానికి కారణాలేంటి ?

By Nutheti
|

యుక్తవయసు రాగానే.. ఉద్యోగం.. అది సంపాదించాక.. పెళ్లి.. పెళ్లి అవగానే పిల్లలు.. ఇది భారతీయులు పాటించే నియమం. కానీ.. మారుతున్న కల్చర్... పెరుగుతున్నఅభిరుచులు... భారతీయుల ఇష్టాలు.. నియమాలలో మార్పులు తీసుకొస్తున్నాయి. సంప్రదాయాలను మార్చేస్తున్నాయి. అందుకే చాలామంది యువజంటలు.. పెళ్లి అయిన వెంటనే ఎందుకులే అని ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్నీని వాయిదా వేసుకోవడం ఈ రోజుల్లో చాలా సాధారమైందని చెప్పవచ్చు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు ఎందుకని ఫీలయ్యేవాళ్లే ఎక్కువున్నారు. దానికి వ్యక్తిగత కారణాలు ఒకటైతే.. ఆర్థిక కారణాలు మరో రీజన్ గా చెప్పవచ్చు.

ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడానికి కారణాలేంటి ?

ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడానికి కారణాలేంటి ?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. యుక్తవయసులోనే బాగా కష్టపడి.. బాగా సంపాదించాలి అని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కార్పొరేట్ లైఫ్ కి అలవాటుపడిన వాళ్లంతా.. కెరీర్, గోల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. లగ్జరీగా బతకడం ఇప్పుడు ప్రపంచాన్నినడిపిస్తున్న ట్రెండ్. అందుకే అన్నీ సమకూరిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు. ఇలా ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడానికి సాధారణంగా కనిపిస్తున్న కారణాలేంటో చూద్దాం..

ఆరోగ్య సమస్యలు

ఆరోగ్య సమస్యలు

కొంతమంది ఆరోగ్య సమస్యల కారణంగా.. ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. తాము ఫిట్ గా.. హెల్తీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే.. పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడని.. భావిస్తున్నారు.

వృత్తిపరమైన కారణాలు

వృత్తిపరమైన కారణాలు

కొంతమంది ఉద్యోగాల్లో బిజీగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటున్నారు. కొన్ని రోజులు కష్టపడితే.. తాము ఉన్నత స్థానానికి చేరుకుంటామని అనుకునే వాళ్లు.. గర్భధారణను వాయిదా వేసుకుంటున్నారు. బిజీగా ఉన్న సమయంలో.. పుట్టబోయే బిడ్డ సంరక్షణ కూడా కష్టమని భావించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ వయసును కూడా అంచనా వేసుకుని.. నిర్ణయం తీసుకుంటే మంచిది.

భార్యాభర్తల సంబంధం

భార్యాభర్తల సంబంధం

భార్యభర్తల మధ్య సంబంధం స్థిరంగా లేకపోవడం కూడా కారణమవుతోంది. తమ రిలేషన్ షిప్ గురించి అనుమానాలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఒకవేళ తాము విడిపోవాల్సి వస్తుందేమో అన్న అనుమానం వల్ల పేరెంటింగ్ కి దూరంగా ఉంటారు.

ఆర్థిక కారణాలు

ఆర్థిక కారణాలు

పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి.. కొంతమంది.. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాంలే అనుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయేమో అని అనుమానాలున్న వాళ్లు ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవాలని భావిస్తారు.

English summary

Why Some Couples Postpone Pregnancy

Some couples do postpone pregnancy after marriage. They do have their own reasons. In fact, raising a kid needs a lot of attention from the parents and also enough financial resources. So, no wonder postponing pregnancy has become common in today's world where stable relationships and stable finances have become difficult things.
Story first published: Monday, September 28, 2015, 12:07 [IST]
Desktop Bottom Promotion