అధిక క్రొవ్వుగల ఆహార పదార్ధాలు పిల్లల మెదళ్ళని ప్రభావితం చేస్తాయా??

Subscribe to Boldsky

చీజుతో నిండిన పిజ్జాలూ, నూనెలో వేయించిన సమోసాలని తినాలని అమితమైన కోరికగా ఉందా?? జాగ్రత్తా సుమా, ఇటీవలే జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఇలాంటి జంక్‌ఫుడ్స్ తిన్న పిల్లలో పెద్దయ్యాకా మానసిక సమస్యలు మరియూ ఙాన సంబంధ వ్యాధులయిన స్క్రిజోఫీనియా లేదా అల్జీమర్స్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిరూపించబడింది.

మన మెదడులో రీలిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది మెదడు యొక్క నాడి వ్యవస్థ లో ముఖ్య భాగమైన సినాప్సిస్ అనే భాగం చురుకుగా పని చేయడానికి దోహదపడుతుంది.ఈ అధ్యయనం ప్రకారం క్రొవ్వు శాతం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కీలక ప్రొటీన్ అయిన రీలిన్ నిల్వలు తగ్గిపోతాయిట.

ఫ్యాట్ ఫుడ్స్ పిల్లల బ్రెయిన్ ను ప్రభావం చూపుతాయా

చిన్న వయసులోనే ఇలాంటి మార్పులకి కారణం క్రొవ్వు అధికంగా ఉన్న ఆహారం, ఇది వారి మెదళ్ళ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మార్పులు కేవలం ఊబకాయం వల్లేఅ ఉత్పన్నమయ్యేవి కావు అని ఈటీహెచ్ జ్యూరిక్, స్విట్జర్లాండుకి చెందిన ఉర్స్ మేయర్ యొక్క అభిప్రాయం.

ఫ్యాట్ ఫుడ్స్ పిల్లల బ్రెయిన్ ను ప్రభావం చూపుతాయా

మెదడులోని ఒక భాగమైన ప్రిఫ్రోంటల్ కోర్టెక్స్ మీద అధ్యయనకారులు తమ దృష్టిని కేంద్రీకరించారు.ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం,సామాజిక ప్రవర్తన,మనిషి యొక్క పర్సనాలిటీ తదితర కీలక విషయాలని ప్రభావితం చేస్తుంది.

ఫ్యాట్ ఫుడ్స్ పిల్లల బ్రెయిన్ ను ప్రభావం చూపుతాయా

కౌమారంలో ఉన్నవారు క్రొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఙాన సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి ఆహారం వల్ల ప్రీఫ్రోంటల్ కోర్టెక్స్ పూర్తిగా వృద్ధి చెందదు.

క్రొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న జంతువుల యొక్క ప్రిఫ్రోంటల్ కోర్టెక్స్‌లో వికాసం కుంటుపడిందనీ,రీలిన్ ప్రొటీన్ యొక్క నిల్వలు పెంచడం ద్వారా వికాసం,కాగ్నిటివ్ ఫంకషన్స్ యధా స్థితికి వచ్చాయనీ ఫ్రాన్స్‌లోని ఇన్మెడ్ ఇన్స్టిట్యూట్‌కి చెందిన పాస్కల్ చావిస్ వివరించారు.

ఫ్యాట్ ఫుడ్స్ పిల్లల బ్రెయిన్ ను ప్రభావం చూపుతాయా

మాలిక్యులర్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురించిన దాని ప్రకారం కౌమారంలో ఉన్నప్పుడే సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రీఫ్రొంటల్ ఎదిగుదల పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుందిట.

English summary

Does Fatty Food Affect A Kid’s Brain?

Love to binge on fatty foods such as oily samosas and cheese-laden pizzas? Beware, as a new study warns that such children may be at risk of developing cognitive and psychiatric problems such as schizophrenia or Alzheimer's disease in their adulthood.
Story first published: Wednesday, November 30, 2016, 10:17 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter