For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్రెషన్ లో ఉన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి ??

By Swathi
|

మీ పిల్లలు రూమ్ లాక్ చేసుకుని గంటల తరబడి స్పెండ్ చేస్తున్నారా ? ఎంతసేపైనా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతున్నారా ? ఇలాంటి పరిస్థితులు చాలా మంది తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లల విషయంలో ఇలాంటి మూడ్ స్వింగ్ గమనించారంటే.. అలర్ట్ అవ్వాలి. పెరిగే పిల్లల్లో ఇలాంటి మూడ్ స్వింగ్స్ చాలా కామన్. కానీ ఇలాంటి లక్షణాలు.. ఎక్కువ రోజులు కనిపిస్తూ ఉన్నాయంటే.. కొన్ని తీవ్రమైన మానసిక సమస్యలకు కారణమవుతాయి.

డిప్రెషన్ అనేది భయంకరమైన.. హెల్త్ కండిషన్. ఇది.. ఏ వయసు పిల్లలు, ఏ జెండర్ వాళ్లనైనా ఇబ్బందిపెడతాయి. ఈ రోజుల్లో హై లెవెల్ లో ఒత్తిడి, కాంపిటీషన్ ఉంటుంది. స్కూల్ లో ఆత్మ విశ్వాసానికి సంబంధించి అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే చాలామంది పిల్లలు డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటారు.

వాళ్ల సమస్యను అర్థం చేసుకోవడంలో చాలా మంది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి.. పెరిగే పిల్లల్లో డిప్రెసన్ సమస్య కనిపిస్తూ ఉంటే.. దాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా వాళ్ల ఆలోచనలను మార్చాలి. అలాంటి సింపుల్ టిప్స్ తల్లిదండ్రుల కోసం..

మానసిక సమస్య

మానసిక సమస్య

ముందుగా.. డిప్రెషన్ అంటే.. తీవ్రమైన మానసిక పరిస్థితిగా గుర్తించాలి. మీ కిడ్ ఒక వ్యాధితో బాధపడుతున్నాడని.. వాళ్లకు.. నిపుణుల సలహా కావాలని గుర్తించండి.

తిట్టకూడదు

తిట్టకూడదు

మీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా అప్ సెట్ లో ఉన్నప్పుడు.. మీరు మరింత ఎక్కువగా తిట్టకూడదు. వాళ్లు డిప్రెసన్ లో ఉన్నప్పుడు మీరు తిట్టడం వల్ల.. వాళ్ల ఆలోచనలు మరింత తీవ్రమవుతాయి.

ఆందోళన వద్దు

ఆందోళన వద్దు

మీ పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారని మీరు ఆందోళన పడవద్దు. మీరు చాలా స్ట్రాంగ్ గా, సపోర్టివ్ గా ఉండాలి. అప్పుడే.. వాళ్లకు ధైర్యం వస్తుంది.

వాళ్లతో గడపడం

వాళ్లతో గడపడం

డిప్రెషన్ లో ఉన్న మీ పిల్లలతో కాస్త ఎక్కువ సమయం గడపండి. మీ బిజీ షెడ్యూల్ లో కాస్త వాళ్లను కూడా అర్థం చేసుకుని.. సమయం కేటాయించడం వల్ల.. వాళ్లు కాస్త రిలాక్స్ అవుతారు.

థెరపీ

థెరపీ

మీ పిల్లలు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్లను థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. అలాగే.. సెషన్స్ మిస్ అవకుండా.. జాగ్రత్త పడాలి. సైకాలజిస్ట్ దగ్గర మీరు మాట్లాడి.. పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

నిపుణుల సలహా

నిపుణుల సలహా

మీ పిల్లలు నిపుణుల సలహా పాటించేలా జాగ్రత్త పడాలి. మెడిసిన్స్ సమయానికి వేసుకోవడం, రిలాక్సేషన్ ఎక్సర్ సైజ్ లు చేయడం, హెల్తీ డైట్ ఫాలోఅవడం వంటి నియమాలు సరిగ్గా పాటించేలా దగ్గరుండి చూసుకోవాలి.

వారానికి ఒకసారి

వారానికి ఒకసారి

మీ పిల్లలను బయటకు తీసుకెళ్లడం, నలుగురితో కలిసేలా జాగ్రత్త పడటం చాలా అవసరం. కనీసం వారానికి ఒకసారి సినిమాకి లేదా.. ఇష్టమైన పని చేయడానికి అంగీకరించాలి.

English summary

How To Deal With A Depressed Child?

How To Deal With A Depressed Child? Do you feel that your child has been spending a lot of time locked in his/room, lately? Is your child quite withdrawn and seems sad all the time?
Story first published:Friday, August 12, 2016, 15:30 [IST]
Desktop Bottom Promotion